- Advertisement -spot_img
HomeUncategorized'మ్యూజిక్ స్కూల్' సినిమాలో 11 పాటలు: Shriya Saran

‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో 11 పాటలు: Shriya Saran

- Advertisement -spot_img

శ‌ర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతంసంగీత సార‌థ్యం వ‌హించిన‌ మ‌ల్టీ లింగ్వువ‌ల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేస్తున్నారు. మ్యూజిక్ స్కూల్ సినిమాలో మ్యూజిక్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టించిన Shriya Saran మూవీ గురించి మాట్లాడుతూ

Heroine 'Shriya Saran' Exclusive Interview from 'Music School' Movie.
Heroine ‘Shriya Saran’ Exclusive Interview from ‘Music School’ Movie.

నేనున్నాను చిత్రంలో మ్యూజిక్ స్టూడెంట్‌గా క‌నిపించాను. ఇప్పుడు మ్యూజిక్‌ స్కూల్ చిత్రంలో మ్యూజిక్ టీచ‌ర్‌గా కనిపిస్తున్నాను. స్కూల్‌లో మ్యూజిక్, డాన్స్ నేర్చుకోవ‌టానికి పిల్ల‌ల‌కు పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు. అలాంటి వారికి మ్యూజిక్ నేర్పించ‌టానికి గోవా నుంచి హైద‌రాబాద్ వ‌చ్చే మ్యూజిక్ టీచ‌ర్ పాత్ర నాది. ఇప్ప‌డు స్టూడెంట్స్‌కు 90 శాతం వ‌చ్చినా ఇంట్లో సంతోషంగా ఉండ‌టం లేదు. 99 శాతం రావాల‌ని కోరుకుంటున్నారు. ఇది విద్యార్థుల్లో తెలియ‌ని ఒత్తిడిని పెంచేస్తుంది. మ్యూజిక్, డాన్స్‌, స్పోర్ట్స్ నేర్చుకోవ‌టం వ‌ల్ల మ‌న జీవితంలో క్ర‌మ శిక్ష‌ణ అల‌వ‌డుతుంది. మానసిక ఒత్తిడి అస్సలు ఉండదు.

మా అమ్మా నాన్న‌లు వారి త‌ల్లిదండ్రులంద‌రూ బాగా చ‌దువుకున్న‌వాళ్లు. ఓ స్టేజ్ వెళ్లిన త‌ర్వాత నేను కూడా ఒత్తిడికి లోన‌య్యాను. కానీ మా అమ్మ‌గారు న‌న్ను క‌థ‌క్ నేర్చుకోమ‌ని డాన్స్ వైపు దృష్టిని మ‌రలించారు. చ‌దువు, డాన్సుల‌తోనే స‌రిపోయేది. వేరే పిల్ల‌లులాగా నాకు ఇత‌ర పార్టీలు, బ‌య‌ట‌కు వెళ్ల‌టం వంటి వ్యాప‌కాల‌కు స‌మయం ఉండేది కాదు. ఎంత ఒత్తిడి ఉన్నా మ‌న పిల్ల‌ల‌ను క‌రెక్ట్ డైరెక్ష‌న్‌లోకి డైవ‌ర్ట్ చేయాలి. ఈ సినిమాలో అదే చూపించాం. అలాగ‌ని ఆర్ట్ మూవీలాగా ఉండ‌దు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మిళితమై ఉంటుంది.

మ్యూజిక్ స్కూల్

మా మ్యూజిక్ టీచర్ ఎప్పుడూ క‌ళ్లు తెరుచుకుని క‌ల‌లు క‌న‌మనేది. ఎందుకంటే అప్పుడే ఎంత హార్డ్ వ‌ర్క్ చేయాల‌నేది మ‌నం గ‌మ‌నిస్తామ‌ట‌. అలాంటి హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్ మా డైరెక్ట‌ర్ పాపారావుగారు. అస‌లు ఆయ‌న ఐఏఎస్ ఆఫీస‌ర్‌. సినిమాల‌కు సంబంధం లేద‌. కానీ ప్యాష‌న్‌తో హార్డ్ వ‌ర్క్ చేసి సినిమా చేశారు. ఆయ‌న ఇప్ప‌టికీ స్క్రిప్ట్స్ రాస్తుంటారు. ఆయ‌న ద‌గ్గ‌రున్న ఆరు స్క్రిప్ట్స్‌లో ఈ క‌థాంశంతో మ్యూజిక్ స్కూల్ సినిమా చేశారు.

కేవ‌లం చ‌దువుల‌కు సంబంధించే కాకుండా క‌ళ‌ల‌ను నేర్పించేలా చాలా స్కూల్స్ రావాలి. అంటే ముందు టీచ‌ర్స్‌ను మ‌నం త‌యారు చేయాలి. రీసెంట్‌గా ఇళ‌య‌రాజాగారు మ్యూజిక్ యూనివ‌ర్సిటీని లీడ్ చేస్తాన‌ని చెప్ప‌టం గొప్ప విష‌యం. అలా చాలా స్కూల్స్, యూనివ‌ర్సిటీలు వ‌స్తేనే క‌ళ‌ల ప‌ట్ల పిల్ల‌ల‌కు అభిరుచి పెరుగుతుంది.

మ్యూజిక్ అనేది ఇండియా లో సంస్కృతి మరియు సినిమాల్లో ఒక భాగం. క‌థ‌ను ముందుకు తీసుకెళ్లడంలో సంగీతం ఎంతో కీల‌కం.
నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో ఐదారు పాటలు ఉంటున్నాయి. ఇక ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో 11 పాటలున్నాయి. అదే నార్మ‌ల్ సినిమాకి, ఈ సినిమాకి గల తేడా. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇళ‌య‌రాజాతో వ‌ర్క్ చేయ‌టం నా అదృష్టం. పాపారావుగారి ద‌ర్శ‌క‌త్వంలో ‘మ్యూజిక్ స్కూల్’ కి ఇళ‌య‌రాజాగారి వంటి లెజెండ్రీ ప‌ర్స‌న్‌ చేయ‌టం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌. నాలుగు పాట‌లు కేవలం మ్యూజిక్‌తోనే ఉంటాయి. నాకు డాన్స్, అలాగే పాట‌లు పాడ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తాను.

More links:

→”మా పాట మీ నోట” Telugu Lyrical Songs    / @mapaatameenota  

Tags: మ్యూజిక్ స్కూల్, Film Combat, filmcombat, shriya saran, music school, maestro ilayaraja, dilraju, shriya

You May Like:

పవన్ కళ్యాణ్ అన్నయ్య తో మళ్ళి యాక్ట్ చేయాలనీ ఉంది – వాసుకి

Adipurush ట్రైలర్ : ప్రేక్షకులకు విజ్యువల్ ఫీస్ట్

Balagam:స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023: ‘బలగం’ చిత్రానికి ఉత్త‌మ న‌టుడుగా ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడుగా అవార్డుల‌ను గెలుచుకున్న కేతిరి సుధాక‌ర్ రెడ్డి

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page