‘భువన విజయమ్’ Pre-Release Event: పక్కా కంటెంట్ వున్న సినిమా.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
భువన విజయమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ: భువన విజయమ్ సినిమాలో నేను ప్రేక్షకుడి పాత్ర పోషించాను, స్క్రీన్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని పాత్రలని నేను ఎలా చూస్తానో, ఆడియన్స్ కూడా అలానే చూస్తారు. నాకు క్యారెక్టర్ చేస్తున్నంత సేపు నాకు చాలా సవాల్ గా అనిపించింది. ఈ సినిమాలో చాలా మంది ఎక్సపీరియెన్స్ నటీ నటులుతో చేయడం అనందంగా వుంది. పక్కా కంటెంట్ వున్న సినిమా భువన విజయమ్’.
థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ: ఒక ఈవివి సినిమాలు తలపించేలా ఈ సినిమాలో చాలా మంది నటీనటులు వర్క్ చేసారు. అంత మంది డేట్లు దొరకాలంటే చాలా కష్టం. కానీ నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమాని తీశారు. ఈ సినిమాలో రైటర్ గా డిఫరెంట్ రోల్ చేశాను. దర్శకుడు ప్రతిభావంతుడు మంచి భవిష్యత్ ఉంది. ఇది ఒక కుటుంబ నేపధ్యంలో జరిగిన కథ మరియు చాలా సరదాగా ఉంటుంది.
దర్శకుడు యలమంద చరణ్ మాట్లాడుతూ: మా చిత్రానికి మా నిర్మాతే అసలైన చక్రవర్తి. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా మొదటి సినిమాకే గొప్ప నటీనటులతో కలసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్ వేశాం. ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. అ గుర్తింపు గెలుపుతోనే వస్తుంది. ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే భువన విజయం ఓడి గెలిచినవాడి కథ. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని గెలిపించిన కథ. అదే ఈ భువన విజయం కథ. ఇందులో కామెడీ, ఫాంటసీ, థ్రిల్ అన్నీ వున్నాయి. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది’’.
నిర్మాత మాట్లాడుతూ: నటీనటులు, సాంకేతిక నిపుణల సహకారంతో సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరిగింది. మే 12న సినిమా విడుదలౌతుంది.
తారాగణం: సునీల్ ,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ , వైవా హర్ష , బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ , గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ ,సోనియా చౌదరి, స్నేహల్ కామత్ , షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు
టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: యలమంద చరణ్
బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా
నిర్మాతలు: కిరణ్, విఎస్కే
సమర్పణ: శ్రీమతి లక్ష్మి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సాయి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
పీఆర్వో : తేజస్వి సజ్జ
→”మా పాట మీ నోట” Telugu Lyrical Songs / @mapaatameenota
More like this:
పవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది – వాసుకి
Adipurush ట్రైలర్ : ప్రేక్షకులకు విజ్యువల్ ఫీస్ట్
Tags: ‘భువన విజయమ్’, Bhuvana Vijayam, Film Combat, filmcombat, Vennela Kishore, 30 Years Prudhvi, Dhanaraj, Shekar Chandra, Yalamanda Charan, Viva Harsha, Goprajau Ramana, Jabardasth Raghava, Sunil, Soniya Chowdary