ఆ హీరో కి ఎన్ని కష్టాలో పాపం!!
సినిమాకి ఉన్న మర్యాదనీ, నటులకి ఉన్న మర్యాదనీ కొంతమంది అప్పుడప్పుడు తమ పిచ్చి వేషాలతో పరువు తీస్తూ ఉంటారు. అలాంటి, సమయంలోనే సినిమా పట్ల తమకున్న అభిమానాన్ని, మర్యాదనీ, తోటి నటుల పట్ల ఉన్న మర్యాదతో పాటు మమకారాన్ని కొంతమంది చూపుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తునప్పుడే అనిపిస్తూ ఉంటుంది, మంచితనం, ఇంకా మిగిలి ఉంది అని. అలాంటి సంఘటన హీరో ‘సిద్ధార్థ్’ కి జరిగింది.
దేశం అన్నాక ఇరు రాష్ట్రాల మధ్య ఏదొక రాజకీయా చిచ్చు ఉంటూనే ఉంటుంది. దానివల్ల కొన్ని అవాంతరాలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది తమ పక్క రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టటం జరుగుతూనే ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు ‘కావేరి’ నది సమస్య. కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు రాష్ట్రానికి మధ్య అడ్డు గోడలా మారింది. కొంతమంది మనుషుల మనసులో విషపు జ్వాలలు రేపింది. అలాంటి రీజన్ వల్లే హీరో సిద్ధార్థ్ ని, అవమానించేతవరుకు తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళితే, హీరో సిద్ధార్థ్ తన కొత్త చిత్రం ‘చిక్కు’ . ఇది స్వతహాగా కన్నడ చిత్రం. హీరో సిద్ధార్థ్ తెలుగు లో చాలా ప్రసిద్ధి చెందిన నటుడు. అలానే హిందీ మరియు తమిళం, మలయాళంలో కూడా. ఈయన తమిళుడు అని, ఆయన చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ని, కొంతమంది కన్నడ ఉద్యమకారులు అడ్డగించారు. అందువల్ల ప్రెస్ మీట్ ఆగిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న కన్నడ సూపర్ స్టార్ DR . శివరాజ్ కుమార్ గారు, బహిరంగంగా ఈ సమస్య గురించి చర్చించారు. “రాష్ట్రాల మధ్య సమస్యే ఉంటే పోరాడాల్సింది సమస్య మీద, సమస్యని పరిష్కరించే విధంగా పోరాడాలి. అంతేకాని భాష బేధం తో ఇలా చెయ్యకూడదు” అని సూచించారు. “ఇలా చెయ్యటం చాలా బాధాకరం, దీన్ని ఖండిస్తున్నాను” అని అన్నారు. అంతే కాదు, బహిరంగంగా, ఆయన సిద్ధార్థ కి కన్నడ ప్రజల తరపున క్షమాపణలు చెప్పారు. ఇంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి ‘శివరాజ్ కుమార్’ అని అందరు ఆయన్ని పొగుడుతున్నారు.
సొంత రాష్ట్ర ప్రజలు అయినా కూడా, తప్పు జరిగినప్పుడు, తప్పుని ఒప్పుకుని, క్షమాపణ చెప్పటం అనేది ఆయన ఔదార్యానికి నిదర్శనం. ఇలాంటి గొప్ప వ్యక్తి మన భారత చిత్ర సీమలో ఉండటం మన అందరి అదృష్టం. ఏది ఏమైనా ఈ సంఘటన వలన మనం తెలుసుకోవలసింది ఒక్కటే, కళకి భాష బేధం లేదు ఉండదు ఉండకూడదు. రాష్ట్ర సమస్యని కళకి సంబందించిన వాళ్ళ మీద చూపించటం చాలా తప్పు. దేనికి ఇవ్వాల్సిన మర్యాద ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. ఎందుకంటే అందరం భారతీయులం కాబట్టి. శివరాజ్ కుమార్ తాను నడుచుకున్న పద్దతితో అందరి మనసులు గెలిచారు. ఇకనైనా, ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది.