అక్కమ్మ, ఆ సినిమాలో ఏ వర్గం వైపు నిలబడుతుంది?
శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వం లో రాబోతున్న చిత్రం పెదకాపు మొదటి భాగం. ఈ చిత్రం గురించి మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా కట్ చేసారు. ట్రైలర్ లోనే తెలుస్తోంది, ఇది ఒక పొలిటికల్ మరియు కుల ఘర్షణల సంబంధించింది అని. కొత్త నటి నటుల్ని తీసుకొని దర్శకుడు మంచి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఒక మంచి చిత్రానికి మూలం బలమైన నటి నటులు కూడా. ఇందులో నటి నటులు బాగా నటించటమే కాదు, వాళ్ళ నటనతో పాత్రకి ప్రాణం పొయ్యాలి. అలాంటి నటి మన అనసూయా భరద్వాజ్.
రంగమత్తగా తన నటన చాతుర్యాన్ని చూపించిన అనసూయ, ఇప్పుడు పెదకాపు లో అక్కమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. పెదకాపు టీం మొత్తానికి అనసూయా గారి క్యారెక్టర్ వీడియో విడుదల చేసారు. దర్శకుడి గాత్రంతో సాగే ఒక డైలాగ్ ప్రోమో విడుదల చేసారు.
“చరిత్రని మార్చాలన్నా, మారిన చరిత్రని చూడాలన్నా చాలా దూరం ప్రయాణించాలి. ఎంత దూరం అంటే మనిషికి మార్పుకి ఉన్నత దూరం” అంటూ సాగే ఈ డైలాగ్ ప్రోమో తో అనసూయా గారి క్యారెక్టర్ పేరు “అక్కమ్మ” అని విడుదల చేసారు. పేరు కొంచం కొత్తగానే ఉన్నా కూడా, ఆ డైలాగ్ కి సంబందించిన పాత్రకి ప్రాణం పొయ్యాలంటే అది అనసూయా గారి వల్లే అయ్యేలాగా అనిపిస్తోంది.
అనసూయ అభినయం, మాటలు చాలా ఆలోచనలని రేకెత్తించ్చేలా ఉన్నాయి. అనసూయా గారి ఫోటో చూసాక, ఇంతకీ ఆవిడా సినిమాలో ఎవరి పక్కా అనేది తెలియలేదు. హీరో తరపునా, లేకపోతే జనాలకి న్యాయం చేసేలా చూసే ఒక యోధురాలు, లేకపోతే అన్ని దారుణాలని చూస్తూ కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండే ఒక దీనురాల తెలియాల్సి ఉంది. ప్రతినాయకుడి తరపునా అని కూడా తెలియని విధంగా ఉంది. కానీ ఆవిడ కళ్ళల్లో చూపించిన బాధ, పౌరుషం చూస్తుంటే, మంచి గుర్తింపు తెప్పించే పాత్రలా అనిపిస్తోంది.
ఏది ఏమైనా కూడా మూవీ విడుదల అయ్యేదాకా వేచి చూడాలి. ఎప్పటిలానే అనసూయా నటనతో అందరిని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.