ఘనంగా “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ రిలీజ్: “CM Pellam” Movie Teaser Release

0
8
CM Pellam Movie Teaser Launch Event

ఘనంగా “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ రిలీజ్: “CM Pellam” Movie Teaser Release

జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ

ఈ రోజు మా సినిమా సీఎం పెళ్లాం టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ

దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు ఒక మంచి స్క్రిప్ట్ నాకు వినిపించారు. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్ గారు, ఇంద్రజ, అజయ్ గారితో మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

CM Pellam Movie Teaser Launch Event

నటి ఇంద్రజ మాట్లాడుతూ

సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్ గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్ లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ టీజర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న అలీ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ

దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాడు. అక్కడ బాగా స్థిరపడ్డాడు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉండనీయదు కదా మళ్లీ వచ్చాడు. సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నాడు.

CM Pellam Movie Teaser Launch Event

నటుడు అజయ్ మాట్లాడుతూ

సుమన్ గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా మా డైరెక్టర్ చూపించారు. మా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారి మంచితనం నన్ను ఆకట్టుకుంది. ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇంద్రజ గారు ఈ సినిమాలో హీరో అని చెప్పాలి. ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Diwali with MI – Bring Magic home (youtube.com)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here