- Advertisement -spot_img
HomeUncategorizedBichagadu2 || మోస్ట్ ప్రామిసింగ్ గా విజయ్ ఆంటోనీ ‘ బిచ్చగాడు-2’ ట్రైలర్

Bichagadu2 || మోస్ట్ ప్రామిసింగ్ గా విజయ్ ఆంటోనీ ‘ బిచ్చగాడు-2’ ట్రైలర్

- Advertisement -spot_img

2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీతో తెలుగులోనూ తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్ ను మరింత పెంచాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కనిపిస్తోంది. కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంత ఆసక్తికంగా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపించాడు. ఈ సారి ఇద్దరులా కనిపిస్తూ ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.
ఇంతకుముందు, సోషల్ మీడియాలో ‘యాంటీ-బిక్లి’ అనే కొత్త పదాన్ని ఉపయోగించి 4 నిమిషాల టీజర్, థీమ్ సాంగ్ ను విడుదల చేస్తూ సినిమా థీమ్ ను తెలియజేశాడు విజయ్. ‘బిక్లి’ అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడు అని అర్థం. అయితే Bichagadu2 లో విజయ్ ఆంటోని యాంటీ బికిలీగా కనిపించబోతున్నాడు.

ఇక ట్రైలర్ చూస్తే భారతదేశంలోనే 7వ అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అన్నీ అదిరిపోయాయి. ఓ రేంజ్ లో పరిచయమైన విజయ్ తర్వాత విమాన ప్రమాదానికి గురవుతాడు. అందుకు కారణం యాంటీ బికిలీ అంటూ మళ్లీ విజయ్ ఆంటోనీనే పరిచయం చేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజయ్ గురుమూర్తి మరణానికి సంబంధించిన సన్నివేశాలు.. యాంటీ బికిలీ ఎంట్రీ, కోర్ట్ డ్రామా ఇవన్నీ భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్నా చెల్లెల్ల ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను మరోసారి కట్టిపడేసేలా చూపించబోతున్నట్టు అర్థం అవుతోంది. సీక్వెల్ ట్రైలర్ చూస్తోంటే విజయ్ ఆంటోనీ మరోసారి బ్లాక్ బస్టర్ కంటెంట్ తోనే Bichagadu2 lo వస్తున్నట్టు కనిపిస్తోంది.

విజయ్ ఆంటోనీ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోన్న Bichagadu2 మే 19 న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్ లోనే అనౌన్స్ చేశారు. అంటే ఈ సమ్మర్ లో బిచ్చగాడు2తో ఆడియన్స్ మరో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నారని చెప్పొచ్చు.

తారాగణం:
విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు.

సాంకేతిక నిపుణులు
ఎడిటర్ : విజయ్ ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రాఫర్స్ : విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్
ఆర్ట్ డైరెక్టర్ : ఆరుసామి
యాక్షన్ : రాజశేఖర్, మహేష్ మాథ్యూ
రచయితలు : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోని
పి.ఆర్.ఓ : జిఎస్కే మీడియా
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
దర్శకుడు : విజయ్ ఆంటోని

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page