Kathakeli Teaser ‘కథా కేళి’తో సతీశ్ వేగేశ్న చేసిన కొత్త ప్రయత్నం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్ రాజు
Kathakeli Teaser చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. ఆదివారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. టీజర్‌ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు.
Kathakeli Teaser ఈ సందర్భంగా…అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘వినాయక్, హరీశ్ శంకర్, సతీశ్ వేగేశ్న చాలా మంది మా గుడిలో ఉన్నప్పుడు శతమానం భవతి కథ గురించి మాట్లాడుతూ టైటిల్ గురించి అడిగినప్పుడు వినాయక్, హరీశ్ చాలా బావుంటుందని అన్నారు. ఆ శతమానం భవతి సినిమా మా బ్యానర్‌లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడదే పేరుతో సతీశ్ బ్యానర్ పెట్టటం చాలా సంతోషంగా ఉంది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సతీశ్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్. కొత్త, పాత నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో సతీశ్ చేసిన ప్రయత్నం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘‘‘శతమానం భవతి’ అనే టైటిల్ మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. నేను డీజే షూటింగ్ చేస్తున్నప్పుడు దిల్ రాజు చిన్న పిల్లాడిలా పరిగెత్తుకొచ్చి మనం నేషనల్ అవార్డు కొట్టాం అని అన్నారు. చాలా సంతోపడ్డాం. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి మన అందరినీ గర్వపడేలా చేసిన సినిమా శతమానం భవతి. సతీశ్‌గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను డైరెక్టర్ కాక ముందు నుంచి ఆయన సక్సెస్‌ఫుల్ రైటర్. అప్పటి నుంచే మా జర్నీ స్టార్ట్ అయ్యింది. గబ్బర్ సింగ్ నుంచి డీజే, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలకు పని చేసిన సతీశ్ ఇవాళ శతమానం భవతి అనే బ్యానర్‌ను పెట్టటం అనేది చాలా సంతోషంగా ఉంటుంది.
Kathakeli Teaser ఈ బ్యానర్‌కు నా సపోర్ట్, కో ఆర్టినేషన్ ఎప్పుడూ ఉంటుంది. తన సినిమా టైటిల్‌తో బ్యానర్‌ను పెట్టుకున్న వ్యక్తిని ఆశీర్వదించటానికి వచ్చిన దిల్ రాజుగారికి ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా యూనానిమస్‌గా గెలిచిన దిల్ రాజుగారికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. కథాకేళి సినిమా టీజర్ చూస్తుంటే సినిమా మంచి పేరు, లాభాలను తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు చింతా గోపాల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఆశీర్వదించటానికి వచ్చిన దిల్ రాజుగారు, హరీశ్ శంకర్‌గారికి థాంక్స్. ఈ సినిమాలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన సతీశ్‌గారికి థాంక్స్’’ అన్నారు.
Kathakeli Teaser చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు అవుతుంది. ప్రియా ఓ ప్రియా చిత్రంలో నా పేరుని మొదటిసారి స్క్రీన్‌పై చూసుకున్నాను. ఆరోజు నుంచి ఈరోజు వరకు రైటర్, డైరెక్టర్‌గా నిలబడ్డాను. ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎందుకు బ్యానర్ పెట్టావని చాలా మంది అడిగారు. ఇదే ప్రశ్నను నేను ఈవీవీ సత్యనారాయణగారిని వేశాను. హాయ్ సినమా నుంచి ఈవీవీగారి చివరి సినిమా వరకు ఆయన దగ్గరే పని చేశాను. ఆయన తన అనుభవాలను చెప్పేవారు. ఓసారి ఈవీవీ సినిమా అనే బ్యానర్ ఎందుకు పెట్టారని నేను అడిగినప్పుడు మనకు సినిమా తప్ప మరేం రాదు. మనం సినిమాలు మాత్రమే తీయగలం. మనం ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు మనతో నిర్మాతలు సినిమాలు చేయరు.
ఒకవేళ నిర్మాతలు ఓకే అన్నాకూడా ఆర్టిస్టులు ముందుకు రారు. కష్టమైనా, నష్టమైనా మనమే చేయాలని అన్నారు. ఆయన చెప్పిన మాటలతోనే ఇప్పుడు బ్యానర్ పెట్టాను. కోవిడ్ వల్ల నేను స్టార్ట్ చేసిన కోతి కొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ కథాకేళి. నా పాతికేళ్ల ప్రయాణానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నన్ను రైటర్‌గా పరిచయం చేసిన ముప్పలనేని శివగారికి, నన్ను డైరెక్టర్‌ని చేసిన ఈవీవీ సత్యనారాయణగారికి, అల్లరి నరేష్‌గారికి, దిల్ రాజు, హరీష్ శంకర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కెరీర్‌లో నాకు తోడుగా నిలిచిన నా భార్య రమకి, నా కొడుకు యశ్విన్, కూతురు శిరీష్, తమ్ముడు ప్రదీప్‌కి ఎప్పటకీ రుణ పడి ఉంటాను.
Kathakeli Teaser ఈ సినిమాలో ఆర్టిస్టులందరూ ఇప్పటి వరకు చాలా కథలు చెప్పి ఉంటారు. సాధారణంగా దెయ్యం కథలను అందరూ చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే.. అనేదే మా కథా కేళి సినిమా. దిల్ రాజుగారు చెప్పినట్లు డిఫరెంట్‌గా ప్రయత్నం చేసినప్పటికీ నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే కథ ఉంది. ఇప్పటి యూత్‌కు నచ్చే కథ, అందరినీ నవ్వించే హారర్‌కామెడీ ఉంది. ఈ సినిమాలో పని చేసిన నా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కి, మా చింతా గోపాల కృష్ణారెడ్డిగారికి థాంక్స్. డెఫనెట్‌గా సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.కె.బాలచంద్రన్ మాట్లాడుతూ ‘‘ ఈ సినిమాలో నేను పని చేయటానికి ప్రధాన కారణమైన నరేంద్ర వర్మగారికి థాంక్స్. డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారిని కెప్టెన్ కూల్ అని పిలుస్తాను. చాలా నెమ్మదిగా తనకేం కావాలో ఆ ఔట్‌పుట్‌ను రాబట్టుకుంటారు. త్వరలోనే కథాకేళి మీ అందరికీ ముందుకు వస్తుంది’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ దాము నర్రావుల మాట్లాడుతూ ‘‘అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్నగారికి థాంక్స్’’ అన్నారు.
Kathakeli Teaser పూజితా పొన్నాడ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కథాకేళి సినిమా వస్తుంది. చాలా మంది నటీనటులు నటించారు. అందరికీ గుర్తుండిపోతుంది. డిఫరెంట్ రోల్ చేశాను. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
అజయ్ మాట్లాడుతూ ‘‘‘కథా కేళి’లో నాది కూడా ఓ కథ ఉంది. సతీశ్‌గారు కూల్‌గా సపోర్ట్ చేశారు. అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్’’ అన్నారు.
Kathakeli Teaser నందిని మాట్లాడుతూ ‘‘నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సతీశ్ గారితో వర్క్ చేయటం నా అదృష్టం. ఆయనతో కోతి కొమ్మచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడ నుంచి నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించటం హ్యాపీగా ఉంది’’ అన్నారు.
నటుడు యశ్విన్ మాట్లాడుతూ ‘‘అమ్మా నాన్న వల్లే ఈ స్టేజ్‌పై ఉన్నాను. నన్ను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.
Kathakeli Teaser దినేశ్ తేజ్ మాట్లాడుతూ ‘‘‘కథా కేళి’లో నన్ను భాగం చేసిన సతీశ్ గారికి థాంక్స్. సరికొత్త పాత్రలో మెప్పిస్తాను. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అన్నారు.
బాలాదిత్య మాట్లాడుతూ ‘‘సతీశ్‌గారితో నాకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆయన నా లక్కీ ఛార్మ్. ఎంత మంచివాడవురా సినిమాలో అవకాశం ఇచ్చారు. తర్వాత చేసిన పొలిమేర సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాలో అవకాశం రావటానికి కారణం ఎంత మంచి వాడవురా సినిమానే కారణం. తర్వాత తమిళ సినిమాలోనూ అవకాశం వచ్చింది. సతీశ్‌గారి మంచి తనం వల్లే ఈ ప్రయాణం జరిగింది. ‘కథా కేళి’ఓ మంచి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు.
నటీనటులు:
యశ్విన్, దినేశ్ తేజ్, అజయ్, బాలాదిత్య, పూజితా పొన్నాడ, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: శతమానం భవతి ఆర్ట్స్
సమర్పణ: చింతా గోపాల కృష్ణా రెడ్డి
రచన, దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వేగేశ్న ప్రదీప్ రాజు
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.కె.బాలచంద్రన్
సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల
ఎడిటర్: మధు
ఆర్ట్: రామాంజనేయులు
లిరిసిస్ట్: శ్రీమణి
చీఫ్ కో డైరెక్టర్ : నరేంద్ర వర్మ మంతెన
పి.ఆర్.ఓ: వంశీ కాకా
If you enjoyed this article, don’t forget to follow Film combat for more awesome content. 😎
We are on all your favorite social media platforms, so join us and stay updated with the latest news, reviews and gossip from the Telugu film industry. 🎬
🌐 FILM COMBAT – SOCIAL NETWORK PLATFORMS LINKS 🌐
- Website – The ultimate destination for Telugu cinema lovers. 💯
- YouTube – Watch our exclusive videos and interviews with the stars. 🌟
- Facebook – Like our page and share your thoughts with us. 👍
- Instagram – Follow us for some amazing photos and stories. 📸
- Twitter – Tweet us your feedback and suggestions. 🐦
- Pinterest – Pin our posts and discover new ideas. 📌
- ShareChat – Chat with us and other Telugu cinema fans. 💬
Read More.. – Because there is always more to explore.