Slum Dog Husband సంజయ్ రావ్ హీరో గా స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ ఈరోజు ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ చేతుల మీదగా విడుదల అయ్యింది.
పిట్ట కథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్ రావ్ “స్లమ్ డాగ్ హస్బెండ్” అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఈ హీరో నటించిన పిట్ట కథ సినిమా వైవిద్యమైన థ్రిల్లర్ గా వచ్చి అప్పట్లో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం కూడా వైవిధ్యమైన కామెడీ ఎంటర్టైనింగ్ కథతో రాబోతోంది అని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి,అబ్బాయి, పెళ్లి కోసం తాపత్రయం పడే సీన్లతో ట్రైలర్ స్టార్ట్ కాగా, ఆ తరువాత ఈ ట్రైలర్ మొత్తం చాలా డిఫరెంట్ గా కొనసాగింది. ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఒక గండం ఉందడంతో తాను ఆ కారణం వల్ల మొదటిగా కుక్కని పెళ్లి చేసుకోవడం, ఇక కుక్కని పెళ్లి చేసుకున్నాక ఆ గంధం గట్టెక్కింది అనే నమ్మకంతో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కోర్టులో మొదటి భార్య (కుక్క) బతికి ఉండగా రెండో భార్యని ఎలా చేసుకుంటారు అని కేసు పెట్టడంతో ఈ ట్రైలర్ మరింత ఆసక్తిగా మారింది.
ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రేక్షకులకు ఇది వింతగా అనిపియ్యదమే కాకుండా ఎక్సైట్మెంట్ ని కూడా పెంచేయడం ఖాయం. ముఖ్యంగా ట్రైలర్ మొత్తం మంచి కామెడీ తో కూడి, ఆధ్యాంతం ఈ సినిమా ప్రేక్షకులను చూసినంత సేపు నవ్విస్తూ ఉంటుంది అనే క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు ఈ ట్రైలర్ లో బ్రహ్మాజీ, సప్తగిరి అలానే ఆలీ లాంటి వాళ్ళు మంచి కామెడీని పండించారు.
సరైన కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాకి ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా, మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సినిమా మేకర్స్ త్వరలోనే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.
తారాగణం & సిబ్బంది
నటీనటులు:: సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సునీల్
ఆర్ట్ డైరెక్టర్:: సురేష్ రెడ్రౌతు
కాస్ట్యూమ్స్:: తేజ & నరేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:: రమేష్ కైగురి
చీఫ్ ఎడి:: కట్టా రామకృష్ణ
DOP:: శ్రీనివాస్ J రెడ్డి
ఎడిటర్:: ఎ. వైష్ణవ్ వాసు
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
బిజినెస్ హెడ్:: రాజేంద్ర కొండా
సహ నిర్మాతలు:: నిహార్ దేవెళ్ల, M K చైతన్య పెన్మెత్స, చింతా మెర్వాన్, ప్రకాష్ జిర్రా, రవళి గణేష్, సోహం రెడ్డి మన్నెం
నిర్మాతలు:: అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం:: ఏ ఆర్ శ్రీధర్
బ్యానర్:: మైక్ మూవీస్
PRO:: GSK మీడియా