“Mystery Solved, Hearts Won: Our Take on ‘Ms. Shetty, Mr. Polishetty'”
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పి
నటీనటులు: అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి, నాజర్, జయసుధ, అభినవ్ తదితరులు
నిర్మాత: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి
సంస్థ: యూవీ క్రియేషన్స్
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
విడుదల తేదీ: 07/ఆగష్టు/2023
తెలుగు నాట అందరికి ఇష్టమైన నటి ‘అనుష్క శెట్టి’. మూడు సంవత్సరాల తరువాత స్వీటీ సినిమా వస్తుంది అంటే అంచనాలు తార స్థాయికి చేరుకుంటాయి. జాతిరత్నాలు తరువాత మళ్ళీ మనల్ని అలరించటానికి వస్తున్న నటుడు నవీన్ పోలిశెట్టి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అందరిని ఆశ్చర్య పరిచిన సినిమా “Miss శెట్టి Mr పోలిశెట్టి”. సగటు ప్రేక్షకుడు అంచనాలని అందుకోడానికి, ఈ చిత్రం ఆగష్టు 7వ తేదీన మన అభిమాన థియేటర్స్ కి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిందో లేదో తెలుసుకుందాం.
కథ:
లండన్ నగరంలో అన్విత శెట్టి(అనుష్క శెట్టి) ఒక మాస్టర్ చెఫ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన తల్లితండ్రులు చిన్నతనంలోనే విడిపోవటంతో పెళ్లి, ప్రేమ వీటి మీద నమ్మకం పోతుంది. ఒకరోజు తన తల్లికి అనారోగ్యం కారణంగా ఇండియా కి వస్తారు. అక్కడ అన్విత శెట్టి కి సంబంధాలు చూస్తారు, కాకపోతే ఒంటరిగా ఉండటానికే మొగ్గుచూపుతోంది. తన తల్లి కోరిక కోసం, పెళ్లి చేసుకోకుండానే వైద్య పద్దతి లో బిడ్డని పొందాలనుకుంటుంది. ఆ ప్రక్రియలో సిద్దు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి ) ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో పరిచయం అవుతుంది. అతనికి స్టాండప్ కమెడియన్ అవ్వాలని కోరిక. సిద్ధుతో ఎందుకు బిడ్డని పొందాలనుకుంటుంది? ఆ విషయం సిద్ధూ తో చెప్పి కన్విన్స్ చేసిందా? అన్విత సిద్ధుని వదిలి మళ్ళీ లండన్ ఎందుకు వెళ్తుంది? చివరికి వాళ్లిద్దరూ కలుస్తారా? పెళ్లి అవుతుందా లేదా? అనేది మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మన్స్:
ఫెమినిస్ట్ లాగా కనిపించే అన్విత శెట్టి, తన పాత్రకి చాలా న్యాయం చేసిందనే చెప్పాలి. ఫెమినిస్ట్ ఛాయలు పాత్ర చెయ్యటం మరియు అందరిని మెప్పించటం చాల గ్రేట్. నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్ తో, అందరిని కడుపుబ్బా నవ్వించాడు. సినిమా మొదటి భాగంలో నవీన్ కి మరియు అతని స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు, ఇంకా అనుష్క తో జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వుకుంటారు. జయసుధ, నాజర్ ఉన్న కొద్దిపాటి నిడివిలో మంచిగా నటించారు. నవీన్ స్నేహితుడిగా నటించిన అభినవ్ చేసిన కొద్దిపాటి కామెడీ కూడా మంచిగానే పండింది అనే చెప్పచ్చు. అనుష్క స్నేహితురాలిగా నటించిన సోనియా, చాలా కాలం తరువాత సినిమాలో మెరిసి నటనతో మెప్పించింది. మురళి శర్మ, తులసి వాళ్ళ పాత్రలకి తగ్గ న్యాయం చేసారు.
సాంకేతిక విభాగం:
కొత్త దర్శకుడు మహేష్ బాబు కథని గొప్పగా తీర్చిన విధానం సూపర్బ్. అయిదు సంవత్సరాలు పెద్ద అయిన అమ్మాయి, తనకన్నా వయసులో చిన్నవాడు అయిన ఒక అబ్బాయిని, తనకి కావలసిన సహాయం కోసం నమ్మటం, తనకి నచ్చినట్టుగా మార్చుకోవటం, ఎమోషన్స్ ని బాగా రాసుకున్నారు దర్శకుడు. ఎక్కడాకూడా బోరుకొట్టకుండా మంచిగా నవ్విస్తూ నిజాలు చెప్పారు. సినిమాలో మాటలు చాలా బాగున్నాయి. నవీన్ కి తన తల్లితండ్రుల మధ్య బంధం, చాలా చక్కగా తీశారు. నిర్మాణ విలువల చాలా బాగా ఉన్నాయి. హైద్రాబాద్ లో చేసిన సన్నివేశాలు, లండన్ లో సన్నివేశాలు అన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు ఛాయాగ్రాహకుడు. ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతం అదనపు బలం.
ప్లస్ పాయింట్స్ :
అనుష్క శెట్టి నటన, నవీన్ హాస్యం సినిమాకి ప్లస్ పాయింట్. సంగీతం ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్. ఎక్కడకూడ సోదిలేకుండా చెప్పాలనుకున్న పాయింట్ తో సినిమా ని మొత్తం నడిపించారు దర్శకులు. అనుష్క అందం, అభినయం మరియు నవీన్ చురుకు నటన అందరిని ఆకట్టుకుంది. ఎవరు ముట్టుకొని ఒక కొత్త కథతో వీళ్లిద్దరి నటన చాలా అద్భుతంగా ఉంది అనే చెప్పాలి. ఛాయాగ్రాహకుడు పనితనం అమోఘం.
మైనస్ పాయింట్స్:
కథ పరంగా కొంతవరకు అన్ని వర్గాల ఆడియన్స్ ఒప్పుకోని పాయింట్. పెళ్లి కాకుండా తల్లి అవ్వటం ఏంటి అని ప్రశ్నించే అవకాశం ఇచ్చారు దర్శకులు. మొదటి భాగంతో పోల్చుకుంటే హాస్యం తక్కువ ఉండటంతో పాటు, సన్నివేశాలు కొంచం నిదానంగా అనిపించేలా ఉంటాయి. ఒక పాట తప్ప మిగతావి అంతగా ఎక్కలేదు అనే చెప్పొచ్చు. కానీ వినటానికి బాగున్నాయి.
రేటింగ్: 3.75 /5
బాటమ్ లైన్:”Mystery Solved, Hearts Won: Our Take on ‘Ms. Shetty, Mr. Polishetty'”
రివ్యూ బై: సాయిరామ్ తాడేపల్లి