హాయ్ నాన్న సినిమా కథ ఇదేనా? ఆ కిస్ కన్విన్స్ గా ఉంటుందా?
దసరా తరువాత నాని నటిస్తున్న చిత్రం, “హాయ్ నాన్న”. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శృతీ హాసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తుండగా, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సి వి మోహన్ , Dr . విజేందర్ రెడ్డి తీగల, కే స్ మూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్, ఈ రోజు విడుదల అయ్యింది.
టీజర్ అనుగుణంగా అనుకుంటున్న కథ:
నాని మరియు తన కూతురు మావయ్య తో కలిసి ఉంటున్నారు. తన భార్య చనిపోవటం/విడిపోవటం వలన ఒంటరిగా కూతురిని చూసుకుంటూ ఉంటారు. కూతురుని పల్లెత్తి మాట కూడా అనని తాను, ఒక సందర్భంలో తన గదిలోకి కూతురు వచ్చింది అని కోపగించుకుంటారు. ఇదిలా ఉండగా, మృణాల్ ఠాకూర్ వాళ్ళకి పరిచయం అవుతుంది. పాప వలన నాని కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మృణాల్ ని తమతో ఉండేలా ఒప్పుకుంటారు. ఒకానొక సమయంలో మృణాల్ కి ఇంతకుముందే పెళ్లి నిశ్చయం అయ్యింది అని తెలుస్తుంది.
అది చెప్పకుండా, తనతో ప్రేమ వ్యవహారం నడిపింది అని కోపగించుకుంటారు. పెళ్లి నిశ్చయం అయినా కూడా మృణాల్ నాని ని ప్రేమించటానికి కారణం తన కూతురు మీద ఉన్న ప్రేమనా? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయో సినిమా చుస్తేకాని తెలియదు?. టీజర్ చివరిలో నాని కూడా మృణాల్ మీద ఉన్న ప్రేమని వ్యక్త పరుస్తారు. ఇంతకీ ఈ జంట కలిసిందా? పెళ్లి చేసుకోవలసిన మృణాల్, ఇంతకుముందే పెళ్లి అయ్యి , కూతురు ఉన్న నాని ని ప్రేమించటానికి కారణం ఏంటి? వీళ్ళ ప్రేమ ఎలాంటి సిచ్యువేషన్ కి దారి తీసింది అనేది ముఖ్యాంశాలు.
టీజర్ పరంగా చాల అద్భుతంగా ఉంది. ఒక పొససివ్ తండ్రిలా నాని కనిపించారు. కూతురుకి తాను తప్ప ఇంకేం లోకం ఉండకూడదు అనుకుంటాడు. మృణాల్ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. ఆవిడా యధావిధిగా అందంగా, అనుకువగా కనిపించారు.
ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏంటీ అంటే, నాని కి మృణాల్ కి మధ్య ముద్దు సన్నివేశాలు టీజర్ 3 లో చూపించారు. ఫామిలీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సంగీతం చాలా చక్కగా వినసొంపుగా ఉంది. దర్శకుడి కథ అందరినీ మెప్పించేలానే ఉంది అనిపిస్తోంది. సినిమాట్రోగ్రఫీ బాగుంది. టీజర్ కట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది.