Kushi మూవీ సాంగ్: ప్రపంచ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో 5th
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగాగా Kushi మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘నా రోజా నువ్వే’ అనే పాట ప్రపంచాన్నే షాక్ చేస్తుంది. దాదాపు 15 మిలియన్ వ్యూస్ తో పాటు లక్ష లైక్స్ దక్కించుకొని ప్రపంచ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో 5th ప్లేస్ ని సొంతం చేసుకుని సత్తా చాటింది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల నుంచీ అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది.
హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే ఆలపించారు. ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ హైలైట్ ఐతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. ” అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది.
With full love ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2023
Our 1st song from #Kushi https://t.co/5fz4UVbsIJ pic.twitter.com/9c536r2bSN
ఈ సాహిత్యం అన్ని భాషల నుంచీ అద్భుతంగా కన్వే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆడియన్స్ Kushi మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను తమ ది బెస్ట్ ఆల్బమ్స్ లిస్ట్ లో పెట్టుకున్నారు. సినిమా థీమ్ ను తెలియజేస్తూనే అద్భుతమైన ఫీల్ నూ కలుగజేస్తున్న ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ సాంగ్స్ లో ఐదవ స్థానంలో నిలవడం.. మూవీ బ్లాక్ బస్టర్ కు ఒక ఉత్సాహం ఇస్తుందనే చెప్పాలి. థళ ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన Kushi చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.
సినిమా వివరాలు:- తారాగణం – విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు శరణ్య ప్రదీప్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: శివ నిర్వాణం
మేకప్: బాషా
కాస్ట్యూమ్స్ : పి.వెంకట్
స్టైలిస్ట్: రాజేష్
ప్రొడక్షన్ కంట్రోలర్: షేక్ షేక్షావలి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: డెంకల రామకృష్ణ
కళా దర్శకులు: ఉత్తర కుమార్ సూరిశెట్టి, చంద్రిక
స్టంట్స్ : పీటర్ హెయిన్, వి.వెంకట్
కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందా
రచన సహకారం : నరేష్ బాబు.పి
P.R.O: GSK మీడియా
కో-డైరెక్టర్: సురేష్ కుమార్
పబ్లిసిటీ డిజైనర్: కబిలన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్: జయశ్రీ లక్ష్మీనారాయణన్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
C.E.O: చెర్రీ
డి.ఓ.పి: జి.మురళి
డి & సౌండ్ మిక్స్ అన్నపూర్ణ స్టూడియోస్
VFX: మ్యాట్రిక్స్
Tags:#NaRojaNuvve #VijayDeverakonda #Samantha #Kushi #SaregamaTelugu #filmcombat
You May Like :