రవి మహాదాస్యం(Ravi Mahadasyam), విషిక లక్ష్మణ్(Vishika Laxman) జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ(Sagiletikatha)’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్, సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ లభించింది. అక్టోబర్ 13న థియేటర్ లో గ్రాండ్ గా రీలిజ్ కానున్న ఈ చిత్రం బుధవారం ‘ప్రెస్ షో’ నిర్వహించారు. చిన్న సినిమా అనే పిలుపు తో స్టార్ట్ అయ్యి, పెద్ద స్థాయి సినిమా రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ‘సగిలేటి కథ’ రివ్యూ చూద్దాం!!
కథ:
‘కువైట్’ నుండి ‘కుమార్'(రవి మహాదాస్యం) తన తల్లి సూరమ్మ(రమణి)తో కలిసి ‘సగిలేరు’ అనే రాయలసీమ గ్రామానికి కొన్ని సంవత్సరాలు తరువాత తిరిగి వస్తాడు. ఈ తరుణంలో, గ్రామంలో ఉన్న కరువు ని పోగట్టడానికి ‘ప్రెసిడెంట్’ ఊరి ప్రజలతో కలిసి ‘గంగాళమ్మ’ జాతర చెయ్యాలని తీర్మానిస్తారు. ఊరిపెద్దల్లో హీరో కుమార్ తండ్రి చౌడప్ప(రాజశేఖర్ అనింగి), ఇంకొకరు డాక్టర్ దొరస్వామీ(రమేష్). డాక్టర్ కి ఏకైక కూతురు హీరోయిన్ ‘విషిక లక్ష్మణ్’ ఒక క్యూట్ గడుసు పిల్ల అలాగే ఫైర్ బ్రాండ్ కి అంబాసిడర్. తొలిచూపులోనే కుమార్ మనసు పడేసుకుంటాడు. ఆ తరువాత గంగాళమ్మ జాతర మొదలవుతుంది, మొదలవటంతోనే ఊరి పెద్దల కుటుంబాల మధ్య ఒక అపశృతి జరుగుతుంది. వేళా పాలా లేకుండా నరసింహ ప్రసాద్ ‘కోడి కూర’ తినే మీదనే ధ్యాస ఉంటుంది. కోడి కూర తినడానికి అన్ని ప్రయత్నాలు చేసిన కూడా చివరికి కోడి కూర తిన్నాడా లేదా? ఊరి సమస్య తీరిందా? అసలు ఆ అపశృతి ఏంటి? ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య గొడవ ఏదైనా జరిగిందా అనేది తేలాలిసి ఉంది? అనేది మిగతా కథ?
విశ్లేషణ:
కథ పరంగా 2007 లో ‘సగిలేరు’ గ్రామంలో జరిగే ఒక యదార్ధ కథ. కాకపోతే, అందరి కథలు జాతరతోనే తమ జీవితాలు ముడిపడి ఉంటాయి. ఊరిలో జరిగే పంచాయతీ ముచ్చట్లు, వాదనలు, అప్పుల బెడద, చిన్న చిన్న కోరికలు, గొడవలు అన్నీ బాగా చూపించే ప్రయత్నం చేసారు దర్శకుడు. పుట్టి పెరిగిన ఊరు. అందులోని ప్రజలు, ప్రతి ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు. వాళ్ళ మధ్య అనుబంధాలు, అపార్థాలు, తగాదాలు, ఇవన్నీ మామూలే. కానీ ఒక ఊరి సమస్య రెండు కుటుంబాల సమస్యగా మారి, మళ్ళీ ఊరి సమస్యగా మారితే? ఆ ఊరిలో ప్రజలు ఎలా వ్యవహరించారు అనే కథతో వచ్చిన చిత్రమే “సగిలేటి కథ”.
నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎక్కువగా జానపద తరహాలో పాటలు సాగాయి. పద్యాలు కూడా ఉపయోగించారు కొన్ని చోట్ల. మొత్తానికి ఒక పల్లెటూరి వాతావరణం సృష్టించి సగటు ప్రేక్షకుడిని మెప్పించారు .
ప్లస్ పాయింట్స్:
రవి మహాదాస్యం మరియు విషిక లక్ష్మణ్ చాలా ముచ్చటైన జంట. ఈ చిత్రానికి మూలస్తంభం సంగీతం. జస్వంత్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. కథ కన్నా ముందు అయన పనితీరుని మెచ్చుకోవాలి. హీరో గా రవి మహాదాస్యం అద్భుతంగా నటించారు. విషిక లక్ష్మణ్ ఒక ఫైర్ బ్రాండ్ లాంటి అమ్మాయిగా అందచందాలతో అలరించారు. నరసింహ ప్రసాద్, పాత్రకి నూరు శాతం న్యాయం చేసారు. కోడి కూర మీద ఉన్న వ్యామోహం ఆయన చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఈ సినిమాలో ఎడిటింగ్ విభాగం చాలా షార్ప్ గా డెలివరీ చేసారు. ముఖ్యంగా, సినిమాటోగ్రఫీ హైలైట్ అని చెప్పచ్చు. ఇంటర్వెల్ & క్లైమాక్స్ ఎవ్వరు ఊహించని విధంగా బాగా తీశారు.
మైనస్:
ఎక్కువశాతం కథ కన్నా, ఊరిని చూపించటం మీదనే ఎక్కువగా ద్రుష్టి పెట్టారు దర్శకుడు. ఆలా చెయ్యకుండా ఉంటే బాగుండేది. హీరో కన్నా హీరోయిన్ కి ఎక్కువగా నటించే అవకాశం వచ్చింది. నరసింహ ప్రసాద్ సన్నివేశాలు కొంచం సాగదీత గా అనిపించాయి. ట్విస్ట్ లు చూపించాలి అనే ఉద్దేశంతో కాస్త కథ మీద దృష్టి మళ్లింది అనిపించింది. లేదంటే, బ్లాక్ బాస్టర్ సినిమా.
రివ్యూ:
సగిలేటి కథ. మన ఊరి కథ. మన అందరి కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు సొంత ఊరిలో ఇలాంటి క్యారెక్టర్స్ ని చూసాం కదా నా లైఫ్ లో అనిపిస్తుంటుంది. ఈ చిత్రం చుస్తే అవన్నీ కచ్చితంగా గుర్తొస్తాయి. ఈ వీకెండ్ కి మంచి ఫామిలీ సినిమా.
Tag Line: “Sagileti Katha Review: A Cinematic Gem That Warms Hearts and Evokes Laughter”
Rating: 3.25/5
Review By: Mr. Sai
గమనిక: మేము ఇచ్చిన రివ్యూ ఒక వ్యక్తి కి గాని, సిస్టమ్ కి గాని ఉద్దేశించి రాసింది కాదు. మా ఫిల్మ్ కంబాట్ టీం అందరు ప్రతి సినిమా బాగుండాలి, ఆ సినిమా ద్వారా మరెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తులం. సో, కేవలం ఈ రివ్యూ మా అభిప్రాయం మాత్రమే.