ఆ హీరోయిన్ ‘కళ్ళ’తోనే అభినయించగల నటి: సంతోష్ శోభన్
‘అన్నీ మంచి శకునములే’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రతిభావంతులైన నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మించింది. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ‘ప్రియాంక దత్’ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మే 18న విడుదల కానున్న నేపథ్యంలో హీరో ‘సంతోష్ శోభన్’ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
5 ఏళ్ళ గ్యాప్ ‘పేపర్‌బాయ్’ చిత్రం తర్వాత సరైన కథ, సరైన టైమ్ లో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రారంభమైంది. నాకు మొదట గా అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్. అలా ఈ చిత్రం మొదలైంది. నేను కథ విన్నప్పుడు భారీ తారాగణం ఉంటుందని చెప్పారు. కాకపోతే, రాజేంద్రప్రసాద్, షావుకారు జానకి, వాసుకి, గౌతమి గారితో పని చేస్తాను అని ఊహించలేదు. వీళ్లందరితో కలిసి పని చేయడం మొదటిసారి. ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ ని డార్లింగ్ అని పిలుస్తా అది నాకు ఒక మెమొరబుల్ సంఘటన. ఆవిడ చాలా ఫ్రెండ్లీ. సీనియర్ గా ఆమె ఎక్సపీరియెన్స్ నాతో షేర్ చేసుకున్నారు. తొలిప్రేమ చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. అక్కతో సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.
నందినిరెడ్డి గారి అలా మొదలైంది సినిమా చూశాక, ఆమెతో సినిమా చేయాలనుకున్నా అనుకోకుండా ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్ జరిగింది. సో, ఆ విధంగా కథ నన్ను ఎట్రాక్ట్ చేసింది. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు. ఫ్యామ్ కామ్ (ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునే) లాంటి సినిమా. నందినీరెడ్డిగారు ఒరిజినల్ గా నవ్విసూ ఏడిపిస్తారు. ఈ సినిమాలో ఒరిజినల్ స్ట్రెంత్.. డ్రామా, ఎమోషన్స్, చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలే.
యూరప్ లో ఒక సీన్ వుంటుంది. ఆ సీన్ లో నా ఫేవరేట్ హీరో ప్రబాస్ ది పెట్టడం, పైగా ఆ సీన్ చాలా ఫన్ గా వుంటుంది. సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. నేను స్టేజి ఆర్టిస్ట్ నుంచి వచ్చాను. 13 ఏళ్ళ కెరీర్ లో నాకు ఎక్కడ ఆడిషన్ అనవసరం అనిపించలేదు, పైగా మనం ఏమిటో తెలియని వారికి నిరూపించుకోవడం లో అలా చేయడంలో తప్పులేదు. ఆడిషన్ ద్వారా నాకు రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో రుషి అనే పాత్ర చేశాను. ఏక్ మినీ కథలో బరువు మోసే పాత్ర చేశాను. ఇందులో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర పోషించాను. టీమ్ అంతా మహిళలే అవ్వచ్చు కానీ, దర్శక నిర్మాతలు నన్ను తమ్ముడి లా చూసుకున్నారు. డామినేట్ కు నో ఛాన్స్. హీరో కు ట్రీట్ మెంట్ ఎలా వుండాలో అలా వుండేలా చూసుకున్నారు.
అశ్వనీదత్‌గారి 50 ఏళ్ళ కెరీర్ బేనర్ లో నేను యాక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. అప్పట్లో నాన్నగారు ఓ సినిమా చేశారు. ఇప్పుడు నేను చేయడం నాకు దక్కిన గౌరవం. నాన్నగారు మంచి రచయిత. బయట నాన్నగారి గురించి చెప్తుంటే నాకు ఆయనతో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయానా అనే ఫీలింగ్ వస్తుంది. అలాగే, నాన్నగారు ఉన్నప్పుడు పెద్దగా తెలియలేదు. వెళ్ళిపోయాక ఆ ప్రభావం బాగా కనిపించింది. సోషల్ మీడియా లో కిరణ్ అబ్బవరం ఇలా కంపారిజన్స్ రావడం బాధాకరం.
మాళవిక కళ్ళతోనే అభినయించగల నటి. చాలా తక్కువ మందికి ఆ ప్రతిభ వుంటుంది. ఈ విషయంలో ఆమెను చూసి ఒక్కోసారి జెలసీగా ఫీలవుతా. అలాగే, ప్రతి చోటా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుంది. ప్రస్తుతం యు.వి. క్రియేషన్స్ తో, ఆ తర్వాత కొత్త బేనర్ లో కొన్ని సినిమాలు చేస్తున్నా త్వరలో వెల్లడిస్తా.