చిత్రం: ‘భువన విజయం’
నటి నటులు: సునీల్, వెన్నెల కిషోర్, రమణ గోపరాజ్, శ్రీనివాస్ రెడ్డి, వసంతి కృష్ణన్, వైవా హర్ష, పృథ్వి, ధనరాజ్, స్నేహాల్ కమత్, సోనియా చౌదరి, సత్తిపండు తదితరులు…
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: సాయి
నిర్మాత: పి ఉదయ్ కిరణ్
రచన, దర్శకత్వం: యలమంద చరణ్, శ్రీకాంత్
విడుదల తేదీ: 12.05.2023
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, రమణ గోపరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు ‘యలమంద చరణ్’ దర్శకత్వం వహించిన చిత్రం ‘భువన విజయమ్’. హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ భువన విజయం సినిమాపై ఆసక్తిని పెంచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని టార్గెట్ చేస్తూ, కొత్త పాయింట్ తో ఈ రోజు థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం?
కథ: ‘చలపతి'(రమణ గోపరాజ్) ఒక సినిమా ప్రొడ్యూజర్. కొత్త సినిమా ‘కథ’లు వింటుండగా, ఒక రోజు ప్రసాద్(శ్రీనివాస్ రెడ్డి), రేఖా రాణి(సోనియా చౌదరి), సాంబ మూర్తి(పృథ్వి), గంగులు(వైవా హర్ష), పెరుమాళ్ళు/డ్రైవర్, తేజు(స్నేహాల్ కమత్), రమణ ఈ ఏడుగురు వినిపించిన కథలన్నీ చలపతి(రమణ గోపరాజ్)కి నచ్చడంతో అందరిని ఒక ‘రూమ్’ లోకి పంపిస్తాడు. ఆ ‘ఏడుగురు’లో అందరికి కలిపి ఒక కథ మాత్రమే నచ్చుతుందో, ఆ పర్సన్ కి ‘పది లక్షలు’ అడ్వాంస్ ఇచ్చి సినిమా అగ్రిమెంట్ రాయించుకుంటాను అని చెప్తాడు? అయ్యితే ఆ ఏడుగురులో ఒకరు చనిపోతారు? అసలు అది ఎవ్వరు..ఎందుకు చనిపోతారు? అలాగే, ఆ ఏడుగురులో ఎవ్వరి కథ ని ఫైనల్ చేసారు? కథ ని ఓకే చేసే ప్రోసెస్ లో ఒకరికి ఒకరు ఫెస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది కథ…
కథనం, విశ్లేషణ: ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. అ గుర్తింపు గెలుపుతోనే వస్తుంది. ప్రతి మనిషి గెలుపు కోసమే పరిగెడతాడు. అయితే భువన విజయం ఓడి గెలిచినవాడి కథ. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని గెలిపించిన కథ. అదే ఈ భువన విజయం కథ. దాదాపు ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసిన ప్రతి ప్రేక్షకుడికి అసలు సినిమాలో ఏముంది అనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవ్వుతుంది. ఇక విశ్లేషణ లోకి వెళ్తే,
ఫస్ట్ ఆఫ్ ఇంట్రస్టింగ్ గా స్టార్ట్ అవ్వుతు కథ లోకి వెళ్తుంది. ముఖ్యంగా, ప్రొడ్యూసర్ ఆఫీస్ లో ఆ ఏడుగురు మధ్యలో సాగే పోటీతత్వం సగటు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఒక కుటుంబ తో కలిసి చాలా సరదాగా, ఈవివి సినిమాలు తలపించేలా కామెడీ, ఫాంటసీ, థ్రిల్ అన్నీ కలగలిపి డైరెక్టర్ తీసిన విధానం బాగుంది. సినిమాలో కొన్ని సీన్స్ అద్భుతంగా తీర్చి దిద్దారు. ముఖ్యంగా, ప్రొడ్యూజర్ & సునీల్ తో సాగే సీక్వెన్స్, పెరుమాళ్ళు తో జరిగే సీన్స్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తాయి. అలాగే ఒక దొంగ, ఎన్నడూ లేని విధంగా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి మాములు మనిషి గా ఎలా మారాడు? ఆఖరికి దేవుడు కూడా ఎమోషన్స్ కి ఎలా కరిగాడు? తెర మీద చూపించిన తీరు బాగుంది. దర్శకుడు కథ ని చెప్పడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సెకండ్ పార్టీ కూడ ఉంటుంది అని మేకర్స్ సినిమా చివరిలో హింట్ ఇవ్వడం విశేషం.
నటి నటులు పెర్ఫామెన్స్: ధనరాజ్, రమణ గోపరాజ్ ఇద్దరు ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం. అలాగే, సునీల్ ని మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సరికొత్తగా చూస్తారు. పెరుమాళ్ళు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తూ అందరిని కంటతడి పెట్టిస్తాడు. వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు కడుపుబ్బా నవ్విస్తాడు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, పృథ్వి తమ పాత్రలలో చక్కగా ఓదిగిపొయ్యారు.స్నేహాల్ కమత్, సోనియా చౌదరి ఇద్దరు ప్రతి సీన్స్ లో అద్భుతమైన యాక్టింగ్ తో తమ ప్రతిభ ను చాటుకున్నారు. తదితరులు తమ పరిధి మేరకు ప్రతి ఒక్కరు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘యలమంద చరణ్’ ఎంచుకున్న కథ ఎక్జ్యుక్యూట్ చేసిన విధానం బాగుంది. కాకపోతే, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా నెస్ట్ లెవల్ ఉండేది. చోటా కె ప్రసాద్ ‘ఎడిటింగ్’ తీరు పర్వాలేదు. ‘శేఖర్ చంద్ర’ అందించిన మ్యూజిక్ సినిమాకి అసెట్. అంతే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. ‘సాయి’ అందించిన సినిమాటోగ్రఫీ ఓ మేరకు పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కథ కి తగ్గట్టుగా రిచ్ గా చూపించారు .
రేటింగ్: 2.5/5
బాటమ్ లైన్: విలువలతో పాటు, పక్కా ఎంటర్టైన్మెంట్ ఈ ‘భువన విజయం’
Movie Cast & Crew:
సినిమా టైటిల్: భువన విజయం
బ్యానర్లు: హిమాలయ స్టూడియో మాన్షన్స్ & మిర్త్ మీడియా
నిర్మాతలు: పి.ఉదయ్ కిరణ్ & వి.శ్రీకాంత్
తారాగణం: సునీల్ శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి, 30 ఏళ్లు పృథ్వీ, ధనరాజ్, గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సతీ పాండు మరియు ఇతరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: యలమంద చరణ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
DOP: సాయి
ఆడియో ఆన్: ఆదిత్య సంగీతం
Tags: భువన విజయం, Review, Film Combat, filmcombat
You May Like This:
Custody review : జనాలకు మంచి జరుగుతుందంటే మనం ఎవరినైనా ఎదురించవచ్చు. అది CM ఐన PM ఐన..
‘యశ్ పూరీ’ హ్యాపీ ఎండింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
MalliPelli ట్రైలర్: సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ తో వస్తున్న ‘నరేష్ – పవిత్ర లోకేష్’.