బేబీ..ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ – హీరో విరాజ్ అశ్విన్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో తన పాత్ర విశేషాలు తెలిపారు హీరో విరాజ్ అశ్విన్
ఈ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్. తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి, నా పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి. నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటాడు.
బేబీ గురించి చెప్పాలంటే దర్శకుడు సాయి రాజేష్ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కు ఒక బ్యాక్ స్టోరి చెప్పారు. దాంతో నా క్యారెక్టర్ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది తెలిసిపోయి యాక్టింగ్ ఈజీ అయ్యింది. మా సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేబీ సినిమాలో డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి.
ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కొత్త టోన్ ఇచ్చింది. విజువల్ గా బ్యూటీ ఉంటుంది. ఎలాంటి సీన్స్ అయినా కొత్త కలర్ కనిపిస్తుంది. అలాగే విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు విప్లవ్ ఎడిటింగ్ కూడా క్రిస్పీ నెస్ తెచ్చింది. చాలా షార్ప్ గా ప్లెజంట్ వేలో ఎడిట్ చేశారు.
నా సినిమాల్లో ప్రాపర్ గా థియేటర్ రిలీజ్ కు వస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రతి క్యారెక్టర్ కు యాక్టింగ్ కు స్కోప్ ఉంటుంది. నా క్యారెక్టర్ కు కూడా యాక్టింగ్ స్కోప్ బాగుంది.
మీరు ట్రైలర్ లో చూసినట్లు ఒక అమ్మాయి స్కూల్ డేస్ లో ఆనంద్ ను ప్రేమిస్తుంది. అలాగే కాలేజ్ లో నేను తనను లవ్ చేస్తాను. ఇలా క్యారెక్టర్స్ పరంగా హీరోయిజం, ప్రాధాన్యత ఉంటుంది కానీ వీళ్లు హీరో అనేది సెపరేట్ గా ఉండదు. మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు.
వైష్ణవి తన క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. ఆమెకు ఓటీటీల్లో నటించిన ఎక్సీపిరియన్స్ ఉంది. అయినా ఇలాంటి పెద్ద సినిమాను తన భుజాలపై వేసుకుంది. ఎందుకంటే సినిమా అంతా తన చుట్టూ రిలేట్ అయి ఉంటుంది. వైష్ణవి బేబీ హీరోయిన్ గా పర్పెక్ట్ ఛాయిస్ అనుకోవచ్చు.రిచ్ అయినా పూర్ అయినా కాలేజ్ డేస్ లో స్టూడెంట్స్ లో ఒక రెబలిజం ఉంటుంది. నాదే ప్రపంచం అనే భావన ఉంటుంది. నేను ఫీల్ కు రిలేట్ అయ్యాను. ఈ సినిమాలో ప్రేమను పెయిన్ ద్వారా చూపించాం. అందుకే ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి అనుకుంటున్నారు.
నేను చూసిన లవ్ స్టోరీస్ తో పోల్చితో ఇదొక ఫ్రెష్ అప్రోచ్డ్ ప్రేమ కథ అనుకుంటాను. ట్రయాంగిల్ లవ్ స్టోరి అయినా రెగ్యులర్ గా, రొటీన్ గా ఉండదు. ప్రతి టెక్నీషియన్ సినిమా కథను ఎంతబాగా ప్రెజెంట్ చేయాలో అంత బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్కేఎన్ పర్పెక్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంటుంది.
మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం మరీచిక అనే మూవీ చేస్తున్నాను. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.