మాయా పేటిక: విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం ‘మాయా పేటిక’.
రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా..
మాయా పేటిక: డైరెక్టర్ రమేష్ రాపర్తి మాట్లాడుతూ ‘‘మాయ పేటిక’ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేసి సపోర్ట్ అందించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌గారికి థాంక్స్. ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం. సాధారణంగా మన సెల్ ఫోన్లో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, మంచి సాంగ్స్, మంచి కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీలా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా ఇది. జూన్ 30న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆడియెన్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.
నిర్మాతలు మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ‘‘మహానటి కీర్తి సురేష్‌గారికి థాంక్స్. ఆమె చేతుల మీదుగా రిలీజ్ రివీల్ చేయటం కావటం చాలా హ్యపీగా ఉంది. రొటీన్‌కి భిన్నంగా ‘మాయా పేటిక’. కరోనా సమయంలో థ్యాంక్ యూ బ్రదర్ మూవీ ద్వారా కొత్త కథను, కొత్త సినిమాను మీ ముందుకు తీసుకువచ్చాం. అప్పుడు సినిమాను ఆదరించి ప్రేక్షకులు ఓ ధైర్యాన్నిచ్చారు.
అదే నమ్మకంతో ఇప్పుడు ‘మాయ పేటిక’ను నిర్మించాం. ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జూన్ 30న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకు సహకరించిన నటీనటులు, డైరెక్టర్ రమేష్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు.
నటీనటులు:
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: మాగుంట వెంకట నారాయణ రెడ్డి
బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి
దర్శకత్వం: రమేష్ రాపర్తి
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఎడిటర్: డి.వెంకటేష్ ప్రభు, నవ్ కట్స్
సంగీతం: గుణ బాలసుబ్రమణియన్
ఆర్ట్: బిక్షు, మూర్తి
పి.ఆర్.ఓ: వంశీ కాకా
Follow Film combat for more content..
FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS
https://www.filmcombat.com/
https://youtube.com/@filmcombat
https://www.facebook.com/filmcombathyd
https://www.instagram.com/thefilmcombat/
https://twitter.com/filmcombat
https://www.pinterest.com/filmcombat/
https://sharechat.com/filmcombat