మెగా కుటుంబం నుంచి మేన మామ వేసిన బాటలో నడుస్తూ తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించుకున్న నటుడు ‘సాయి ధరమ్ తేజ’. “రేయ్” అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యి, నటనలోనే కాదు, నాట్యంలో కూడా మేనమామ ని తలపించేలా గుర్తింపు వచ్చింది. కానీ, ఈ మధ్య విడుదల అయిన ‘విరూపాక్షా’, ‘బ్రో’ చిత్రాలలో ఆయన డ్యాన్స్ లు ఫాన్స్ ని మెప్పించలేకపోయాయి. విరూపాక్షా లో డాన్స్ చేసేంత పాటలు లేకపోయినా, బ్రో లో ఉన్నాయి. కానీ ఆయన సరిగ్గా చెయ్యలేదని టాక్ నడించింది. ఇంతకీ ఆయనకి ఏమయ్యింది, ఇక ముందు డాన్స్ చేస్తారా చెయ్యరా? ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి.
అయ్యితే, ఈ మధ్య ఆయన నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ “ది సోల్ అఫ్ సత్య” లో కలర్స్ స్వాతి జోడిగా నటించారు. రీసెంట్ గా కలర్స్ స్వాతి నటించిన “మంత్ అఫ్ మధు” చిత్రం త్వరలో విడుదల ఆవ్వబోతోంది. ఈ సందర్భంగా, సాయి ధరమ్ తేజ పాత్రికేయులతో ముచ్చటించారు. ఇప్పుడు ఆయన ఉన్న విధానం మీద చర్చ సాగుతోంది.
2021 సెప్టెంబర్ 10 వ తేదీన రాత్రి ధరమ్ తేజ గారికి బైక్ యాక్సిడెంట్ అయ్యిన విషయం తెలిసిందే. దేవుడి కృప వల్ల ఆయన బ్రతికారు. ఆ తరువాత మెల్ల మెల్లగా చిత్రాలలో కూడా నటిస్తున్నారు. కానీ రాను రాను ఆయన చాలా లావుగా అవుతున్నారు. ఇదివరుకులాగా ఆయన శరీర తత్వం లేదేమో అని అందరికి అనుమానం. యాక్సిడెంట్ వల్ల మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆయన తక్కువ సమయం లోనే లావు అయినట్టు కనిపిస్తున్నారు. విరూపాక్షా కన్నా బ్రో లో కొంచం బొద్దుగా అయ్యారు.
కానీ అందరు యాక్సిడెంట్ వల్లనే అనుకుని సరిపెట్టుకున్నారు. ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్ లో కనిపించిన విధానానికి అందరు ఆశ్చర్య పోతున్నారు. అంతగా లావు అవ్వటం, డాన్స్ చెయ్యలేకపోవటం వలన ఆయన ఆరోగ్యం విషయం లో చాలా అనుమానాల్ని అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. ఆయనకి నిజంగా ఏమన్నా ఆరోగ్య సమస్య ఉందా? లేకపోతే యాక్సిడెంట్ వల్ల తీసుకున్న మందుల వలన అలాగా ఒళ్ళు చేసారా. లేకపోతే ఇంకేమన్నా విషయం ఉన్నదా అనేది తెలియాల్సి ఉంది.
ఏది ఏమయినప్పటికీ, ఆయన ఇలా కనిపించటం అనేది అభిమానులకి కలవరపరిచే విషయమే. ఆయనకి ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఎలాంటి సమస్య కలుగకూడదు అని, అభిమానులు దేవుడిని కోరుకుందాం..