హిట్ చిత్రాల ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా రూపొందించిన మూవీ ‘బలగం’. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్షన్ వహించారు. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా Balagam సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మాంచి స్పందనను రాబట్టుకుంది. కలెక్షన్స్‌తో పాటుగా ప్రశంసలను కూడా కొల్లగోట్టిందీ చిత్రం. మౌత్ టాక్‌తోనే Balagam సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సవంత్సరం రిలీజ్ ఐన చిత్రాల్లో Balagam సినిమా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయంగా దక్కించుకుంటోంది Balagam సినిమా. తాజాగా ఈ లిస్టులో మరో రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులను దక్కించుంటోన్న Balagam స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో.. ఉత్తమ నటుడు అవార్డు ప్రియదర్శికి, ఉత్తమ సహాయ నటుడు అవార్డును కేతిరి సుధాకర్ రెడ్డికి వరించింది. ఇది నిజంగా గొప్ప ఎచీవ్మెంట్. ఎందుకంటే ఈ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో.. 2021 ఏడాదిలో ఫహాద్ ఫాజిల్ జోజికు ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే గత ఏడాది మలయాళ చిత్రం నాయట్టు సినిమాకు కూడా అవార్డ్ వచ్చింది. తర్వాత అదే జాబితా లో Balagam సినిమా చేరింది.
తెలంగాణ ప్రాంతాన్ని ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవటమే కాదు. పలు అవార్డులను అందుకున్నBalagam సినిమా ఇప్పడు టార్చ్ బేరర్‌గా మారింది. నిజాయతీగా, జెన్యూన్‌గా రాసిన కథ, మూవీ మేకింగ్‌తో తెలంగాణలోని సిరిసిల్ల లో తెరకెక్కించిన Balagam చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అవార్డులను కొల్లగొడుతుంది.
ఓ కుటుంబంలోని పెద్ద మనిషి చనిపోతే అచట ఉండే మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల చుట్టూ కథాంశంతో Balagam సినిమా రూపొందింది. ప్రియదర్శి పులికొండ, కావ్యా కళ్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, సుధాకర్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.