- Advertisement -spot_img
HomeUncategorizedముత్తయ్య మురళీధరన్ ఎంతో సాధించినా సింపుల్‌గా ఉంటాడు, అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి -...

ముత్తయ్య మురళీధరన్ ఎంతో సాధించినా సింపుల్‌గా ఉంటాడు, అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి – ‘800’ ట్రైలర్ ఆవిష్కరణలో సచిన్

- Advertisement -spot_img

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా 800 Movie Trailer ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. 

సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) మాట్లాడుతూ ”మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్ కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. నేను 1993లో తొలిసారి మురళీధరన్ ని కలిశా. అప్పటి నుంచి మా మధ్య స్నేహం అలాగే ఉంది. లాస్ట్ మంత్ యూనిసెఫ్ వర్క్ మీద నేను శ్రీలంక వెళ్ళా. అప్పుడు మురళీధరన్ కి మెసేజ్ చేశా… ‘నేను మీ సిటీలో ఉన్నాను’ అని! ‘అక్కడ ఏం చేస్తున్నావ్. నేను భారత్ లో ఉన్నాను’ అని రిప్లై ఇచ్చాడు. తర్వాత బయోపిక్ గురించి చెప్పాడు. ఈ ఈవెంట్ కి రాగలవా? అని అడిగాడు. మురళీధరన్ ఎంతో సాధించాడు. అయినా చాలా సింపుల్ గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు. పిచ్ ఎలా ఉన్నా సరే మురళీధరన్ బంతిని టర్న్ చేయగలడు. అతడిని ఎలా ఎదుర్కోవాలని మేం మీటింగ్లలో డిస్కస్ చేసేవాళ్ళం. హర్భజన్ ఒకసారి చెప్పాడు… అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి దూస్రా వేయడానికి ముందు 18 నెలలు మురళీధరన్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడట. ఇంటర్నేషనల్ మ్యాచులలో 10,500 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తీసుకుంటే మరో 10 వేల ఓవర్లు ఉంటాయి” అని అన్నారు.  

ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) మాట్లాడుతూ ”నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్ లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో వందేళ్ళ తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. క్రికెట్ ఎలా ఆడాలో, ఎంత వినమ్రంగా ఉండాలో సచిన్ నేర్పించారు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. ఆట ఆడేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటే ఫలితం గురించి ఆలోచించం. క్రికెటర్లకు నేను ఇచ్చే సలహా అదే. పెర్ఫార్మన్స్ గురించి ఆలోచించడం మానేసి ఎంజాయ్ చేయమని చెబుతా. నేను 10, 12 ఏళ్ళు హాస్టల్ లో ఉన్నాను. అందుకని, ఎప్పుడూ నవ్వుతూ షేరింగ్ చేసుకోవడం అలవాటు అయ్యింది. నేను బౌలింగ్ చేసినప్పుడు రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ, నా బౌలింగ్ శైలిని పట్టుకోలేదు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నానా ఆటను పూర్తిగా చదివేశాడు” అని అన్నారు. 

చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. భారతరత్న సచిన్ గారు ట్రైలర్ విడుదల చేశారు. ఆయనకు థాంక్స్. ఎమోషనల్ జర్నీ ఉన్న ఫిల్మ్ ఇది. ముత్తయ్య మురళీధరన్ గారి బయోపిక్ ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుంటుంది” అని అన్నారు.   

దర్శకుడు ఎంఎస్ శ్రీపతి మాట్లాడుతూ… ”ఈ క్షణాల కోసం మేం చాలా రోజులు ఎదురు చూశాం. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు… లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కనుక ఆ స్థాయిలో క్వాలిటీగా ఉండాలని అనుకున్నా. నా టెక్నికల్ టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. కులం, మతం, భాష, దేశం వంటి బౌండరీలను మన మనుషులే క్రియేట్ చేశారు. మానవత్వం కంటే అవి ఏవీ గొప్పవి కావు. ఇది మానవత్వంతో కూడిన కథ. ఓ హ్యూమన్ స్టోరీ. తనకు ఎదురైన ఇబ్బందులను దాటుకుని, తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న లెజెండరీ క్రికెటర్ కథ. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 Movie Trailer చేయడానికి మరో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వారిలో నేనూ ఒకడిని. గోవా షూటింగుకు వెళ్ళినప్పుడు సచిన్ ఫెవరేట్ రెస్టారెంట్ అని తెలిసి మేమూ వెళ్లాం. కింగ్ క్రాబ్ సచిన్ ఫెవరేట్ ఫుడ్ అని తెలిసి షాక్ అయ్యా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంకట్ ప్రభు, పా రంజిత్, ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కారణమైన వివేక్ రంగాచారికి థాంక్స్. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. మాపై నమ్మకం ఉంచిన ఆయనకు థాంక్స్. ఆయన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మాకు ఎంతో మద్దతు ఇస్తున్నారు” అని అన్నారు.

వెంకట్ ప్రభు(Venkat Prabhu)మాట్లాడుతూ ”శ్రీపతి నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. మేం చేసిన ‘సరోజ’ 15 ఏళ్ళ క్రితం ఇదే రోజున విడుదలైంది. శ్రీపతి కోసం ఈ రోజు నేను, పా రంజిత్ ఈ వేదికపై ఉండటం సంతోషంగా ఉంది. మురళీధరన్ భార్య మదిమలర్ నా బాల్య స్నేహితురాలు. అసలు, ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయాలి. అయితే, శ్రీపతి నాకంటే బాగా తీశాడు. మురళీధరన్ గారికి శ్రీపతిని నేనే ఇంట్రడ్యూస్ చేశా” అని అన్నారు. 

మధుర్ మిట్టల్ మాట్లాడుతూ ”మురళీధరన్ గారి పాత్రలో నటించడం ఓ బాధ్యత. ఆ అవకాశం నాకు వచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. మా కెప్టెన్ శ్రీపతి గారు ఇచ్చిన సూచనలను ఫాలో అయ్యాను” అని అన్నారు. 

దర్శకులు పా రంజిత్ మాట్లాడుతూ ”ఒకవేళ మురళీధరన్ గారు చెన్నైలో జన్మించి ఉంటే మన దేశం తరఫున ఆడేవారు” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో క్రికెటర్ సనత్ జయసూర్య, ‘800’ చిత్రనిర్మాత వివేక్ రంగాచారి, మహిమా నంబియార్, యు.ఎఫ్.ఓ మూవీస్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Stay Connected
44,085FansLike
65,000FollowersFollow
52,453SubscribersSubscribe
Must Read
- Advertisement -spot_img
Related News
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page