- Advertisement -spot_img
HomeUncategorizedExciting release of 'CheyyiCheyyiKalipeddam' song featuring the amazing trio: 'AnniManchiSakunamule' || ఆ...

Exciting release of ‘CheyyiCheyyiKalipeddam’ song featuring the amazing trio: ‘AnniManchiSakunamule’ || ఆ ముగ్గురితో ‘CheyyiCheyyiKalipeddam’ పాట విడుదల: ‘అన్నీ మంచి శకునములే’

- Advertisement -spot_img

#CheyyiCheyyiKalipeddam ఇటీవల స్వప్న సినిమా నుండి విడుదలైన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ తో పాటు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు స్పృష్టించాయి. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు గా, నందిని రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ తో వస్తున్నారు. గౌతమి, సౌకార్ జానకి, వాసుకి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్ ఇతరులు ముఖ్య తారాగణం.

ఈ రోజు, ఫోర్త్ సింగిల్- చెయ్యి చెయ్యి కలిపేద్దాం CheyyiCheyyiKalipeddam పాటను విడుదల చేసారు. మిక్కీ జే మేయర్ కనెక్ట్ అయ్యే సిట్యుయేషనల్ ట్రాక్‌ ఇవ్వగా వివాహ వేడుకలు ఎలా ఉంటాయో, ఎలాంటి సన్నాహాలు జరుగుతాయో చంద్రబోస్ సరిగ్గా వివరించారు. ఇది ప్రధానంగా వివాహ విందు గురించిన పాట. శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి వాయిస్ లు ఎంతో ప్రత్యేకత. నటీనటులందరూ కలిసి ఈ వేడుకను జరుపుకోవడం ఒక కన్నుల పండుగ. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ: దత్ గారి బ్యానర్ లో దాదాపు 14 సినిమాలు తీశాను. దాదాపు అన్నీ హిట్స్. రాజ కుమారుడితో మహేష్ బాబు, స్వప్న బ్యానర్ లో ఎన్టీఆర్, అలాగే ముగ్గురం కలసి అల్లు అర్జున్ ని పరిచయం చేశాం. ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసేవారు వస్తే బావుంటుందని ప్లాన్ చేసి నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినట్లు అనిపిస్తుంది(నవ్వుతూ). కాబట్టి అన్నీ మంచి శకునములే. ఈ పాట CheyyiCheyyiKalipeddam చూసినప్పుడు పెళ్లి సందడి చూసినంత ఆనందం కలిగింది. ఈ సినిమా లో హీరోయిన్ చాలా అందంగా వుంది. సంతోష్ శోభన్ కి అల్ ది బెస్ట్. నందిని, స్వప్న, ప్రియాంక ముగ్గురూ తెలివైన వాళ్ళు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ: నేను దత్తు గారు యాభై ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లలు వలన ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. దత్ గారు, రాఘవేంద్రరావు గారితో ముఫ్ఫై ఏళ్ళు పై బడిన స్నేహం. ఎప్పుడు కలసి ఆనందంగా నవ్వుకుంటాం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్ళు లాంటి వారు. నందిని రెడ్డితో జాగింగ్ ఫ్రండ్షిప్ (నవ్వుతూ). సినిమాలు కంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మహానటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసి దత్ ని తిట్టాను( నవ్వూతూ) తర్వాత సినిమా కూడా అలానే చేశారు. అయితే అన్నీ మంచి లాభాలు తీసుకొచ్చాయి. ఈ చిత్రానికి కూడ ఎక్కువ ఖర్చుపెట్టారని తెలుసు. ఇది కూడా లాభాలు తెచ్చిపెడుతుంది.

అశ్వినీదత్ మాట్లాడుతూ: 49 ఏళ్ల క్రితం సినిమా తీద్దామని విజయవాడ నుంచి బయలుదేరితే నవయుగ ఫిలిమ్స్ వారు మద్రాస్ లో అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అరవింద్ తో స్నేహం చేయి, నీకు అంత సక్సెస్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు( నవ్వుతూ) ఇక్కడికి వచ్చిన తర్వాత అరవింద్ గారితో, రాఘవేంద్రరావు గారితో గొప్ప స్నేహం ఏర్పడింది. నా జీవితంలో మర్చిపోలేని వేడుక ఇది. చాలా ఏళ్ల స్నేహం తర్వాత పెళ్లి సందడి చేసాం. కోటి ఇరవై లక్షలతో సినిమా చేస్తే 14 కోట్లు కలెక్ట్ చేసింది. అదే నమ్మకం ఉంది ‘అన్ని మంచి శకునములే’ #CheyyiCheyyiKalipeddam సినిమా మీదా…

పరిశ్రమలోకి వచ్చిన మొదట్లోనే ‘నందినీ రెడ్డి’ రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వనీదత్ ముగ్గురికి కలసి కథ చెప్పిందట. సో, ఈ ముగ్గురు నాకు మంచి శకునం. చిన్నప్పటి నుంచి ముగ్గురిని చూస్తూ పెరిగిన ప్రియాంక దత్ కి, ఇలా ముగ్గురిని వేదికపై చూడటంతో ఉబ్బితబ్బిపోయింది. స్వప్న దత్ కి నాన్నతో ఏదైనా సమస్య వుంటే రాఘవేంద్రరావు, అరవింద్, కి ఫోన్ చేసి సాల్వ్ చేయిస్తాను అని నవ్వుతు చెప్తుంది.

Read More:

ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా శ్రీలీలా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ సినిమా ప్రారంభం

Visibility
Publish
Template
URL

CheyyiCheyyiKalipeddam (1 of 1)

Separate with commas or the Enter key.

Most Used

Learn more about manual excerpts(opens in a new tab)

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page