‘యాధ్గిరి & సన్స్’ ట్రైలర్ విడుదల

0
54

శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నేడు
చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు.

WhatsApp Image 2023 04 26 at 3.41.12 PM anirudh, chandra kala pandiri, hero anirudh, madhu mani, mothilaal, nagaraj, raajeev kanakala, srinu bodda, vijay kuraakula, yadgiri, yadgiri and sons, yadgiri and sons trailer

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బిక్షపతి రాజు పందిరి మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న చిత్రం. ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు చాలా క్యాజువల్‌గా, నాచురల్‌గా ఉంటాయి. ఈ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులైన జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ అద్భుతంగా వుంటుంది. మార్తాండ్. కె. వెంకటేష్‌గారి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. అన్ని హంగులతో యాధ్గిరి & సన్స్ చిత్రాన్ని మే 5న రిలీజ్ చేయనున్నాము. అలాగే నేడు మా సినిమా ట్రైలర్ ను విడుదల చేశాం.ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.

WhatsApp Image 2023 04 26 at 3.41.13 PM anirudh, chandra kala pandiri, hero anirudh, madhu mani, mothilaal, nagaraj, raajeev kanakala, srinu bodda, vijay kuraakula, yadgiri, yadgiri and sons, yadgiri and sons trailer

అనిరుధ్, యశస్విని, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
కో డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బిక్షపతి రాజు పందిరి

WhatsApp Image 2023 04 26 at 3.41.12 PM 1 anirudh, chandra kala pandiri, hero anirudh, madhu mani, mothilaal, nagaraj, raajeev kanakala, srinu bodda, vijay kuraakula, yadgiri, yadgiri and sons, yadgiri and sons trailer

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here