హీరో రామ్ తో బ్రేకప్ అయ్యిన అమ్మాయి ఎవ్వరు? ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న విషయం ఏంటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను నుంచి సినిమా వస్తోంది అంటే, విభిన్నమైన అభిప్రాయాలతో మూవీ ఫాన్స్ రెడీగా ఉంటారు. ఎందుకంటే, అయన తీసే విధానం ఆలా ఉంటుంది మరి. భయంకరమైన రక్తపాతం, మాస్ డైలోగ్స్, ఊర మాస్ పోరాట సన్నివేశాలు. అన్ని కలిస్తే బోయపాటి సినిమా. ఇప్పుడు కూడా అలాంటి నేపధ్యంతోనే వస్తున్నా చిత్రం “స్కంద”. రామ్ పోతినేని హీరోగా, శ్రీ లీల జంటగా నటిస్తున్నారు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్స్ లో మాస్ రచ్చ షురూ చేయబోతోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు అభిమానులని కలవర పెడుతున్నాయి, ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొదట కలవరం దేనికో తెలుసా. ఈ చిత్రం యూనిట్ వాళ్ళు ప్రమోషన్స్ చెయ్యకూడదని కంకణం కట్టుకున్నట్టున్నారు. భారీ తారాగణంతో చిత్రికరిస్తున్న ఈ చిత్రం, పాటలు అందించిన థమన్ తన వరుకు న్యాయం చేసాడు కానీ, తార స్థాయిలో ప్రమోషన్స్ జరగకపోవడం తో రామ్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.
విడుదలైన మొదటిరోజు ఏ మాత్రం తేడా కొట్టిన కలెక్షన్స్ నెమ్మదిగా పడిపోతాయి. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటినుంచి ఒక విధంగా ప్రమోషన్స్ పర్వాలేదు అనిపించినా, చెయ్యాల్సిన ప్రమోషన్ మాత్రం చెయ్యట్లేదు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరో రామ్, శ్రీ లీల ఇంటర్వూస్ ఇస్తున్న కూడా, ఎక్కడ దర్శకుడు కానీ, ముఖ్య తారాగణం కానీ కనిపించట్లేదు. అసలు నిర్మాత ఎక్కడ కనిపించట్లేదు, పైగా దర్శకుడు సినిమా కి తుదిమెరుగులు దిద్దేపనిలో ఉన్నారని టాక్.
ఇంకా రెండో విషయం అందరికి ఆశ్చర్యాన్ని గురిచేసే విషయం ఏంటి అంటే? ఈ చిత్రం ప్రమోషన్ భాగం గా రామ్, శ్రీ లీలా ఇచ్చిన ఇంటర్వ్యూ లో, సుమ గారు అడిగిన ప్రశ్నకు రామ్ ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్య పరిచింది.
“ఇంతకముందు ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ అయ్యాయా?” అని సుమ గారు అడిగిన ప్రశ్నకి రామ్ “అవును” అని సమాధానం ఇచ్చారు. కానీ అది ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. కానీ దాన్ని నుంచి బయటకి రావటానికి చాలా సమయం పట్టింది అని మాత్రం అన్నారు. ఇప్పుడు అభిమానుల ప్రశ్న ఏంటి అంటే, రామ్ నిజం గానే లవ్ ఫెయిల్యూర్ అయితే, అది ఒక నటి తోనా, లేకపోతే సాధారణమైన అమ్మాయా. ఒకవేళ నటి అయితే ఎవరు అయ్యుంటారు అనేది చాల మంది ప్రశ్న?. ఆ తరువాతి ప్రశ్నలో, సుమ గారు “ఇంటర్వూస్ లో ఇప్పటిదాకా ఎప్పుడన్నా అబద్దం చెప్పారా?” అని అడిగారు. దానికి రామ్ “అవును” అన్నారు. ఇంతకీ ముందు ప్రశ్నకి అయన ఇచ్చింది నిజమైన సమాధానమే లేకపోతే అబద్దమా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి అంత పెద్ద హీరో కి కూడా లవ్ ఫెయిల్యూర్ అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది.
19:00 Time Check it
Ram pothineni rapo sreeleela skanda boyapati srinu