ఆ ఇద్దరు మిత్రులు కలిసి ఏం చేశారో తెలుసా? Joruga Hushaaruga Shikaaru Podhama
ఏదన్నా సాధించాలి అంటే తపన ఉండాలి, అని మన పూర్వికులు అంటుంటారు. తపనతో పాటు ఒక నిజమైన తోడు ఉంటే ఆ ప్రయాణం ఇంకా మధురంగా, మరపురానిది లాగా ఉంటుంది. ఆ తోడు స్నేహితుడు అయిన పర్వాలేదు. మన ఆలోచనని నమ్మి మనతో ఉంటే చాలు అదే బలం.
2008 లో ఇద్దరు మిత్రులు మొదలు పెట్టిన యూట్యూబ్ ప్రయాణం వాళ్ళని చాలా దూరానికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఏకంగా ఒక చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించి, విడుదల చేసే స్థాయికి తీసుకెళ్లింది. కొన్ని ప్రయాణాలు అనుకోని గమ్యానికి చేరుస్తాయి. ఆ గమ్యానికి చేరేదాకా నమ్మకం మరియు ధైర్యం వదులుకోకూడదు. అదీ చేసారు, సుభాష్ చంద్ర, ధీరజ్ రాజు.
2008 లో ఇద్దరు కలిసి యమ్.ఆర్. ప్రొడక్షన్స్ (MR . Productions) పేరుతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ప్రయాణం మొదలు పెట్టారు. 2009 లో, వాళ్ళ మొదటి షార్ట్ ఫిలిం “సక్సెస్ స్టోరీ అఫ్ ఎ స్ట్రీట్ బాయ్ (Success story of a street boy ) విడుదల చేసారు. అందరి ప్రయాణం లాగానే ఇది కూడా నెమ్మదిగా మొదలయ్యింది. సోషల్ మీడియా అంటే అప్పుడప్పుడే అందరికి తెలుస్తున్న రోజులవి, ఉన్న అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకున్నారు.
ఒకదాని తరువాత ఒకటి, మంచి కథలని ఎంచుకోవటం మొదలు పెట్టారు. మంచిగా నటించే వాళ్ళని గుర్తించి, వాళ్ళ టాలెంట్ ని వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. వాళ్ళ ప్రొడక్షన్ లో పనిచేసిన కొందరు నటులు, ఇప్పుడు తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటి షార్ట్ ఫిలిం తోనే ప్రేక్షకులని ఆకట్టుకోవడం మొదలు పెట్టిన వీళ్ళ ప్రయాణం, కొత్త వాళ్ళని వెతికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే తపనతోనే నడిచింది.
చాలా మందికి వీళ్ళ ప్రొడక్షన్ లో వచ్చిన “The possessiveness ” షార్ట్ ఫిలిం అంటే చాలా ఇష్టం. ఆ షార్ట్ ఫిలిం లో చేసిని హీరోయిన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా చేస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ ఒక్కటే కాకుండా, సాంగ్స్ కవర్ షూట్స్ కూడా చేసారు. స్వతహాగా పాటలు రాసే రచయితలని గుర్తించి, పాటల రచన, సంగీతం, ఇలా చాలా మందిని వెలుగులోకి తెచ్చిన ఘనత వీళ్ళ టీం. MR. Productions లో M అంటే M.V.G.R. College Of ఇంజనీరింగ్, R అంటే Raghu Engineering College.
సుభాష్ దర్శకత్వంలో, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఒక సినిమా రాబోతోంది. సంతోష్ శోభన్ హీరోగా, ఫాల్గుణి ఖన్నా నూతన పరిచయంగా రాబోతున్న చిత్రం ‘జోరుగా హుషారుగా షికారు పోదమా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మందికి ఆదర్శం అయిన వీళ్ళ ప్రయాణం ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని, ఇలానే కొత్త టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనసారా కోరుకుందాం.