- Advertisement -spot_img
HomeUncategorizedఅన్నపూర్ణ ఫోటో స్టూడియో: తరుణ్ భాస్కర్ ద్వారా రెండవ పాట విడుదల || AnnapurnaPhotoStudio 2nd...

అన్నపూర్ణ ఫోటో స్టూడియో: తరుణ్ భాస్కర్ ద్వారా రెండవ పాట విడుదల || AnnapurnaPhotoStudio 2nd Single Launch

- Advertisement -spot_img

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్ట్ లో వున్న సినిమా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో”. ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది క్యాప్షన్. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వెర్సటైల్ మూవీస్ ని తీసిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో, #AnnapurnaPhotoStudio.

30 weds 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన మోషన్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మాంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ చేతుల మీదుగా విడుదల చేశారు..

ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఆల్బమ్ లోని సెకండ్ సాంగ్ ను నేను విడుదల చేశాను. మామూలుగా ఫార్మల్ గా బావుందని చెబుతారు. కానీ ఈ పాట నిజంగా చాలా బావుంది. మళ్లీ మళ్లీ వినాలని ఉంది. సినిమాకు మంచి వైబ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ అద్భుతమైన సౌండింగ్ చేశారు. పాటలో మంచి క్వాలిటీ కనిపిస్తోంది. నేను కొన్ని విజువల్స్ చూశాను. యాక్టింగ్ పరంగా చైతన్య, లావణ్య ఇరగదీశారు అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ” తరుణ్‌ భాస్కర్ గారు మా పాటను విడుదల చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో వెన్నెల్లో ఆడపిల్ల అనే ఈ సెకండ్ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. ఫస్ట్ సాంగ్ రంగమ్మ చాలా వైరల్ అయింది. ఈ సెకండ్ సాంగ్ అంతకంటే ఎక్కువ వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తరుణ్‌ భాస్కర్ గారు నాకు సైన్మ అనే షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచీ తెలుసు. అప్పటి నుంచే ఆయనతో పనిచేయాలనుకుంటున్నాను.

ఫైనల్ గా ఈ రకంగా తరుణ్ తో అసోసియేట్ అయ్యే అవకాశం వచ్చింది. ఫస్ట్ సాంగ్ పాడిన ఎస్పీ చరణ్‌ గారే ఈ పాటనూ పాడారు. నా సినిమాలో ఆయన పాడటం చాలా సంతోషంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ ఫస్ట్ సాంగ్ రెట్రో స్టైల్ లో కంపోజ్ చేశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు చెందుముద్దు గారికి ధన్యవాదాలు. బిగ్ బెన్ బ్యానర్ ద్వారా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి కొత్త టాలెంట్ కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రంగినేని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అన్నారు.

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. ముందుగా మా పాటను విడుదల చేసిన తరుణ్‌ భాస్కర్ గారికి థ్యాంక్యూ. నేను తరుణ్‌ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేతుల మీదుగా ఈ పాట రిలీజ్ కావడం సంతోషంగా ఉంది.

గీత రచయిత శ్రీనివాస్ మౌళి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాలో మూడు పాటలు రాశాను. మొదటి పాట రంగమ్మా చాలా పెద్ద హిట్ అయింది. ఈ పాటకోసం దర్శకుడు చెందు గారు సీన్ చెప్పడంతో పాటు కొన్ని విజువల్స్ కూడా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. రెండు రాత్రులు కష్టపడి ఈ పాటను రాశాం. నాకు ఎంతో ఇష్టమైన ఎస్పీ చరణ్‌ గారితో పాటు రజిత బాగా పాడారు అని అన్నారు.

ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో
నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు.

సాంకేతిక నిపుణులు : సంగీతం – ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ – పంకజ్ తొట్టాడ, ఎడిటర్ – డి వెంకట్ ప్రభు, పీఆర్వో – జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత – యష్ రంగినేని, రచన దర్శకత్వం – చెందు ముద్దు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page