- Advertisement -spot_img
HomeUncategorizedప్రభాస్ తో సమరానికి సై అంటున్న - RamaBanam స్టార్ హీరో గోపీచంద్

ప్రభాస్ తో సమరానికి సై అంటున్న – RamaBanam స్టార్ హీరో గోపీచంద్

- Advertisement -spot_img

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు(మే 5) ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తు, ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులైంది. గతంలో వాసు(శ్రీవాస్) దర్శకత్వంలో చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి సినిమా చేద్దామని అన్నాను. ఆ సమయంలో భూపతిరాజా కథ చెప్పడం, అది మాకు నచ్చడం. అలా రామబాణం మొదలైంది.

పైగా, లక్ష్యం కి, రామబాణం కి సినిమా స్క్రిప్ట్ కి అసలు సంబంధం లేదు. రెండు వేరు వేరు కథలు. లక్ష్యం, లౌక్యం సెంటిమెంట్ ని కొనసాగిస్తూ అలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని వాసు భావించారు. అయితే అనుకోకుండా అన్ స్టాపబుల్ షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ గారు రామబాణం అనే అద్భుతమైన టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. భూపతి రాజా గారు ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓ కమర్షియల్ సినిమా లో మెసేజ్ ఇవ్వడం కష్టం. ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్తూనే.. ఒక మంచి సందేశం ఉంటుంది.

జగపతిబాబు గారితో నాకిది రెండో సినిమా. నేను అతన్ని అన్నయ్య అని పిలుస్తుంటాను. ఆయన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది. ఆయనతో నటిస్తుంటే, యాక్టర్ తో కాకుండా సొంత అన్నయ్యతో చేసినట్టు ఉంటుంది. అందుకే మా మధ్య సన్నివేశాలు అంతలా పండాయి. అంతకుముందు చేసిన లక్ష్యంలో కూడా ఆయన పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముందు మనం కథని చూడాలి. రామబాణంలో జగపతి బాబు గారిది కీలక పాత్ర. ఆయన పాత్రకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తేనే సినిమా నిలబడుతుంది. అలాగే, కుష్బూ గారితో కలిసి మొదటిసారి పని చేశాను. కాలేజ్ రోజుల్లో ఆమె సినిమాలు చూసి, ఇప్పుడు ఆమెతో కలిసి సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఆమె సెట్స్ లో సీనియర్ లా ప్రవర్తించలేదు. అందరితో చాలా సరదాగా ఉన్నారు. అదే సమయంలో ఆమె చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి సర్ ప్రైజ్ అయ్యాను. సినిమాకి ఆమె చాలా ప్లస్. ఇప్పుడు అమ్మని మమ్మీ అంటున్నారు. అన్నయ్యని బ్రో అంటున్నారు. పిలుపులే మారాయి. ఎమోషన్స్ మారలేదు. ఎన్నేళ్ళు అయినా ఎమోషన్స్ అలాగే ఉంటాయి. మంచి సినిమా ప్రేక్షకులకి ఎప్పుడూ కనెక్ట్ అయ్యేలా తీస్తే, ఏ జోనర్ సినిమాని అయినా ఆదరిస్తారు.

ప్రతి హీరోకి ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో జగపతి బాబు గారికి కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. సినిమా ఫలితం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి విజయవంతమైన సినిమా అందించాలనే ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది. అప్పట్లో సాహసం, అలాగే ఒక్కడున్నాడు.. ఈ రెండు సినిమాలు ఈ టైంలో చేస్తే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అలాంటి కథలు నా దగ్గరకు వస్తే నేనెప్పుడూ చేయడానికి సిద్ధంగానే ఉంటాను. పైగా, నా కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే చేశాను. ఇప్పుడు కథలు వింటూనే ఉంటాను. కథ నచ్చితే కొత్త దర్శకులతో కచ్చితంగా చేస్తాను. నన్ను నిలబెట్టింది స్టార్టింగ్ లో చేసిన విలన్ పాత్రలే. అంతటి పవర్ ఫుల్ రోల్స్ వస్తే ఎవరి సినిమాలో అయినా నటించడానికి సిద్దంగా ఉన్నాను.

నిర్మాత చాలా మంచి వ్యక్తి. నేనే ఆయనతో చెప్పాను. మరీ ఇంత మంచితనం ఉండకూడదని. అలాంటి నిర్మాత ఉంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది. కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. చాలా మంచి వ్యక్తులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page