Nirroze Putcha జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపీచంద్ ..
Nirroze Putcha వీళ్లే తన రోల్స్ మోడల్స్ అంటున్నారు భారతీయన్స్ చిత్ర హీరో నిరోజ్ పుచ్చా. టెన్నిస్ క్రీడాకారుడైన నిరోజ్ కొందరు మిత్రుల ప్రోద్భలంవల్ల నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జాతీయ స్థాయిలో కూడా తన కుమారుడు టెన్నిస్ ఆడారని నిరోజ్ తండ్రి పుచ్చా రమణమూర్తి తెలిపారు. సినిమారంగంలోకి రావాలన్న కోరిక తనకు కూడా ఉండేదని, ఆ కోరికతోనే తను చెన్నై వెళ్లి ఫిలిం ఇన్స్ స్టిట్యూట్ లో చేరే ప్రయత్నం చేశానన్నారు.
Nirroze Putcha మెగాస్టార్ చిరంజీవి తనకు సీనియర్ అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల తన ప్రయత్నాలు మానుకుని వెనక్కి వచ్చేశానని తెలిపారు. ఇప్పుడు తన కుమారుడు ఆ రంగంపై ఆసక్తి చూపడంతో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ ఇష్టపడి తను ఈ రంగంలోకి వచ్చానని, కష్టపడితే వారిలానే ఎదగవచ్చన్న నమ్మకంతోనే తను సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టానని చెప్పారు.
మంచి అవకాశం వస్తే హీరోగానే కాదు విలన్ గా అయినా తనేమిటో నిరూపించుకుంటానన్నారు. భారతీయన్స్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలో మొదటగా అవకాశం రావడం తన అదృష్టమన్నారు. షార్ట్ ఫిలింతో నటుడిగా తన కెరీర్ ప్రారంభమైన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయన్నారు. మొదట్లో బిజినెస్ మీద దృష్టి పెట్టి మిస్టర్ పులావ్ పేరుతో ఫ్రాంచైజీ బిజినెస్ నెలకొల్పినట్టు తెలిపారు.
Nirroze Putcha ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తను నటుడిగా ఎదగడానికి తోడ్పడిందన్నారు. ముఖ్యంగా దర్శకుడు దీనరాజ్ భారతీయన్స్ సినిమాలో తనను ఎంపిక చేయడం, ఎంతో కష్టపడి ఆ పాత్ర చేయడం తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందన్నారు. తన సినిమా అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలను చూద్దాం.
Nirroze Putcha సినిమా రంగంలో ఎలా అడుగుపెట్టారు? అవకాశాలు ఎలా వచ్చాయి?
నేనిక్కడ మాట్లాడగలుగుతున్నానంటే మా గురువుగారు దీనరాజ్, నిర్మాత శంకర్ నాయుడు గారి వల్లే. భారతీయన్స్ సినిమా నాకీ ఫ్లాట్ ఫారమ్ ను ఇచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. దీనరాజ్ గారి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మిస్టర్ పులావ్ ఔట్ లెట్స్ తో వ్యాపార రంగంలో ప్రవేశించాను.దీన్ని వైజాగ్ లో మొదట ప్రారంభించాను. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఫ్రాంచైజీల రూపంలో విస్తరించాను. దీనివల్ల నాకో గ్రూప్ ఏర్పడింది. అందులో ఉండే నవీన్ వర్మ అనే వ్యక్తి నుంచి సినిమా ప్రతిపాదన వచ్చింది. నీ స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంటుంది. మనం కలిసి సినిమా చేద్దాం అన్నాడు. అలా 2019లో నా జర్నీ షార్ట్ ఫిలింతో ప్రారంభమైంది.
Nirroze Putcha సారథి స్టూడియోలోనే ఆ షూటింగ్ చేశాం.దానివల్ల చాలా నేర్చుకోగలిగాను.నవీన్ అనే అతను ఆ అవకాశం ఇవ్వకపోతే నేనీరోజు ఇక్కడ ఉండకపోయేవాడినేమో. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశాను. అక్కడి నుంచి భారతీయన్స్ వరకు నా జర్నీ కొనసాగింది. ఒకసారి దీనరాజ్ గారి వద్దకు నా ఫ్రొఫైల్ వెళ్లింది. కోవిడ్ టైమ్ లో అంటే 2021లో దీనరాజ్ గారు హోటల్ కు వచ్చి నన్ను కలిసి ఆడిషన్ తీసుకున్నారు. అలా భారతీయన్స్ లో సెలక్ట్ అయ్యాను. సినిమా రిలీజ్ అయ్యేవరకు దాదాపు రెండేళ్ల జర్నీ ఇది. ఈ సినిమా రిలీజ్ కు ముందే విజయ్ అనే డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి ఓ అవకాశం ఇచ్చారు. అది నెగిటివ్ క్యారెక్టర్. త్వరలో అది విడుదల కాబోతోంది.
అంటే హీరోనే కాకుండా ఇతర పాత్రలు కూడా చేస్తారా?
మంచి నటుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకే నెగిటివ్ పాత్రలు కూడా ఒప్పుకుంటున్నాను. హీరో అయితే వెల్ అండ్ గుడ్. బట్ నటుడిలాగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నదే నా కోరిక. అది హీరో అయినా ఫర్లేదు విలన్ అయినా ఫర్లేదు మంచి సినిమా చేయాలన్నదే నా కోరిక. దాని కోసమే కష్టపడుతున్నాను అలానే కథలను సెలక్ట్ చేసుకుంటున్నాను. నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమానిని. ఆయనతో ఏదో ఒక రోజు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవాలని ఉంది. ఏదో ఒకరాజు ఆయనతో నటించే అవకాశం దొరుకుతుందని కోరుకుంటున్నాను.
Nirroze Putcha అలానే అల్లు అర్జున్ గారు కూడా. వీరంతా చాలా కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఎవరూ అంత ఈజీగా వచ్చేయలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. వీళ్లంతా ఆ పొజిషన్ లో ఉండటానికి వారు పడ్డ కష్టమే కారణం. ఏదో ఒకరోజు వీరందరితో నటించాలన్న కోరిక ఉంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోగొట్టుకోకుండా చేసిన మా అమ్మానాన్నలకు కూడా చాలా థ్యాంక్స్.
ఇకనుంచి సినిమాలపైనే ఇంట్రస్ట్ పెడతారా? బిజినెస్ పై కూడానా?
హండ్రెస్ పర్సంట్ సినిమాలే. చిన్నప్పట్నుంచి నా కోరిక ఇది. వెండితెర మీద ఏదో ఒకరోజు వెలిగిపోవాలనుకునేవాడిని. ఇప్పుడు నాకు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.
హీరోగా చేయాలంటే కొంత హార్డ్ వర్క్ కూడా చేయాలి. డ్యాన్స్, ఫైట్స్ లాంటివి ఏవైనా నేర్చుకుంటున్నారా?
నేర్చుకుంటున్నానండీ. కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. డ్యాన్స్ క్లాసెస్ కు కూడా వెళుతున్నాను. యాక్టింగ్ పరంగా నేను ఎంతైతే చేయగలగుతానో హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండీ. జీవితంలో ప్రతిరోజూ లెర్నింగ్ ఎక్స్ పీరియన్సే.నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాను.
భారతీయన్స్ తర్వాత మీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి?
ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాను. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. నెగిటివ్ పాత్ర ఇది. సెప్టెంబరులో ఇది విడుదలవుతుంది.
Nirroze Putcha హీరో, విలన్ .. ఇలా రెండు రకాలుగా పోతుంటే డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా?
నాకు యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం.హీరోగానే యాక్ట్ చేయాలి అని ఏ రోజూ అనుకోలేదు. గోపీచంద్ గారు వచ్చింది హీరోగానే. కానీ ఆయనకు గుర్తింపు తెచ్చినవి నెగిటివ్ పాత్రలే. వర్షం, నిజంలో చేసిన విలన్ పాత్రలు ఎంత గుర్తింపు తెచ్చాయో మీకు తెలుసు. ఆ తర్వాత మళ్లీ హీరో అయ్యారు. అందుకే నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నదే నా కోరిక. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలగాలి. దాని తర్వాతే ఏదైనా.
Nirroze Putcha తెలుగేనా, ఇతర భారతీయ భాషల చిత్రాలు కూడా చేస్తారా? భారతీయన్స్ పాన్ ఇండియా చిత్రం అనుకోండి?
సినిమాని ఇండియన్ సినిమా అంటున్నారుగానీ సౌత్ సినిమా, బాలీవుడ్ సినిమా, కోలీవుడ్ సినిమా అనడం లేదు. ఆర్ఆర్ఆర్ నుంచి ఆ బారియర్ తొలగిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, కాంతారా.. లాంటి వల్ల ఇండియన్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. సో నాకు ఇండియన్ సినిమాల్లో యాక్ట్ చేయాలన్నదే నా కోరిక. నార్త్ నుంచి వచ్చి సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇది ఒక అడ్డంకి కాకూడదని నేను అనుకుంటున్నాను.
నిర్మాణ రంగంలోకి కూడా వస్తారా?
ప్రస్తుతానికైతే యాక్టింగ్ మీదే నా దృష్టి. ప్రొడక్షన్ అనేది దేవుడి నిర్ణయం. ఆ అవకాశం లేదని కూడా నేను అనను.
మీకు పర్సనల్ గా ఎలాంటి పాత్రలంటే ఇష్టం?
Nirroze Putcha నాకు విలన్ షేడ్ క్యారెక్టర్లు అంటే ఇష్టం. రావణలో ఎన్టీఆర్ లాంటి పాత్రలు, నిజం, వర్షం లాంటి చిత్రాల్లో గోపీచంద్ లాంటివారు చేసిన పాత్రలు, వారియర్ లో ఆది పినిశెట్టి పాత్ర ఇష్టం. ఇలాంటివాటిలో కొంచెం పవర్ అనేది కనిపిస్తుంటుంది. అందుకే అలాంటి పాత్రలు చేయాలని ఉంది. అందరూ పెద్ద దిగ్గజాలే. వారితో నటించాలంటే మనలో కూడా ఆ సత్తా ఉండాలి.. ఉందని నేననుకుంటున్నాను.
తెలుగులో మీరు ఇష్టపడే డైరెక్టర్లు ఎవరు?
త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి వాళ్లు చాలా ఇష్టం. వీళ్ల సినిమాలు విభిన్నంగా ఉంటాయి. రాజమౌళి గారు అందరికీ ఫేవరేట్ డైరెక్టరే. ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి.
భారతీయన్స్ లో చాలా కష్టంగా ఈ సీన్ చేశాను అనిపించింది ఏమిటి?
నా డెత్ సీన్ ఒకటుంటుంది. అది డిఫికల్ట్ సీన్. ఆడియన్స్ కనెక్ట్ అయితేనే మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నట్టు అని నా ఫీలింగ్. ఈ సినిమా అయ్యాక చిన్న సంఘటన జరిగింది. ఒక ఎనిమిదేళ్ల పాప ఆ సీన్ చూసి నా దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చింది. అంటే ఆమె ఆ పాత్రకు అంత కనెక్ట్ కాగలిగింది. దాంతో ఆడియన్స్ కు కనెక్ట్ కాగలుగుతున్నాననే నమ్మకం కూడా కలిగింది. చిన్న పాపనే ఆ సీన్ కదిలించింది అంటే కచ్చితంగా అన్ని వయసుల వారికీ ఆ ఫీలింగ్ కలుగుతుంది.
భారతీయన్స్ లో మీ ఫిజిక్ చాలా బాగుంది. దీన్ని ఎలా తీసుకు రాగలిగారు?
జిమ్ లో ప్రితిరోజూ మూడు గంటలు శ్రమిస్తాను. నాకంటూ స్పెషల్ డైట్ ఉంది. మా ట్రైనర్ కె. ఎస్. రాజు గారికే ఆ ఘనత దక్కుతుంది. నా ఈ ఫిజిక్ క్రెడిట్ అంతా ఆయనదే.
జుట్టు అలా పెంచడానికి కారణం ఏంటి?
2016 నుంచి ఇదే స్టయిల్ మెయిన్ టెయిన్ చేస్తున్నాను. ఎప్పుడు కటింగ్ చేయించలేదు. మధ్యలో ఒకసారి కటింగ్ చేయించి చూస్తే సెట్ కాలేదని అనిపించి పాతదే కంటిన్యూ చేస్తున్నా. ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేసి మార్చాల్సి వస్తే మార్చేస్తాను.
భారతీయన్స్ సినిమా చూశాక మీ పేరెంట్స్ కామెంట్స్ ఏమిటి?
ఆ సినిమా నాకు దొరకడం నా అదృష్టం. సినిమా చూసి బయటకు వచ్చేశాక మా ఆనందాన్ని వర్ణించలేను. మా అమ్మ అంత హ్యాపీ ఫీలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నటుడిగా నేను ఏదైనా చేయగలుగుతానన్న నమ్మకాన్ని మా అమ్మే ఇచ్చింది.
If you enjoyed this article, don’t forget to follow Film combat for more awesome content. 😎
We are on all your favorite social media platforms, so join us and stay updated with the latest news, reviews and gossip from the Telugu film industry. 🎬
🌐 FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS 🌐
- Website – The ultimate destination for Telugu cinema lovers. 💯
- YouTube – Watch our exclusive videos and interviews with the stars. 🌟
- Facebook – Like our page and share your thoughts with us. 👍
- Instagram – Follow us for some amazing photos and stories. 📸
- Twitter – Tweet us your feedback and suggestions. 🐦
- Pinterest – Pin our posts and discover new ideas. 📌
- ShareChat – Chat with us and other Telugu cinema fans. 💬
Read More.. – Because there is always more to explore. 🔎