తెలుగులో SuperHero తరహా చిత్రాలు తక్కువే. కానీ సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆ చిత్రాలూ ప్రూవ్ చేశాయి. త్వరలోనే తెలుగులో మరో సూపర్ హీరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ”AMasterPiece” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘శుక్ర’, ‘మాట రాని మౌనమిది’ అంటూ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకు పూర్వాజ్ డైరెక్షన్ లో సినిమా బండి బ్యానర్ పై శ్రీకాంత్ కండ్రాగుల ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న రెండవ చిత్రం ఇది. మొదటి చిత్రం సై ఫై ఇతివృత్తముగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బ్యానర్ నుండి వచ్చే రెండవ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
”AMasterPiece” అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఓ మాస్టర్ పీస్ లాంటి సూపర్ హీరో సినిమా రాబోతోందని ఈ పోస్టర్ చూడగానే అర్థం అవుతోంది. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరోస్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందీ లుక్. ఇప్పటి వరకూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ పోస్టర్ లోనే అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. టైటిల్ లోని ఏ అక్షరం నిప్పులు చిమ్ముతూ వలయాకారంలో ఉంది.
ఆ వలయంలోని శక్తి హీరోకూ ఉందనే అర్థం వచ్చేలా అతని కుడిచేతికి సైతం అదే కనిపిస్తోంది. అతని వెనక శివలింగంతో పాటు.. నెలవంక నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడి పరిణామక్రమం కూడా ఉంది. AMasterPiece పోస్టర్ లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోన్న అంశం కూడా ఇదే. సింపుల్ గా కనిపిస్తున్నా చాలా పవర్ ఫుల్ పాత్రనే డిజైన్ చేసినట్టున్నాడు దర్శకుడు. హాలీవుడ్ రేంజ్ కంటెంట్ తో వస్తున్నారని అర్థం అవుతోంది.పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చేలా ఈ సూపర్ హీరో పాత్రను డిజైన్ చేశారు.
హాలీవుడ్ రేంజ్ మేకింగ్, టేకింగ్ తో రాబోతోన్న ఈ చిత్రంలో తారాగణం:
రచన & దర్శకత్వం: సుకు పూర్వజ్
నటీనటులు: అరవింద్ కృష్ణ | ఆశు రెడ్డి | స్నేహ గుప్తా
నిర్మాత : శ్రీకాంత్ కాండ్రాగుల
బ్యానర్: సినిమా బండి ప్రొడక్షన్స్
ప్రెసెంట్స్: శ్రీకాంత్ కాండ్రాగుల
DOP: శివ చరణ్
పబ్లిసిటీ డిజైన్స్: MKS మనోజ్
కాస్ట్యూమ్స్: రియా పూర్వాజ్
PRO : జిఎస్కే మీడియా
Tags: #AMasterPiece #cinemabandi #trending #trendingshorts #tollywood #manasuperhro #apnasuperhero #SrikanthKandragula #ashureddy #ashu #arvindkrishna #sukupurvaj
You May Like This:
‘భువన విజయం’ Review: విలువలతో పాటు, పక్కా ఎంటర్టైన్మెంట్..
Custody review : జనాలకు మంచి జరుగుతుందంటే మనం ఎవరినైనా ఎదురించవచ్చు. అది CM ఐన PM ఐన..