Maya Petika trailer విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ముఖ్య పాత్రల్లో నటించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’.
రమేష్ రాపర్తి డైరెక్షన్ లో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ మూవీ ని నిర్మించారు.
Maya Petika trailer ఈ మూవీ ని జూన్ 30న రిలీజ్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రధానంగా సాగే సినిమా ఇది. అలాగే మొబైల్ మన జీవితాల్లో ఎంత కీలకంగా మారిందనే విషయాలను కూడా ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, లిరికల్ వీడియోలకు ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రపంచమంతా సెల్ ఫోన్‌కి ఎలా దాసోహమైందనే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. అలాగే ఈ సినిమాలో స్మార్ట్ ఫోన్ హీరో. తనే ఈ కథను అందరికీ చెబుతుంది. అందరి జీవితాల్లో తనొక భాగంగా ఎలా మరిపోయాననే విషయాన్ని తనే వివరిస్తుంది.
Have you watched the Intriguing Theatrical Trailer of #MayaPetika 📲 yet?
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 16, 2023
👉 https://t.co/OXxqPhxA3h@viraj_ashwin @starlingpayal @mee_suneel @simratkaur_16 @Raparthy @dopsureshragutu @gunasekaran_gm #MaguntaSarath @THARAK369 @MangoMusicLabel #MayaPetikaOnJune30 pic.twitter.com/6AJGj5RNSJ
ఈ 3 నిమిషాల ట్రైలర్లో చాలా కథలను చూపిస్తూనే అవన్నీ స్మార్ట్ ఫోన్‌కు ఎలా కనెక్ట్ అయ్యాయనేది చూపిస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ వల్ల వారి జీవితాలు తలకిందులుగా ఎలా మారిందనే విషయాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే ఓ మంచి సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూ వచ్చారు.
దీనికి మంచి విజువల్స్, సంగీతం కూడా తోడయ్యాయి. ఇందులో చూపిస్తున్న ప్రతి కథలో ఓ కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ స్మార్ట్ ఫోన్‌కి ఎలా లింక్ అయ్యాయనేది తెలుసుకోవాలంటే జూన్ 30 వరకు ఆగాల్సిందే.
అధికారం, ప్రేమ, డబ్బుతో పాటు స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు పెరిగాయి. కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటించారు.
అలాగే పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు. పురుషోత్తం ఆర్ట్ డైరెక్టర్‌గా, డి. వెంకట ప్రభు, నవి కట్స్ ఎడిటర్‌గా వర్క్ చేశారు.
నటీనటులు:
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: మాగుంట వెంకట నారాయణ రెడ్డి
బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి
దర్శకత్వం: రమేష్ రాపర్తి
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
ఎడిటర్: డి.వెంకటేష్ ప్రభు, నవ్ కట్స్
సంగీతం: గుణ బాలసుబ్రమణియన్
ఆర్ట్: బిక్షు, మూర్తి
పి.ఆర్.ఓ: వంశీ కాకా
Follow Film combat for more content..
FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS
https://www.filmcombat.com/
https://youtube.com/@filmcombat
https://www.facebook.com/filmcombathyd
https://www.instagram.com/thefilmcombat/
https://twitter.com/filmcombat
https://www.pinterest.com/filmcombat/
https://sharechat.com/filmcombat