Shantala: అద్భుతమైన సంగీతం… ఉద్విగ్న భరితమైన కథతో కె యస్ రామారావు పరివేక్షన లో వస్తున్న పీరియడ్ మూవీ శాంతల….
Shantala కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పిరియాడికల్ చిత్రం ‘శాంతల’. యిర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై నూతననటుడు నిహాల్ కోదాటి హీరోగా, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్న ఆశ్లేష ఠాకూర్ హీరోయిన్‌గా శేషు పెద్దిరెడ్డి దర్శకత్వంలో డా.యిర్రంకి సురేష్ నిర్మించారు. “సీతారామం” వంటి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం విశేషం. ఈ సినిమాలోని రెండు పాటలను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో శనివారం మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుతో ముచ్చటించారు.
ముందుగా దర్శకుడు శేషు మాట్లాడుతూ…
ఈ కథను నేను కే.ఎస్. రామారావుగారికి చెప్పగానే, ఆయన చాలా బాగుంది శేషు, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకురా.. నేను తీస్తాను అన్నారు. దాదాపు సంవత్సరంన్నర తిరిగాను. నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలోని అన్ని క్రాఫ్ట్‌ల విషయంలో ఆయన కేర్ తీసుకుని, ఇలా చేయాలి.. అలా చేయాలి అంటూ సలహాలు ఇస్తూ.. సినిమా అద్భుతంగా రావటానికి కారకులయ్యారు. ఇందుకు ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు.
డీఓపీ రమేష్ ఆర్ మాట్లాడుతూ…
నాకు ఈ చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చిన నిర్మాత కె.యస్. రామారావు గారికి, దర్శకులు శేషు గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.
ఎడిటర్ శశాంక్ ఉప్పుటూరి మాట్లాడుతూ…
ఇది నాకు తొలి అవకాశం అయినా దర్శకులు శేషు గారు, నిర్మాత రామారావు గారు నాకు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చారు. అలాగే నాకు సహకరించిన ఇతర టెక్నీషియన్స్ అందరికీ రుణపడి ఉంటాను అన్నారు.
Shantala సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ…
ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఇది సంగీతం, నృత్యం కలగలిపిన క్లాసికల్ మ్యూజిక్ మూవీ. దర్శకులు శేషుగారు ఈ స్క్రిప్ట్ విషయంలో చాలా క్లారిటీగా ఉండటం వల్ల నాకు మంచి సంగీతం ఇవ్వడం ఈజీ అయ్యింది. తెలుగు సినిమాకు పిల్లర్స్ వంటి వ్యక్తుల్లో ఒకరైన కె.యస్. రామారావు గారి సినిమాలో నేను పనిచేయడం నిజంగా గర్వంగా ఫీలవుతున్నా. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.
హీరో నిహాల్ మాట్లాడుతూ…
మా టీం అందరూ ఎక్కువ పనిచేస్తారు.. తక్కువగా మాట్లాడతారు. ఇది నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా Shantala. రామారావు గారి ఆఫీస్‌లో శేషుగారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాలో నేను భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. ఇది పాత, కొత్త నటులు, టెక్నీషియన్స్ కలయికలో వస్తున్న సినిమా. కె.యస్. రామారావు గారు వంటి లెజెండ్ మా వెనకాల ఉండటం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది. సీతారామం వంటి బ్లాక్ బస్టర్‌కు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ గారు మా సినిమాకు సంగీతం సమకూర్చడం చాలా చాలా లక్కీగా ఫీలవుతున్నా. హీరోయిన్ అశ్లేష తెలుగు రాకపోయినా ప్రతి డైలాగ్‌ను రాసుకుని, దాని అర్ధం తెలుసుకుని మరీ నటించింది. ఇది ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరిగే సినిమా అన్నారు.
హీరోయిన్ అశ్లేష ఠాకూర్ మాట్లాడుతూ…
చిన్నప్పటి నుంచీ నాకు డాన్స్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో నా ఇష్టాలకు దగ్గరైన పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ పాత్రను చాలెంజ్‌గా తీసుకుని మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశాను. లెజెండ్ కె.యస్. రామారావు గారి ప్రొడక్షన్‌లో, శేషు గారి దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉంది. మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీ ఇది. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను అన్నారు.
కె.యస్. రామారావుగారు మాట్లాడుతూ…
అమెరికాలో ఉన్న ఈ సినిమా నిర్మాతలకు కథ నచ్చడంతో మేము అక్కడికి చేయడం కష్టం కాబట్టి మీరే ఆ బాధ్యతలు తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల సక్సెస్ రేట్ బాగాలేనందున ముందు నేను దానికి ఇంట్రస్ట్ చూపలేదు. కానీ వారికి మాత్రం ఓటీటీలో అయినా ఎంతో కొంత వర్కవుట్ కాకపోతుందా అని నమ్మకం. అయితే మీ సారధ్యం లోనే ముందుకు వెళ్తాం. మీరే ఈ ప్రాజెక్ట్‌ను నడిపించాలి అన్నారు. శేషు కూడా సంవత్సరం పైగా నా చుట్టూ తిరిగాడు. సబ్జెక్ట్ బాగుంది. సబ్జెక్ట్‌లో ఏదో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయనేది అందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే నేను కూడా ఈ టీమ్‌తో కలిశాను.
శేషు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మా బ్యానర్‌లో క్రిమినల్ దగ్గర నుంచి పని చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర పనిచేసి వచ్చాడు. శేషు ఎంత కష్టపడి, ప్రేమించి తీశాడో.. సినిమా కూడా అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. శేషుతో పాటు డీఓపీ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్‌లు చాలా కష్టపడ్డారు. మూజిక్, కంటెంట్, విజువల్‌గా అద్భుతం అనిపించే సినిమా. హీరో, హీరోయిన్ పెయిర్ కూడా చాలా అందంగా ఉంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం మొత్తం 6 లాంగ్వేజెస్‌లో చేశాం. సినిమా మీద మా నమ్మకానికి ఇదో మంచి ఉదాహరణ. ఈ సినిమాను మీడియా కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నా అన్నారు.
నటీ నటులు : నిహాల్, ఆశ్లేష ఠాకూర్, సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీణా నాయర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: డా. యిర్రంకి సురేష్
దర్శకత్వం: శేషు పెద్దిరెడ్డి
డి.ఓ.పి: రమేష్. ఆర్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి
కోరియోగ్రాఫర్స్: సిమ్రాన్ శివకుమార్, వీణా నాయర్
లిరిక్స్ : భాస్కరభట్ల, కృష్ణకాంత్, శ్రీమణి
పి.ఆర్.ఓ : నాగేందర్ కుమార్