- Advertisement -spot_img
HomeUncategorized"రుద్రంగి" లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి

“రుద్రంగి” లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి

- Advertisement -spot_img

Balakrishna తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది- ప్రీ రిలీజ్ వేడుక లో నటసింహం నందమూరి బాలకృష్ణ.

Balakrishna in pre-release event of Rudrangi

సినిమాలలో విలన్ పాత్రలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరియర్ లో బాగానే ముందుకు దూసుకు వెళుతున్న జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. “రుద్రంగి” అనే సినిమాతో జగపతిబాబు త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మమత మోహన్ దాస్ మరియు విమల రామన్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 7న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఏర్పాటు చేయగా నందమూరి బాలకృష్ణ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Balakrishna: ఆశిష్ గాంధీ మాట్లాడుతూ, “జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ ని సపోర్ట్ చేస్తున్నందుకు నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. థాంక్ యు సార్. వీ ఆల్ లవ్ యు. మీరు మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్. నేను మిమ్మల్ని పీపుల్స్ స్టార్ అని పిలుస్తాను. జగపతిబాబు గారి గురించి చెప్పాలంటే ఆయనతో ఇది నా రెండవ సినిమా. షూటింగ్ సమయంలో నేను ఆయనతో ఫోటో దిగుతున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. ‘నువ్వు చాలా మంచి యాక్టర్ వి’ అన్నారు. మల్లేష్ లాంటి పవర్ఫుల్ పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. సినిమా అంతా టెక్నికల్ టీమ్ పనితనమే. 7/7 న ఈ సినిమా విడుదలవుతుంది. సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను” అని అన్నారు.

చిత్ర హీరోయిన్ గాహ్నవి మాట్లాడుతూ, “మీడియా వారికి నా కృతజ్ఞతలు. గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ గారికి కూడా థాంక్యూ. ఒక సినిమా ఈవెంట్లో హైదరాబాద్ స్టేజ్ మీద నేను మాట్లాడటం ఇది రెండవసారి. కానీ తెలుగులో ఇది నా మొదటి సినిమా. జగపతి బాబు గారు ఒక అద్భుతమైన నటుడు. ఆయన తన పాత్రలోకి పూర్తిగా వెళ్లిపోయి నటిస్తారు. ప్రేక్షకులకు ఆయన క్యారెక్టర్ కచ్చితంగా నచ్చుతుంది. మమతా మోహన్దాస్ మరియు విమల రామన్ లాంటి వారిని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. నాకు సహాయం చేసినందుకు ఆశిష్ కి నా కృతజ్ఞతలు. సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

దివి మాట్లాడుతూ, “బాలయ్య సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్యూ. సినిమాలో నేను ఒక పాటలో కనిపిస్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అజయ్ గారికి నా కృతజ్ఞతలు. ట్రైలర్ లో జగపతిబాబు గారు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. మమత మరియు విమల రామన్ గార్లు చాలా అందంగా ఉన్నారు,” అని అన్నారు.

చరిష్మా మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. బాలయ్య గారు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నేను కూడా భాగం అయినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాను. సినిమా జులై లో వస్తుంది. అందరికీ నచ్చుతుంది అనుకుంటూ ఉన్నాను.

మమత మోహన్ దాస్ మాట్లాడుతూ, “జై జై బాలయ్య. అందరికీ హాయ్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. రుద్రంగి సినిమా మొత్తం అజయ్ ఇమాజినేషన్ లో ఉంది. అందులో జ్వాల పాత్రలో నన్ను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కరియర్ లో చాలా ముందుకు వెళ్తారు. అతను మామూలు డైరెక్టర్ కాదు. ఆయన లో ఒక ఫైర్ ఉంది. సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. నా మంచి స్నేహితుడు జగపతిబాబు లేకుండా ఈ సినిమా పూర్తయ్యేదే కాదు. ఇక్కడికి వచ్చినందుకు బాలకృష్ణ సార్ కి కూడా థాంక్యూ. ఆశిష్ సినిమాలోని పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సౌత్ లో మరకమాస్ హీరో అయ్యే అవకాశం నీకు కచ్చితంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలం తర్వాత చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్లే నేను మళ్ళీ తెలుగు సినిమాల్లోకి వచ్చాను. నీ సపోర్ట్ అలాగే కొనసాగుతుందని అనుకుంటున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ, “నన్ను కన్న నా తల్లికి నన్ను పోషిస్తున్న కళమ్మ తల్లికి నా సాష్టాంగ ప్రణామాలు. ప్రతి డైరెక్టర్ తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. కానీ నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఈ సినిమాని పూర్తి చేశాను. థాంక్ యూ రస్మయి గారు. బాలయ్య గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నాకు గౌరవం కంటే ప్రేమించడమే వచ్చి. సినిమా గురించి చెప్పాలంటే మన చుట్టూ ఎన్నో రాజుల కోటలు, ఎత్తైన భవనాలు ఉంటాయి. కానీ ఎంతో అందమైన వి కేవలం పక్షులు కట్టే గూడు. సినిమా ని దాంతో పోలిస్తే నన్ను భరిస్తూ సినిమా కోసం పని చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఇలాంటి మరొక వంద సినిమాలను నాంది పలకాలి అని కోరుకుంటున్నాను. జై రుద్రాంగి, జై బాలయ్య” అని అన్నారు.

చిత్ర నిర్మాత రస్మయి మాట్లాడుతూ, “ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎదురుగా లెజెండ్ ఉండగా నాకు మాటలు రావడం లేదు. అడగగానే ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన బాలయ్య గారికి, నాకు ఇష్టమైన హీరో జగపతి బాబు గారికి, సినిమా నటీనటులకు, టెక్నీషయన్ల కు నా కృతజ్ఞతలు. బాలయ్య గారిని హిందూపురం వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో నాకు తెలుసు. ఆయన చాలా సామాన్యమైన వ్యక్తిగా మనుషుల్ని ప్రేమిస్తారు. జగపతిబాబు గారు లేకపోతే అసలు ఈ సినిమానే లేదు. ఆయన పాత్రకి ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. తెలంగాణ యాస లో ఆయన డైలాగులు అందరికీ గుర్తుండిపోతాయి. సినిమా ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరో గా నటించిన జగపతి బాబు మాట్లాడుతూ “బాలకృష్ణ గారు చాలా బిజీ గా ఉంటారు. కానీ నేను వెళ్లి అడిగితే కాదనరు అన్న నమ్మకంతో వెళ్లి అడిగాను. ఏమీ అడగకుండా కేవలం ఎప్పుడు పెట్టుకుందాం అని మాత్రమే అడిగి ఇక్కడికి వచ్చారు. ఆయన లెజెండ్ సినిమానే నాకు మళ్ళీ ప్రాణం పోసింది. ఇక హీరోగా మళ్లీ నా మూడవ ఇన్నింగ్స్ కి కూడా బాలయ్య గారు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా కథ అన్నీ బావున్నాయి కానీ బడ్జెట్ కి నేను సరిపోను అని చెబుతూ వచ్చాను కానీ డైరెక్టర్ మరియు నిర్మాత చాలా నమ్మకం తో చేశారు. నేను “లెజెండ్” తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కానీ అందులో చెప్పుకోదగ్గవి 10 కూడా లేవు. ఈ సినిమా తో మళ్లీ నాకు మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను. అజయ్ తో మళ్ళీ ఇంకో సినిమా చేసి తీరుతాను. తెలంగాణ సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది అని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. నాకు రస్మయి గారికి రాజకీయాలు తెలియవు. కానీ మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో వచ్చాము. రుద్రంగి లాంటి సినిమా లు చాలా అరుదుగా వస్తాయి. మా నాన్నగారు అలాంటి సినిమాలు చాలా చేశారు. ఇప్పుడు జగపతి బాబు అలాంటి సినిమా చేస్తూ ఉండడం చాలా సంతోషం గా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు. సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ కోసమే మేము ఇంకా పని చేస్తున్నాము. మమత మోహన్ దాస్ ఒక వీర వనిత. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా నాకు తెలుసు వాళ్ళు ఎంత క్షోభ పడతారు అని కానీ ఆమె చాలా ధైర్యం గా ఉండి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు.” అని అన్నారు. చిత్ర బృందాన్ని పొగిడి సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు బాలయ్య.

Follow Film combat for more content..

FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS
https://www.filmcombat.com/
https://youtube.com/@filmcombat
https://www.facebook.com/filmcombathyd
https://www.instagram.com/thefilmcombat/
https://twitter.com/filmcombat
https://www.pinterest.com/filmcombat/
https://sharechat.com/filmcombat

Read More..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page