Intinti Ramayanam: ఒక అద్భుతమైన సినీ ఉత్సవాన్ని ఎంజాయ్ చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.ఈ ప్రయాణం మిమ్మల్ని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లనుంది
దాని పేరే ‘ఇంటింటి రామాయణం’. ప్రేమ, హాస్యం, ఉత్కంఠత సహా అన్నీ అంశాల కలయికగా రూపొందిన చిత్రమే ఇది.
తెలుగు నెంబర్ వన్ ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ సమర్పణలో ఆహా స్టూడియోస్, సితార ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిన ‘ఇంటింటి రామాయణం’ సినిమా జూన్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది…ప్రేక్షకులను అలరించనుంది.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే చిత్రమే ‘ఇంటింటి రామాయణం’. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో మెప్పించిన నరేష్ వి.కె, రాహుల్ రామకృష్ణ, నవ్యా స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి వంటి అద్భుతమైన నటీనటులు ఈ సినిమాలో తమదైన నటనతో అలరించారు.
రాములు (నరేష్) చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎదుటివారి పట్ల జాలి దయ, కరుణను కలిగి ఉండే స్వభావం తనది. అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన గొప్ప నిధి ఒకటి కనపడకుండా పోతుంది. దాంతో దాన్ని ఎవరు తీశారా? అనే కోణంలో రాములో అన్వేషణ చేస్తున్నప్పుడు అందరిపై అనుమానం కలుగుతుంది.
నవ్య కుమార్తె సంధ్య (నవ్యా స్వామి)ని ప్రేమించే కుర్రాడు శ్రీనివాస్ (రాహుల్ రామకృష్ణ)పై కూడా సందేహాన్ని రేకెత్తిస్తుంది. అయితే రాములు అసలు దోషిని కనిపెట్టటానికి నిరంతరం అన్వేషిస్తుంటాడు. చివరకు అసలు ఎవరా పని చేశారనేదే సినిమా. ఈ క్రమంలో ఎలాంటి భావోద్వేగాలు చుట్టూ కథ సాగిందనేదే ‘ఇంటింటి రామాయణం’ కథాంశం
తెలంగాణకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయాలను తెలియజేసేలా చక్కటి అభిరుచి, అంకిత భావంతో ‘ఇంటింటి రామాయణం’ చిత్రాన్ని రూపొందించారు. మంచి కథ, కథనాలతో పాటు నటీనటుల అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు, ఆకట్టుకునే విజువల్స్ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తూ ప్రేక్షకులకు మరచిపోలేని మంచి అనుభూతిని అందిస్తుంది.
- ఆహాలో భావోద్వేగాల సమాహారంగా రూపొందిన ‘ఇంటింటి రామాయణం’ సినిమాను చూస్తూ అంతులేని ఆనందాన్ని పొందాలంటే జూన్ 23వ తేదీని గుర్తు పెట్టుకోండి.
Follow Film combat for more content..
FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS
https://www.filmcombat.com/
https://youtube.com/@filmcombat
https://www.facebook.com/filmcombathyd
https://www.instagram.com/thefilmcombat/
https://twitter.com/filmcombat
https://www.pinterest.com/filmcombat/
https://sharechat.com/filmcombat