- Advertisement -spot_img
HomeUncategorizedCustody ఒక బ్లాక్‌బస్టర్ : మీడియా తో డైరెక్టర్ వెంకట ప్రభు

Custody ఒక బ్లాక్‌బస్టర్ : మీడియా తో డైరెక్టర్ వెంకట ప్రభు

- Advertisement -spot_img

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘Custody’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాల తో Custody సినిమా రూపు దిద్దుకుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను పవన్‌ కుమార్‌ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కి ఎక్స్ల్లెంట్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న మూవీ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియా సమావేశంలో కస్టడీ హైలైట్స్ ని పంచుకున్నారు.

Custody జర్నీ కోవిడ్ సమయంలో వచ్చిన ఆలోచనతో మొదలైంది. అప్పుడే రాసుకున్నారు. ఈ కథ ఆలోచన కు ఇన్స్పిరేషన్ మలయాళం మూవీ నయట్టు. అయితే అందులో కమర్షియల్ యాంగిల్స్ వుండవు. తెలుగు తమిళ ఆడియన్స్ కోసం అని అనుకున్నప్పుడు కమర్షియల్ యాంగిల్స్ వుండాలి.

పెద్ద ఆశయాలతో వున్న ఒక నార్మల్ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది ఆలోచన. అలా రాయడం మొదలుపెడితే అలా కస్టడీ పుట్టింది. ‘లవ్ స్టొరీ’ లో ఒక పాట చూసి కస్టడీ లో నాగచైతన్య ఐతే ఈ పాత్రకు బాగా సూట్ అవుతాడని అనిపించింది. నాగచైతన్యకు కథ చెప్పడం , అది ఆయనకు చాలా నచ్చడం జరిగాయి. అలాగే నిర్మాత శ్రీనివాస గారు చేతులు కలిపారు. ఆయనకి తనతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని వుంది. అలా జర్నీ మొదలైయింది అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ వెంకట ప్రభు.

కస్టడీలో ప్రేమకథ కూడా వుంటుందా అనే ప్రశ్నకు బదులుగా శివ ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్. తనకి ఓ కుటుంబం వుంటుంది. అలాగే ప్రేమ ఆప్యాయతలతో వుంటుంది. మూవీకి మొదలు శివకి వచ్చిన ఓ సమస్య. తనది కాని సమస్యను తాను ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లర్ లా వుంటుంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేస్డ్ లో ఉంటుంది.

అరవింద్ స్వామీ గారికి ఉన్న పెద్ద ఇమేజ్, స్క్రీన్ పై చైతు కంటే పవర్ ఫుల్ గా కనిపించేల చేస్తుంది . అంత పవర్ ఫుల్ వ్యక్తిని ఎలా కంట్రోల్ చేస్తాడు అనే ఎక్సయిట్ మెంట్ ఆడియన్స్ లో కలుగుతుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర కూడా పవర్ ఫుల్ గా నడుస్తుంది.

నాగచైతన్య అద్భుతమైన యాక్టింగ్ చేసే హీరో. ఈ చిత్రంలో కొత్త నాగ చైతన్య ను చూస్తారు. సినిమాల్లో హీరోలని డిఫరెంట్ గా చూపించడానికి డైరెక్టర్ వెంకట ప్రభు ఇష్టపడతారు. ఇందులో కూడా చై చాలా కొత్తగా కనిపిస్తారు. యాక్షన్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేశాం. అన్నీ ఫ్రెష్ గా వుంటాయి.

Cutody కి మ్యూజిక్ ఎంత బలం చేకూర్చుతుందో ట్రైలర్ లో ఉన్న BGM వినే అర్థం చేసుకోవచ్చు. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజాగారు నెక్స్ట్ లెవల్ లో మ్యూజిక్ చేశారు. Custody మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా యూనిక్ సౌండ్ వింటారు ప్రేక్షకులు.

కస్టడీ ది డిఫరెంట్ వరల్డ్. మానాడులో లాగ పొలిటికల్ పార్టీ గురించి అండ్ సీఎం ఉండదు. తమిళనాడు లో కూడా ఇదే ప్రశ్న అడిగితె ఇదే సమాధానం చెప్పారు డైరెక్టర్.

రెండు భాషల్లో చేయడం చాలా కష్టమైన టాస్క్ అని, ప్రతి షాట్ రెండు సార్లు సీజీ చేయాలనీ , డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, రెండు భాషల్లో సెన్సార్లు,.. అలా దాదాపుగా రెండు సినిమాలు తీసినట్లే అని డైరెక్టర్ పంచుకున్నారు మెంటల్ గా ఫిజికల్ గా చాలా శ్రమ పడాల్సి వుంటుందని అన్నారు.

డైరెక్టర్ వెంకట ప్రభు శివ సినిమాకి పెద్ద ఫ్యాన్. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నారు. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు.

కస్టడీ లో కృతిశెట్టి పేరు రేవతి. చాలా అద్భుతంగా చేసింది. తన పాత్ర కథలో కీలకంగా వుంటుంది. తాను రాసుకున్న పాత్రకు తగ్గట్టు గా స్క్రీన్ పై కనిపిస్తుంది.

పాటలకు, డ్యాన్సుల విషయానికి వస్తే, ఓపెనింగ్ సాంగ్ వుంటుంది. అలాగే ఒక పాటని రెట్రో స్టయిల్ లో షూట్ చేసారు. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

వెంకట ప్రభు గారి కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే మొదలవుతుంది.

Tags: Film combat, filmcombat

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page