ఆ హీరోయిన్ తో టచ్ లో ఉంటాను?
కన్నడ ఇండస్ట్రీ విలక్షణ నటుడు, రక్షిత్ శెట్టి. ఆయన తన అన్నలతో సినిమా ప్రయాణం మొదలు పెట్టి , అంచలంచలుగా ఎదిగారు. సినిమా కి సినిమా గ్యాప్ ఎక్కువ అయినా తీసే ప్రతి చిత్రం కుటుంబం మొత్తం చూసేలాగా జాగ్రత్త తీసుకుంటారు.
అటువంటి సినిమాలలో తనకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన చిత్రం కిరిక్ పార్టీ . తెలుగు ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన చిత్రంగా గుర్తింపు పొందింది. ఆ చిత్రానికి కథ దర్శకత్వం ఇంకా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఆ చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయం అయినా నటి ‘రష్మిక మందన్న’. ఆ చిత్ర నిర్మాణంలోనే వాళ్లిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనసులు కలిసిన ఈ ప్రేమజంట నిశితార్థం దాకా వెళ్లి, ఏమయ్యిందో ఏమో కానీ. పెళ్లి జరగకుండా ఆగిపోయింది. కారణాలు ఏమయినాకూడా వాళ్ళు విడిపోయారు అనేది అందరికీ తెలిసిన విషయం.
ఆ తర్వాత కొన్ని రోజులు సోషల్ మీడియా లో రష్మిక మీద ట్రోలింగ్ జరిగినా వాళ్ళు ఇద్దరూ పట్టించుకోలేదు. తరువాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ గా ఉండగా, ఈ లోగా ‘రష్మిక’ నేషనల్ క్రష్ అయ్యిపోయింది. ఈ మధ్య రక్షిత్ శెట్టి కన్నడ సినిమా “సప్త సాగరాలు ధాటి” చిత్రం తెలుగు లో కూడా విడుదల చేసారు. ఈ సందర్భంగా అయన హైదరాబాద్ వచ్చి పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్మిక ప్రస్తావన వచ్చినప్పుడు అయన, “మేము ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని. ఇద్దరి చిత్రాల విడుదల ముందు ఒకరికొకరం విష్ చేసుకుంటాం. రష్మిక నేషనల్ క్రష్ అయ్యారు. ఆవిడ ఎదుగుదల చూసి నాకు చాలా ఆనందంగా ఉంది”.
ఎంతైనా ఇలా ఇండస్ట్రీ లో ఉంటూ, ఒక పర్సనల్ ప్రాబ్లెమ్ ని ముందుకి తీసుకొచ్చి సింపతీ తెచ్చుకోకుండా, ఎదుటివాళ్ళ పరువు పోగొట్టేలా మాట్లాడకుండా, ఎవరి లైఫ్ ని వాళ్ళు మర్యాద ఇవ్వటం అనేది చాల అరుదైన విషయం. ఈ విషయంలో రక్షిత్ శెట్టి గారిని మెచ్చుకోక తప్పదు.