Between Hope & Hype: Sodara Sodarimanulara – A mixed Review”
చిత్రం: సోదర సోదరీమణులారా
నటి నటులు: కమల్ కామరాజు, అప్పర్ణా దేవి, కాలకేయ ప్రభాకర్, పృథ్వి తదితరులు.
ఎడిటర్: పవన్ శేఖర్
సంగీతం: విష్ణు వర్ధన్
సినిమాటోగ్రఫీ: మోహన్ చారి
నిర్మాత: విజయ్ పైండ్ల
మూవీ బ్యానర్: నైన్ ఈఏం ఎంటర్టైన్మెంట్స్
రచన, దర్శకత్వం: రఘుపతి రెడ్డి
విడుదల తేదీ: 15.09.2023
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘కమల్ కామరాజు’. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ‘కమల్ కామరాజు’ ప్రధాన పాత్రదారుడిగా పోషిస్తున్న చిత్రం “సోదర సోదరీమణులారా”. నైన్ ఈఏం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాత విజయ్ పైండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రఘుపతి రెడ్డి’ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.
కథ:
కమల్ కామరాజు(రాజు) ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. అప్పర్ణా దేవి(శ్రావణి) భార్య & మహా(కూతురు) చక్కటి కుటుంబంతో దాంపత్యం కొనసాగిస్తుంటాడు రాజు. బ్యాంక్ లో కొంత అమౌంట్ కట్టి, లోన్ లో కార్ తీసుకున్న రాజు, మిగతా అమౌంట్ కట్టలేకపోవడంతో ఏజెంట్ తరుచుగా ఇంటికి వచ్చి భయపెడుతుంటాడు. ఒక రోజు రాజు కి లాంగ్ డ్రాప్ కస్టమర్(సన్నీ) బేరం దొరుకుతుంది. అసలు కథ ఇక్కడ మొదలవ్వుతుంది?. కస్టమర్(సన్నీ)ని డ్రాప్ చేసాక ఒక ప్రాబ్లమ్ ఫెస్ చేస్తాడు? అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? సన్నీ ఎవ్వరు? కాలకేయ ప్రభాకర్(డి.భాస్కర్-సిఐ) ఎందుకు కమల్ కామరాజు(రాజు) జైల్ లో వేసాడు? అసలు పృథ్వి(పోలిటీషియన్) & కమల్ కామరాజు(రాజు) సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే వివరాల్లోకి వెల్దాము…
కథనం, విశ్లేషణ:
తెలుగు ఇండస్ట్రీ లో గత కొంత కాలంగా సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ జానర్స్ కొకళ్ళలో థియేటర్లో రీలిజ్ అవ్వుతున్నాయి. కాకపోతే, కొన్ని సినిమా స్టోరీలు బాగుంటే, స్క్రీన్ ప్లే లో విఫలం అవ్వుతున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంటే నటి నటులు ఎంపిక విషయంలో బోల్తా పడుతున్నారు. మరి, ఈ సోదర సోదరీమణులారా సినిమా ఏ కోవకి చెందింది, ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..!!
ఓపెన్ చేస్తే రాజా(కమల్ కామరాజ్) సాధారణ డ్రైవర్. తన మధ్య తరగతి కుటుంబాన్ని పోషిస్తూ, ఆర్ధికంగా సతమతవ్వుతున్న వ్యక్తి. కాకపోతే, కట్టుకున్న భార్య శ్రావణి(అప్పర్ణా దేవి) మొగుడికి మోరల్ సపోర్ట్ ఇస్తూ, కూతురు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటిని చక్కబెడుతుంది. అయ్యితే, ఆర్ధికంగా సతమవ్వుతున్న సన్నివేశాలు బలంగా/ఎమోషనల్ గా దర్శకుడు పోట్రైట్ చెయ్యలేకపోవడం కొసమెరుపు. ఇకపోతే, వైఫ్ & హుస్బేండ్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఓ రోజు, రాజా డబ్బులు కోసం ‘సన్నీ’ అనే కస్టమర్ తో లాంగ్ డ్రాప్ వెళ్తాడు. లొకేషన్ కి ఇద్దరు రీచ్ అయ్యాక కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వుతాయి. వీళ్లిద్దరి మధ్య సాగే సన్నివేశాలు తెర మీద ఆకట్టుకోవు. కానీ, సస్పెన్స్ క్రియేట్ అవ్వుతుంది. ముఖ్యంగా, సన్నీ అనేవాడి ప్లేస్ లో యాక్టింగ్ వచ్చిన వాడిని మరొక వ్యక్తిని పెట్టి ఉంటే బహుశా ఇంకా బాగుండేదేమో.
అక్కడక్కడా సినిమాలో వచ్చే కొన్ని సన్నివేసాలు సాగదీతగా అనిపించినా, కమల్ కామరాజు, అప్పర్ణా దేవి స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్ ద్వారా కాస్త ఊరటనిచ్చాయి. ఒకటి రెండు చోట్ల వచ్చే ట్విస్ట్ లు బాగానే అనిపించినప్పటికీ సబ్జెక్ట్ లోకి డెప్త్ గా వెళ్ళకపోవటంతో తేలిపోతాయి..!!
కొన్ని చోట్ల వచ్చే తాగుబోతు క్యారెక్టర్ వరస్ట్ పెర్ఫామెన్స్ తో పాటు సినిమా కి డిస్టబెన్స్ అనిపిస్తుంటుంది. టీ కొట్టు వాడు చిన్న పిల్లలని అబ్యూజ్ చేసే క్యారెక్టర్ కి సరైన పే ఆఫ్ చేయకపోవటం. కాకపోతే, దర్శకుడు ముందడుగా వేసి తనకున్న రిసోర్స్ లో సినిమా చేసాడని అర్ధమవ్వుతుంది. స్టోరీ ఎంచుకున్న విధానం బాగున్నా, స్క్రీన్ ప్లే కాస్త గ్రిప్పింగా మలిచి ఉంటె బాగుండేది.
నటి నటులు పెర్ఫామెన్స్: ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్న ‘కమల్ కామరాజు” ఈ సినిమాతో మరింత ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ప్రతి సీన్స్ లో ఎంతో చక్కగా కథని మోస్తూ, నటనని మెప్పించడంలో పోటా పోటీ పడిన విధానం అద్భుతం.
‘అప్పర్ణా దేవి’ యాక్టింగ్ తెర మీద హోమ్లీ పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంది. కాలకేయ ప్రభాకర్ పోలీస్ పాత్రలో ఓదిగిపొయి ప్రేక్షకులని భయపెట్టారు. పృథ్వి కథ కి ఎంతో కీలకం, తదితరులు తమ పరిధి మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: డైరెక్టర్ ‘రఘుపతి రెడ్డి’ కథ ఎంచుకున్న తీరు, తీసిన విధానం బాగుంది. కాకపోతే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడి ఊహా గానానికి నెస్ట్ లెవల్ కి తీసుకెళ్తాయి. పవన్ శేఖర్ అందించిన ‘ఎడిటింగ్’ విభాగంలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయి. ఎడిటర్ ఇంకాస్త శ్రద్ద తీసుకొని ఉంటె బాగుండేది. ‘విష్ణు వర్ధన్’ అందించిన మ్యూజిక్ ఓ మేరకు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ మోహన్ చారి ఇచ్చిన విజ్యువల్స్ సినిమాకి హైలైట్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మేరకు బాగానే అందించిన ఇంకాస్త, తోడయ్యి ఉంటే బాగుండేది.
రేటింగ్: 3/5
బాటమ్ లైన్: Between Hope & Hype: Sodara Sodari Manulara – A mixed Review”
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: ఈ రివ్యూ, రేటింగ్స్ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే…వ్యక్తి గతంగా ఎవ్వరిని ఉద్దేశించి రాసింది కాదని మనవి. ప్రతి సినిమా థియేటర్ లో ఆడాలిని ప్రేక్షకుడి విజిల్స్ పడాలని కోరుకునే వ్యక్తుల్లో మా టీమ్ కచ్చితంగా ఉంటుందని మనవి..