Bedurulanka2012: The Heartfelt Storytelling of ‘Bedurulanka 2012’ Delights Audiences” వరుస పరాజయాలతో సతమతమవ్వుతున్న యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ(Kartikeya Gummakonda), ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి(Neha Sshetty) జంటగా నటించిన తాజా చిత్రం ‘Bedurulanka2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న, ఈ చిత్ర ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ: శివ శంకర వర ప్రసాద్(కార్తికేయ) ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగస్థుడు. కంపెనీ లో గొడవ పడి, తనని ఎంత గానో ఇష్టపడిన ప్రెసిడెంట్(రమణ గోపరాజు) గారాల పట్టి, చిత్ర(నేహా శెట్టి) కోసం సొంత ఊరికి తిరిగి వస్తాడు. ఒక పక్క 2012 డిసెంబర్ 21న యుగాంతం వస్తుందని ఆ గ్రామ ప్రజలు గందరగోళంలో చస్తూ బ్రతుకుతుంటారు. ఊరి ప్రజల భయాన్ని భూషణ్(అజయ్ ఘోష్) తన గ్యాంగ్ బ్రమ్మం(శ్రీకాంత్ అయ్యంగార్), డానియల్(రామ్ ప్రసాద్)తో కలిసి ఎలా క్యాష్ చేసుకున్నారు అన్నదే కథ. ఈ కథ లో శివ తన తెలివి తేటలని ఉపయోగించి ఊరి ప్రజలని ఎలా భయటపడేసాడు? తన లవ్ కి వచ్చిన అడ్డంకులు ఏంటి? చివరికి యుగాంతం వచ్చిందా? లేదా? అనేది తెలియాలి అంటే కథనం లోకి వెళ్దాం..
కథనం, విశ్లేషణ: ముందుగా, ఒక మాట చెప్పాలి ఇంగ్లీష్ లో వచ్చిన 2012 యుగాంతం కి ఈ సినిమా కి పొంతనే లేదు. కానీ, 2012 యుగాంతం లైన్ మీద ‘లవ్ అండ్ ఫన్’ ని జోడించే ప్రయత్నం చేసారు చిత్ర యూనిట్….మరి, ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయ్యారా లేదో వివరాల్లోకి వెళ్దాం….
‘శివ శంకర వర ప్రసాద్'(కార్తికేయ) సెల్ఫ్ రెస్పెక్ట్ తో జీవితం కొనసాగించే వ్యక్తి. డ్యూటీ చేస్తుండగా క్లైంట్ విషయంలో తగాదా అవ్వుతుంది అప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోవడం ఇష్టం లేక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగం మానేసి, తన ప్రేయసి ‘నేహా శెట్టి/Neha Sshetty’ కోసం సొంత ఊరికి తిరిగి వస్తాడు. వీళ్లిద్దరి మధ్య సాగే లవ్ & కెమిస్ట్రీ తెరపై బాగుంటుంది. 2012 డిసెంబర్ 21న యుగాంతం వస్తుందని గ్రామ ప్రజలని క్యాష్ చేసుకునే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా, భూషణ్(Ajay Ghose), బ్రమ్మం(శ్రీకాంత్ అయ్యంగార్) మధ్య వచ్చే కామిడి సూపర్బ్. దర్శకుడు డైలాగ్స్ రాసుకున్న తీరు బాగుంది. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ ఒక్క సాంగ్ కూడా రిజిస్టర్ అవ్వకపోవడం కొసమెరుపు. మొదటి భాగం కన్నా సెకండ్ ఆఫ్ ఇంకా బాగుంది. ఈ చిత్రంలో కామిడి ట్రాక్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. కాకపోతే, ఆ మెసేజ్ అంత ఎమోషనల్ గా అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓవర్ ఆల్ గా హీరో కార్తికేయ కి, గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కమ్ బ్యాక్ అనే చెప్పాలి. సరదాగా, ఈ సినిమాని ఫ్యామిలీ తో వన్ టైమ్ తప్పకుండ చుడాలిసిన సినిమా…
నటి నటులు పెర్ఫామెన్స్: హీరో కార్తికేయ ఈ సినిమాతో మంచి నటుడుగా మరో సారి ప్రూవ్ చేసాడు. ప్రీ రీలిజ్ ఫంక్షన్ లో కార్తికేయ అన్నట్టు తెలుగు తెర కి మరోసారి ఇంట్రడ్యూజ్ అయ్యినట్టుంది. ‘నేహా శెట్టి’ స్క్రీన్ మీద కనిపించినంత సేపు చిత్ర గా ఇన్నోసెన్స్, లంగావోణీ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇకపోతే, ‘అజయ్ గోష్’ తన యాక్టింగ్ తో నెస్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అదే విధంగా శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్ బాగా రాణించారు. ‘వెన్నెల కిషోర్/Vennela Kishore’, ‘సత్య’ ఇద్దరు స్క్రీన్ మీద కనిపించింది తక్కువే అయ్యినప్పటికీ ఒక డ్రగ్ లాగా సగటు ప్రేక్షకుడికి కిక్ ఇచ్చారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు కొత్త వాడైనా సినిమా ని తీర్చిన విధానం, కాస్టింగ్ ఎంచుకున్న తీరు అద్భుతం. కాకపోతే, అక్కడక్కడ చిన్నపాటి సాగదీత గా అనిపిస్తుంటుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన ‘మణి శర్మ’ మ్యూజిక్ సినిమాకి అస్సెట్. ‘సినిమాటోగ్రఫీ’ పని తనం బాగుంది. ‘విప్లవ్ నైషధం’ ఎడిటింగ్ పనితీరు పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ‘లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్’ బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం యొక్క ప్లస్ లు…
(+) స్టోరీ టెల్లింగ్, డైలాగ్స్
(+) నటీనటులు పెర్ఫామెన్స్
(+) బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ
ఈ చిత్రం యొక్క మైనస్ లు…
(-) సాగదీత సీన్స్
(-) బలమైన ఎమోషన్స్ లేకపోవడం
(-) కథ ని బలంగా చెప్పలేకపోవడం
బాటమ్ లైన్: The Heartfelt Storytelling of ‘Bedurulanka 2012’ Delights Audiences”
రేటింగ్: 3/5
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
#filmcombat #bedurulanka2012 #bedurulanka2012telugumoviereview #nehasshetty #kartikeyagummakonda
If you enjoyed this article, don’t forget to follow Film Combat for more awesome content. 😎
We are on all your favorite social media platforms, so join us and stay updated with the latest news, reviews and gossip from the Telugu film industry. 🎬