మేమ్ ఫేమస్ #MemFamous: పోకిరి తరహాలో బ్లాక్ బాస్టర్ క్రియేట్ చేయనుందా?
సుమంత్ ప్రభాస్, మౌర్య చౌదరి, మణి, అంజిమామ, సిరిరాశి, హాని సార్య, ముఖ్య పాత్రలు గా నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’ #MemFamous, సరికొత్త కథలను నిర్మించే ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మింస్తున్న ఈ చిత్రానికి విజయ్‌దేవరకొండ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, నాగచైతన్య వంటి ప్రముఖులు సపోర్ట్ గా నిలిచి MemFamous సినిమా కు మరింత హైప్ క్రియేట్ చేశారు. దాదాపు 35మంది కొత్త నటి నటులను తెలుగు తెరకు ఇంట్రడ్యూజ్ చేయడం విశేషం. ఇప్పటికే, విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందింది. రాహుల్ సిప్లిగంజ్ గాత్రంతో చక్కటి సాహిత్యం తో కూడిన ‘అయ్యయో.. ఏమయింది గుండెల్లోన..’ పాట ఆకట్టుకుంటుంది. మేమ్ ఫేమస్ #MemFamous, చిత్ర యూనిట్ థావత్ అనే ప్రోగ్రామ్ తో ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించి టీజర్, రెండు పాటలను విలేఖరులకు ప్రదర్శించారు.
‘శరత్ చంద్ర’, సినిమా అవుట్ పుట్ చూసి మీడియా అందరితో కలిసి థావత్ చేసుకోవాలని ఈ ప్రెస్‌మీట్ పెట్టాం. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ తో కలిసి అంతా కొత్త వారిని లాంఛ్ చేయడం హ్యాపీ. కొత్త వ్యక్తులతో పని చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ ఏమిటో ఈ సినిమాలో చూడబోతున్నాం. 2012 లో నేను, అనురాగ్ జర్నీ మొదలు పెట్టి, మేమ్ ఫేమస్ వరుకు మా సినిమా జర్నీ చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ‘మనం చేసిన మంచి ఎక్కడికి పోదనేది’ సినిమాలో డైలాగ్ వుంది. అదే మాకు వర్తిస్తుందని అనుకుంటున్నాం. చాలామంది మాకు సపోర్ట్ గా నిలిచారు. గీతా ఆర్ట్స్ రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. సరిగమ ద్వారా ఓవర్‌సీస్ లో రిలీజ్ అవుతుంది. వైజాగ్ లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూశాక అందరూ మజా చేస్తారని హామీ ఇస్తున్నాను.
‘అనురాగ్ రెడ్డి’, నేను ఏమి లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అందుకే ఏమీ లేని వారి తోనే (కొత్తవారితో) ముందుకు నడవాలని అనుకుంటున్నా. అలాగే, ఇంకా బెటర్ ఫిలింస్ చేస్తూనే వుంటాం. 18 ఏళ్ళకే టిక్ టాక్ లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డైరెక్టర్ గా అయ్యాడు. ఇలా అంతా యూత్ చేసిన సినిమా. టీజర్, సాంగ్స్ కు ప్రమోషన్ చేసిన అందరికీ థ్యాంక్స్. లహరి ఫిలింస్ ‘చంద్రు మనోహర్’ 30మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది. దర్శకుడు ఎంతో ప్రతిభావంతుడు.
రచయిత, దర్శకుడు ‘సుమంత్ ప్రభాస్’, కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికే ‘ఛాయ్ బిస్కెట్’ సంస్థను స్థాపించినందుకు నిర్మాతలకు ధ్యాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా వుంటుంది. ఈ సినిమా ప్రమోషన్ కు ప్రముఖ హీరోలంతా సహకరించడం, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కుటుంబాన్ని గుర్తు చేసింది. ఈ సినిమా ఒక ఊరిలో జరిగే కథ, కాబట్టి కాస్ట్యూమ్ డిజైనర్ గా మా కాలేజీ సీనియర్ శివను ఎంపిక చేశాం. నా ఫ్రెండ్ దుర్గ కాస్టింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. కళ్యాణ్ మంచి సంగీతం సమకూర్చారు. ‘పిల్ల పిల్లగాడు’ వెబ్ సిరీస్ కూడా కళ్యాణ్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు. మేమ్ ఫేమస్ లో 9 ఎనర్జిటిక్ సాంగ్స్ వున్నాయి.
సంగీత దర్శకుడు ‘కళ్యాణ్ నాయక్’, రైటర్ పద్మభూషణ్ తర్వాత ఈ బేనర్ లో నాది రెండొవ చిత్రం. ఈ సినిమాలో పాటలన్నిచాలా బాగుంటాయి. ఇందులో ప్రతి క్యారెక్టర్ మన కుటుంబ సభ్యులను టచ్ చేస్తుంది. ‘కెమెరా మెన్ శ్యామ్’, దర్శకుడు సుమంత్ షూటింగ్ లో ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా చూస్తే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎడిటర్ ‘సృజన’, నాకిది మొదటి సినిమా. చాలా ప్రత్యేకమైంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నటుడు ‘అంజి మామ’, నాకిది 2వ సినిమా. సుమంత్ ను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. నటుడు ‘కిరణ్ మచ్చ’, దర్శక నిర్మాతలు మాకెంతో సపోర్ట్ చేశారు. సెలబ్రిటీస్ తో కలుస్తున్నామంటే అందుకు వారే కారణం. సినిమాపరంగా చెప్పాలంటే ఊరిలోకి వెళ్ళి వారి ఎమోషన్స్, విషయాలు చూసి బయటకు వచ్చినట్లు ఉంటుంది.
నటుడు ‘మౌర్య చౌదరి’, నాకిది మొదటి సినిమా. నన్ను నమ్మి ఆడిషన్‌లో దర్శకుడు సెలెక్ట్ చేశారు. ‘మణి యేగుర్ల’, ప్రమోషన్ క్యాంపెయిన్ కు విజయ్, తరుణ్‌భాస్కర్ వీరంతా ప్రమోషన్ కు హెల్ప్ చేస్తున్నారు. మే 26 నాడు థియేటర్ లో హల్ చల్ చేద్దాం. నటి ‘సిరి రాశి’, అంతా కొత్తవారితో నిర్మాతలు సినిమా చేయడం చాలా గ్రేట్, నమ్మకంతో అవకాశాలు ఇచ్చినందుకు ధ్యాంక్స్. దర్శకుడు సుమంత్ కు అన్ని విషయాల్లో క్లారిటీ వుంది. నటి ‘హాని సార్య’, నేను సినిమా చుసిన తరువాత నాకు చాలా కాన్‌ఫిడెన్స్ పెరిగింది.
Tags:
#MemFamous #MemFamousTeaser #YouthVibe #MemFamousOnMay26 #SumanthPrabhas #kalyannayak #sharathchandra #anuragreddy #chaibisketfilms #laharifilms #siriraasi #chaibisket #FilmCombat #filmcombat
You May Like This:
SS4 సుడిగాలి సుధీర్ నాల్గోవ చిత్రం ప్రారంభం
‘PVT04’లో అందాల ‘చిత్ర’గా సందడి చేయనున్న ‘శ్రీలీల’.
SS4 సుడిగాలి సుధీర్ నాల్గోవ చిత్రం ప్రారంభం
#SuperHero కాన్సెప్ట్ తో వస్తోన్న ‘AMasterPiece’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్