Ram Charan #RC16, జగదేక వీరుడు అతిలోక సుందరి 2 లో రామ్ చరణ్..?
‘అన్నీ మంచి శకునములే’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రతిభావంతులైన నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మించింది. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ‘ప్రియాంక దత్’ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మే 18న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
స్వప్న: మా ప్రయాణం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మొదలైయింది. మా వరకు అది పెద్ద మూవీ. మంచి కథ చేయడం అనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో అన్నీ మంచి శకునములే చేశాం. సినిమా చేస్తున్నపుడు దర్శకుడికి సపోర్ట్ గా ఉండటం మాకు ఇష్టం. అయితే, కరోనా వల్ల మా బ్యానర్ లో మూడు సినిమాలు ఒకేసారి జరగడం విశేషం. వేసవిలో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి, పది రోజులు హాయిగా గడిపి వస్తే ఆ జ్ఞాపకం మరుపురానిది. ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి వుంటుంది. కాకపోతే, తక్కువ సినిమాలు చేయడం వళ్ళ మనసుకి నచ్చినవి చేస్తున్నాం. సీతారామం నమ్మకం కంటే గొప్ప తృప్తిని ఇచ్చింది.
అందులో ప్రతి అడుగు ఒక సవాల్. పర భాష హీరో, ఖరీదైన లోకేషన్స్, మార్కెట్ ఎదురీత. ఇలా ప్రతీది సవాలే. అలాంటి సమయంలో సీతారామం హిట్ అవ్వడంతో మరోస్థాయికి తీసుకెళ్లింది. గౌతమీ గారు, ఊర్వశి గారు లాంటి ప్రముఖ నటులు పాత్రకు తగ్గట్టు గా ఈ సినిమాలో తీసుకున్నాం. ఈ సినిమాలో ఊర్వశి పాత్ర కొంచమే వుంటుంది. ఆ పాత్రకు ఆమెనే పర్ఫెక్ట్. ఈ సినిమా ఒక జ్ఞాపకం, ఎమోషన్ అన్నీ చాలా సెటిల్ గా వుంటాయి. పైగా, వాసుకి నా స్నేహితురాలు. అదే సమయంలో నందిని ఆ పాత్ర చెప్పడం, తను ఓకే చేయడం జరిగింది. గౌతమీ గారిని తీసుకోవాలని అందరి ఆలోచన.
సంతోష్ టాలెంటెడ్ యాక్టర్. అలాంటి నటులు అరుదుగా వుంటారు. ఈ చిత్రం ఖచ్చితంగా తనకి మంచి విజయం ఇస్తుంది. నందిని రెడ్డి భిన్నమైన కథలు, భిన్నమైన ఫార్మెట్ లో ప్రేక్షకులకి చెబుతుంటారు. అలా మొదలైయింది, కళ్యాణ వైభోగమే, పెళ్ళయిన జంట, ఓ బేబీ ఇలా అన్ని కాన్సెప్ట్ సినిమాలు. అన్నీ మంచి శకునములే కూడా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ స్టొరీ.
నందిని కథ చెప్పినపుడు విజువల్ గా ప్రత్యేకత మరియు ప్రేక్షకులు ఆ హాయిని పొందాలి. ఖర్చుతో కూడుకున్న విషయమే అని తెలిసిన బ్యూటీఫుల్ విజువల్ ఉండటం వళ్ళ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ వస్తుంది. పైగా ఇలాంటి కథ కి అలాంటి లోకేషన్స్ అవసరం. వైజయంతీ మూవీస్ కి 50 ఏళ్ళు పూర్తవుతుంది. మహానటి సినిమా తీసినప్పుడు నాన్నగారితో 10 కోట్లలో అయిపోతుందని చెప్పాము. కానీ, ఆయన నవ్వి ’25 కోట్ల లోపల తీయండి. పేపర్ మీద పద్దతి ప్రకారమే చేస్తాం.కానీ, కథ డిమాండ్ చేస్తే దానికి పెట్టాల్సిందే. అసలు, లెక్కలు వేసుకుంటే సినిమాలే చేయలేం. నాన్నగారు 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నిలబడ్డారు, ఇప్పుడు ఆయన పిల్లలుగా సినిమాలు తీస్తున్నాం. లెక్కలు వేసుకుంటే వ్యాపారాలు చేయలేం. సినిమాల్లోకి వచ్చామంటే అది ప్యాషన్ తోనే. మేమిద్దరం అక్కా చెల్లెల్లు అయ్యనప్పటికీ ఖచ్చితంగా ఆలోచనలు వేరుగా వుంటాయి. మా ఇద్దరి మధ్య మొదటి సినిమాకి కొట్టుకున్నాం(నవ్వుతూ) తర్వాత అండర్ స్టాండింగ్ కి వచ్చి ఎకో సిస్టం క్రియేట్ అయ్యింది.
ప్రియాంక: కునూర్ హిల్ స్టేషన్ లో ఈ సినిమా షూటింగ్ మొత్తం జరిగింది. మేము చిన్నప్పుడు నాన్నతో ఊటీ ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళం. మాకు హిల్ స్టేషన్ లో ఒక ఫ్యామిలీ కథ చేయాలని కోరిక ఉండేది. ఒకరోజు నందిని చెప్పిన కధ సూట్ అవ్వడం మాకు చాలా హ్యాపీ గా అనిపించింది. ప్రతి పాత్ర కథలో భాగమై వుంటుంది. ఇది హీరో హీరోయిన్ సినిమా కన్నా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. సినిమా కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ ని క్రియేట్ చేసాం. ప్రేక్షకులందరికీ అది ఓ చిన్న ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నాకు, ప్రియాంక కి కాస్టింగ్ అంటే ఇష్టం. కొన్ని సినిమాల్లో లెజెండరీని తీసుకోవాలి అనుకున్నప్పుడు నాన్న గారిని అప్ప్రోచ్ అవ్వుతాం. కథని సింపుల్ ఫీలింగ్ తో వింటాం. ఒక ప్రేక్షకుడిగా తెరపై చూడలనే ఆసక్తి ఆ కథ కలిగించగలిగే దానిని ఎంచుకుంటాం. ప్రాజెక్ట్ కె ప్రభాస్ గారైన, సీతారామం దుల్కర్, అన్నీ మంచి శకునములే సంతోష్ అయినా.. ఆ పాత్రలకు సరిపోతారని అన్నప్పుడే వచ్చారు కానీ లెక్కలు వేసుకొని కాదు.
జగదీక వీరుడు అతిలోక సుందరి కి పార్ట్ 2 చేయాలనేది అందరి కోరిక.
Tags: Ram Charan, Malavika Nair, Swapna Dutt, Ashwini Dutt, Anni Manchi Sakunamule