చిత్రం: ఖుషి(2023)
నటి నటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మ్యూజిక్ డైరెక్టర్: హిషామ్ అబ్దుల్ వాహబ్
ఛాయాగ్రహణం: జి.మురళి
నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి
మూవీ బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ.
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, లేడి సూపర్ స్టార్ సమంత పెయిర్ గా నటించిన చిత్రం ‘ఖుషి’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు.
ఇప్పటికే టికెట్స్ రికార్డ్ స్థాయిలో బుక్ అవ్వగా, ‘ఖుషి’ మూవీకి మరింత ఆధరణ లభిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో మరే తెలుగు సినిమాకు రానంత సాంగ్స్ తో, మ్యూజిక్ కన్సర్ట్ తో బజ్ తెచ్చుకుంది ‘ఖుషి’. సెప్టెంబర్ 1నఅన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ: లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) ఒక నాస్తికుడు. చదరంగం శ్రీనివాస్(మురళీ శర్మ) పద్ధతులు, సాంప్రదాయాలు ఫాలో అయ్యే పక్కా బ్రామ్మణుడు. అయ్యితే, సైన్స్ గొప్పదని ఒకరు, స్పృష్టి గొప్పదని మరొకరు ఇలా, ఇద్దరి మధ్య విరోధం పెరుగుతుంది. లెనిన్ సత్యం కొడుకు విప్లవ్(విజయ్ దేవరకొండ), చదరంగం శ్రీనివాస్ కుమార్తె ఆరాధ్య(సమంత) ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. వీళ్ళద్దిరి పెళ్లి, ఇరు కుటుంబాల తండ్రులు ఓప్పుకోకపోవడంతో, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అసలు కథ ఇక్కడ మొదలవ్వుతుంది? మనసులో కన్న కూతురు, కొడుకు మీద ప్రేమ ఉన్న తండ్రి పెళ్ళికి ఎందుకు ఓప్పుకోలేదు? విజయ్ దేవరకొండ, సమంత ప్రేమ ఎలా మొదలవ్వుతుంది? విడి కాపురం పెట్టాక ఇద్దరు ఫెస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అనేది తెలియాలి అంటే, మీరు ఖచ్చితంగా ఫ్యామిలీ తో సినిమా థియేటర్ లో చుడాలిసిందే…..
కథనం, విశ్లేషణ: సినిమా ఓపినింగ్ లోనే లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) & చదరంగం శ్రీనివాస్(మురళీ శర్మ) మధ్య వాగ్వాదం చూపించి కథలోకి వెళ్తారు. విప్లవ్(విజయ్ దేవరకొండ) బి.ఎస్.ఎన్.ఎల్ టెలిఫోన్ ఎక్సచేంజ్ కంపెనీ కాశ్మీర్ బ్రాంచ్ లో పని చేస్తాడు. ఆరాధ్య(సమంత) ఐ ల్యాబ్ కంపెనీ హైదరాబాద్ లో పనిచేస్తుంది. ఈ ఇద్దరు తమ వృత్తి రిత్యా కాశ్మీర్ లో కలుస్తారు. అలా, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. విప్లవ్ & ఆరాధ్య మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అదే విధంగా కాశ్మీర్ అందాలు లోతుగా చూపించకపోయిన విజ్యువల్ ట్రీట్ కనిపిస్తుంది. అక్కడక్కడా కాస్త బోర్ అనిపించినా, మ్యూజిక్ తో నిలబెట్టింది. వెన్నెల కిశోర్ కామిడి ఒక మేరకు ఆకట్టుకుంటుంది.
దర్శకుడు పాత కథనే చెప్పిన, సెకండ్ ఆఫ్ లో మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ థియేటర్ లో బాగా పేలతాయి. ముఖ్యంగా, డోర్ సీన్, ట్రైన్ సీన్, వీళ్లిద్దరి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్, కిస్ లు ప్రధాన ఆకర్షణ. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ లో హాట్ వైఫ్ & హస్బేండ్ లా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయ్యితే, కథ కి బలమైన ఎమోషన్స్ తోడవ్వకపోవడం కాస్త మైనస్ అనే చెప్పాలి. కామెడీ కింగ్ బ్రమ్మానందం, ఆలీ గెస్ట్ అప్పీరియన్స్ సినిమాకి ప్లస్ కాకపోవచ్చు. కాకపోతే, విజయ్ & సమంత ఇద్దరికీ ఈ సినిమాతో కమ్ బ్యాక్ అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాగుంది, కుటుంబ మొత్తం కలిసి చూడాలిసిన సినిమా…
నటి నటులు పెర్ఫామెన్స్: హీరో ‘విజయ్ దేవరకొండ’ మునపటి లాగే, తనడైన స్టైల్ లో ఒక ఇన్నోసెంట్ లవర్ బాయ్ గా పెర్ఫామెన్స్ తో విజృభించాడు. ‘సమంత’ బ్రాహ్మణురాలు గా క్యారెక్టర్ లో ఓదిగిపోయింది. సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ ముఖ్య పాత్ర బాగానే పోషించారు.
‘వెన్నెల కిషోర్’ స్క్రీన్ మీద కనిపించినంత సేపు నవ్వులు ఫూయించాడు. జయరాం, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శరణ్య ప్రదీప్ తదితరులు తమ పరిధి మేరకు యాక్టింగ్ తో బాగానే రాణించారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు పాత కథనే మళ్ళి చెప్పిన, సినిమాలో పాటలు, ఫోటోగ్రఫి, విజయ్, సమంత కాంబినేషన్ ప్రధాన ఆకర్షణ గా నిలవడంతో మూవీని కాస్త గట్టెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ‘జి మురళి’ అందించిన సినిమాటోగ్రాఫి సూపర్బ్. ‘హిషామ్ అబ్దుల్ వాహబ్’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్. ఎడిటర్ ‘ప్రవీణ్ పూడి’ పనితీరు పర్వాలేదు. ‘మైత్రి మూవీ మేకర్స్’ అందించిన ప్రొడక్షన్స్ వాల్యూస్ కెవ్వు కేక.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: “A Film for All Ages: ‘Kushi’ (2023) Captivates Viewers with Its Timeless Story.”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్