- Advertisement -spot_img
HomeUncategorizedAdipurush Pre-Release Event : జూన్ 6న తిరుపతి లో గ్రాండ్ గా

Adipurush Pre-Release Event : జూన్ 6న తిరుపతి లో గ్రాండ్ గా

- Advertisement -spot_img

Adipurush Pre-Release Event in Tirupati on June 6th

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసంలోని ఓ ఘట్టంగా తెరకెక్కించారు. ప్రభాస్ రాఘవుడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రంలో సన్ని సింగ్ హనుమంతుడుగా, సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రల్లో నటించారు.

#Adipurush Pre-Release Event ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ అవెయిటెడ్ అనిపించుకున్న ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ గొప్ప కథను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆసక్తిని అందరిలోనూ క్రియేట్ చేసింది ఆదిపురుష్‌.

జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఆదిపురుష్‌ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక సిద్ధమైంది. జూన్ 6న తిరుపతిలో అత్యంత వైభవంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నా .. శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుపతి క్షేత్రంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం చారిత్రాత్మకంగా చెప్పొచ్చు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు.

ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్‌ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


సాంకేతికంగా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి
టెక్నికల్ టీమ్ :
పి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా
ఎడిటర్ : అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్‌ మాత్రే,
డివోపి : కార్తీక్ పల్నాని
పాటలు : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : అజయ్ – అతుల్
నిర్మాతలు : టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్
దర్శకత్వం : ఓమ్ రౌత్

Tags: Adipurush Pre-Release Event

Read More…

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page