స్నేహితులు అంటే మన లైఫ్ లో వచ్చి పోయే వాళ్ళు కాదు. లైఫ్ లాంగ్ మనతో నడిచి మన కష్టాలని తెలుసుకుని మనకి అండగా ఉండి, మంచి చెడు చెప్పేవాళ్ళు. అలాంటి కథ తోనే వచ్చిన కొత్త చిత్రం MAD. ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగే ప్రేమ కథ. కోపం, బాధ, సంతోషం, త్యాగం, గొడవలు అన్ని ఎమోషన్స్ బాగా చూపించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం, కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చింది.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, హీరో లుగా చేసిన ఈ చిత్రంలో వాళ్ళకి జంటగా, గౌరీ ప్రియా, అనంతిక, గోపికా నటించారు. భీమ్స్ సంగీతం అందించారు. ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే సినిమా మొత్తం, ర్యాగింగ్, టీజింగ్, మందు అలవాట్లు, సిగేరేట్, ఎక్జామ్స్ లో చీటింగ్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్, అవి పాస్ అవ్వటం కోసం పడే తంటాలు. ఇవన్నీ కూడా చాల అద్భుతంగా చూపించారు. భీమ్స్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంది.
కథ:
ఒకే కాలేజీ లో ముగ్గురు అబ్బాయిలు బి.టెక్ చెయ్యటానికి జాయిన్ అయ్యి, ఒక గేమ్ కారణంగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి వాళ్ళ గోల మొదలవుతుంది. దామోదర్(సంగీత్ శోభన్) అనే క్యారెక్టర్ పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. రామ్ నితిన్ ఎప్పుడు అమ్మాయలని, తనతో బాగా క్లోజ్ అయ్యేలా ఉండే క్యారెక్టర్. నార్నె నితిన్ ఒక అనాధ గా కాలేజీ లో జాయిన్ అయ్యి సైలెంట్ క్యారెక్టర్ గా ప్లే చేస్తాడు. నార్నె కి జోడిగా చేసిన అనంతిక ఎప్పుడు నితిన్ ని ప్రేమలో పడేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది. రామ్ నితిన్ కి, గౌరీ ప్రియా కి ప్రేమ చిగురించి వాళ్ళు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. ఒక చిన్న అపార్థం వలన ఇద్దరు విడిపోతారు. కానీ, చివరిదాకా రామ్ నితిన్ తననే ప్రేమిస్తూ ఉంటాడు. దామోదర్ కి ఒక అమ్మాయి ప్రేమలేఖ రాస్తుంది. ఆ రాసింది ఎవరు అనే ప్రయత్నంలో వెన్నెల అనే అమ్మాయి రాసింది అని తెలుస్తుంది. కానీ ఆ వెన్నెల ఎవరు అనేది ఎప్పుడు తెలియని విషయంగానే ఉంటుంది. మొదటి సంవత్సరం చివర్లో కలుస్తా అని కలవకపోవటంతో తాను బాధతో ఎమోషనల్ అవుతాడు. ఇంతకీ వెన్నెల ఎవరు? దామోదర్ తనని కలిశాడా? నార్నె నితిన్ లవ్ సక్సెస్ అయ్యిందా? రామ్ నితిన్ తన ప్రేమని గెలిపించుకున్నాడా? ఇదే మిగతా కథ.
పాజిటివ్స్:
సినిమాలో ఎక్కడ సోది లేకుండా, చాలా క్లియర్ గా తీశారు. ప్రతిసారి దామోదర్ వచ్చినప్పుడు తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాయి. సినిమా మొత్తానికి దామోదర్ పాత్ర అద్భుతం. ప్రేమ సన్నివేశాలు చిత్రికరణ బాగుంది. భీమ్స్ ఇచ్చిన బ్యగ్రౌండ్ మంచి ఫీల్ ఇచ్చింది. పాటలు పర్లేదు అనిపించుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఎక్కడ తప్పులు లేకుండా మంచిగా చేసారు. నిర్మాణ విలువులు రిచ్ గా కనిపిస్తున్నాయి.
నెగటివ్స్:
కథ కొత్త గా ఏమి ఉండదు. కొన్ని చోట్ల ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకునే విధంగా లేవు. నార్నె నితిన్ సినిమా స్టార్టింగ్ లో కొంచం సరిగ్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టకపోయినా, చివర్లో ఆకట్టుకున్నారు. కానీ మొదటినుంచి ఆలా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. దామోదర్ కి ఇచ్చిన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మిగతావాళ్ళలో కొంచం తక్కువ అయ్యింది అని చెప్పొచ్చు.
ఫైనల్ రివ్యూ:
ఒక మంచి యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా. యూత్ మూవీ అయినా కూడా ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. కాకపోతే ఎక్కువగా తాగుడు ఉంది. వీకెండ్ కి మంచి ఎంటర్టైనర్ ఈ చిత్రం. కుటుంబంతో కలిసి కూడా చూడొచ్చు అని అనిపించేలా తీశారు.
రేటింగ్: 3/5
Review By: Mr.Sai