జీవితం అంటేనే ప్రేమ, బాధ, కోపం, ఆప్యాయత, అర్థం చేసుకునే తత్త్వం. బంధాల మధ్య అయితే ద్వేషం, ఈర్ష కూడా ఉంటాయి. అవి ప్రేమని కప్పేస్తాయి కొన్నిసార్లు, కొన్ని బంధాలు ఆ అడ్డుగోడలని దాటి ముందుకు వెళ్ళతాయి. అలాంటి ప్రేమనే నిజమైన ప్రేమ అంటారు.
“మంత్ అఫ్ మధు” ఒక మరపురాని ప్రేమ కావ్యం. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి పాత్రలో నటించిన చిత్రం మంత్ అఫ్ మధు. ఈ నెల 6వ తేదీన విడుదల అవ్వబోటింది. నవీన్ చంద్ర ఇంకా స్వాతి ఇదివరకు త్రిపుర అనే ఒక హారర్ సినిమా చేసారు. అది చాలా మంచిగా ఆడింది. ఇప్పుడు మంత్ అఫ్ మధు తో సందడి చెయ్యబోతున్నారు. ఇది ఇద్దరు మధు ల మధ్య జరిగే కథ.
కథ పరంగా ఒక తెలుగు కుటుంబం, అమెరికా నుంచి ఇండియా కి ఒక పని మీద వస్తారు. ఆ కుటుంబంలో మధు అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను ఇండియాలో ఉంటున్న, కూడా అమెరికాలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. అనుకోకుండా మధుసూదన్ అనే వ్యక్తిని కలుస్తుంది. తనకి ఇంతకుమునుపే పెళ్లి అయ్యి విడాకుల గొడవలో ఉంటాడు. ఈ ఇద్దరి మధు ల మధ్య పరిచయం ఎలా ఉండబోతోంది, స్వాతి, నవీన్ చంద్ర మధ్య గొడవ ఏమిటి? ఒక్క నెలలో విడాకులు వస్తాయా? ఆ ఒక్క నెలలో ఈ ముగ్గురు జీవితాలు ఎలా మారతాయి అనేది మిగతా కథ.
‘మధు’ తల్లిగా మంజులా నటించారు. ఆవిడని ఇలా సినిమాలో చూసి చాల సంవత్సరాలు అయ్యింది. వైవా హర్ష ‘నవీన్ చంద్ర’ ఫ్రెండ్ పాత్ర పోషించారు. స్వాతి నవీన్ గారి భార్యగా ఓదిగిపోయారు.
త్రిపుర తరువాత అదే హిట్ పెయిర్ మళ్ళీ రావటం అందరికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ ట్రైలర్ చూసినవాళ్లందరూ, అనేది ఒకటే మాట. బుట్ట బొమ్మల ఉండే స్వాతి చిక్కిపోయి పేలవంగా కనిపిస్తున్నారు అని.
ట్రైలర్ లో చాల జీవిత సత్యాలకి సంబందించిన డైలాగ్స్ ఉన్నాయి. చూడగానే అందరికి ఎక్కేసే మాటలే అవి. మొత్తానికి సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. లేడీ మధు పాత్రలో శ్రేయ చేసిన నటన మెచ్చుకోతగ్గదే. బొద్దుగా, హాట్ గా, అమెరికా అమ్మాయిలనే ఉన్నారు. స్వతహాగా ఆవిడా పెరిగింది కూడా అమెరికా లోనే అవ్వటం కలిసొచ్చింది. మొత్తానికి ఇది ఒక నెలలో ముగ్గురి జీవితంలో జరిగే కథ అని అర్థం అవుతోంది. చూద్దాం నవీన్ చంద్ర, ఇంకా స్వాతి ఏమి మాయలాజలం చేస్తారో. శ్రేయ ఓంపు సొంపులు ఎలా ఉపయోగపడతాయో.