Rumor Buster: Eesha Rebba’s Remuneration Myths Debunked. She is More Than Just an Actress, A Truth-Teller.
తెలుగు నటీమణులు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ని రూల్ చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పోను పోను తెలుగు వాళ్ళకి అవకాశాలు రావటం సన్నగిల్లాయి. అలా, అని మన తెలుగు అమ్మాయిలకి నటించటం రాదు అని కాదు. కొత్తకి వింత అనే సామెత ఉంటుంది కదా!! అలానే జరుగుతోంది. తెలుగు మంచిగా మాట్లాడే అమ్మాయిలకి అవకాశాలు కొంచం తక్కువనే చెప్పాలి. కారణాలు ఏదైనా కావచ్చు అది నిజమేకదా!! కానీ ఇంత పర బాషా నటీమణుల ఆధిపత్యంలో కూడా తనదైన ముద్ర వేసుకున్న అచ్చ తెలుగు లక్కీ చార్మ్ ‘ఈషా రెబ్బ’. అందం అభినయం, ఆమె సొంతం.
ఎంత సహజంగా కనిపిస్తారో, అంతే సహజంగా నటిస్తారు. తన పది సంవత్సరాల సినిమా కెరీర్ లో చేసినవి కొద్దిపాటి సినిమాలు అయినా కూడా, తన నటనతో అందరికి గుర్తుండిపోయేలా చేసారు. ‘దయ’ వెబ్ సిరీస్ లో ఆవిడ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారని చెప్పచ్చు.
‘ఈషా రెబ్బ’ నటించిన ‘మాయా మచ్చింద్ర’ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సుధీర్ బాబు కథానాయకుడు. ట్రైలర్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈరోజు, ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగం గా ఈషా పాత్రికేయులతో చర్చించారు. తన పాత్ర గురించి, చిత్రం ఏలా ఉండబోతోంది అనేది కూడా అందరితో పంచుకున్నారు.
కరోనా వల్ల అందరు ఇంట్లో ఉండి, వెబ్ సిరీస్ చూడటం అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు సినిమాలకి పోటీగా వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి. కానీ, వెబ్ సిరీస్ లో చెయ్యటం వలన, తన రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటుంది అని, ఒకవేళ తన దగ్గరికి కథ వస్తే చేయరేమో అని అపోహలతో కొంత మంది తనని కలవకుండా ఉంటున్నారని ఈషా భావించారు. తనకు అలాంటివి ఆంక్షలు ఏమి లేవని, కథ మంచిగా ఉంటె చెయ్యటానికి సిద్ధం గా ఉన్నారని, కథ, క్యారెక్టర్ తాను ముఖ్యం గా చూసుకుంటాను అని చెప్పారు. తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో తన పర్సనల్ మెయిల్ ID ఉందని, తనని డైరెక్ట్ గా సంప్రదించొచ్చు అని పేర్కొన్నారు.
తన పది సంవత్సరాల కెరీర్ లో, తాను చేసిన క్యారెక్టర్ లు అన్ని బాగా నచ్చి చేశాను. రెమ్యూనరేషన్ గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, కథలు చెప్పటానికి తనని సంప్రదించొచ్చు అని చెప్పుకొచ్చారు. నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటివి కావాలని సృష్టిస్తారేమో అని!! ఇంత మంచి నటికి అవకాశాలు వస్తే, చాలా మంది తెలుగు అమ్మాయిలకి ప్రేరణగా ఉంటుంది. నమ్మకం ఉంటుంది. ఈషా రెబ్బ నటించిన “మయా మచ్చింద్ర” చిత్రం మంచి విజయం సాధించాలని, ఈషా రెబ్బకి ఇంకా మంచి అవకాశాలు రావాలని, మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఈ సందర్భంగా తనకి అవకాశాలు కొన్ని అపోహాల వలన రావటంలేదు అని తనకి కొంచం బాధించింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు.