చరిత్ర పటంలోకి ఎక్కిన ‘బుట్ట బొమ్మ’ సాంగ్.
కొన్ని సార్లు అనుకోని విధంగా పాటలు హిట్ అయ్యి శ్రోతుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆ పాటలకి ఇంస్టాగ్రామ్ లో డాన్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ మధ్య భారత దేశంలో యూట్యూబ్ డేటా బేస్ చేసుకొని ఒక ఎనాలిసిస్ రీలిజ్ చేశారు. దేశంలో ఉన్న ఒక్కో రాష్ట్రంలో ఏ పాట ఎక్కువశాతం చూసారు అనేది తెలిసింది.
అత్యధికం గా “హనుమాన్ చాలీసా” విన్నారని తెలిసింది. మన తెలుగు రాష్ట్రంలో మాత్రం అల్లు అర్జున్ నటించిన చిత్రం “అలా వైకుంఠపురములో” చిత్రంలో “బుట్ట బొమ్మా” పాట అన్నిటికంటే ఎక్కువగా విన్న పాటగా రికార్డు సృష్టించింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో, థమన్ సంగీతం అందించిన ఈ పాట, జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేసారు. ఈ సినిమా విడుదల అయినప్పటినుంచే ఈ పాట అందరిని ఆకట్టుకుంది. పెద్ద పెద్ద తారలు కూడా ఈ పాటతో డాన్స్ వీడియోస్ చేసి ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసి సందడి చేసారు. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా తన భార్యతో ఈ పాటకి డాన్స్ చేసారు. ఆయనకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం కూడాను.
అలాగా ఈ పాట ప్రపంచమంతటా సందడి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ పాట మిల్లియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే హనుమాన్ చాలీసా త్రీ బిలియన్ కన్నా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుని మొదటి స్థానంలో ఉంది. బన్నీ అభిమానులకి ఇది ఒక పండగలాంటి వార్త అనే చెప్పాలి. ఇలాంటి పాటలు ఇంకా అభిమానులకోసం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.