ఒక భాషలో నిర్మాణ సంస్థ ప్రారంభించాక ఎక్కువగా ద్రుష్టి ఆ భాషా చిత్రాలమీదనే ఉంటుంది. కానీ, ఒక మంచి కథని గెలిపించాలి, ఆ దర్శకుడి తొలి అడుగును ముందుకి తీసుకువెళ్లాలి, కళ కి భాషతో పనిలేదు అని నమ్మి ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ తన మొదటి అడుగు తమిళ రంగం వైపు వేసి, ఆ కొత్త దర్శకుడిని గెలిపించారు. అదే తెలుగు, తమిళంలో నవంబర్ 11 వ తారీఖున విడుదల అవ్వబోతున్న చిత్రం “కిడా” , మన తెలుగులో “దీపావళి”.
విషయానికి వస్తే, రవి కిషోర్, స్రవంతి మూవీస్ సంస్థ ని 38 సంవత్సరాల క్రితం విలక్షణ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ “లేడీస్ టైలర్” అనే చిత్రంతో మొదలు పెట్టారు. ఇప్పటిదాకా 38 చిత్రాలను నిర్మించారు. ఎప్పుడు కూడా తమిళ రంగం వైపు వెళ్ళలేదు. ఈ దీపావళి చిత్రం తన సంస్థ నుంచి వస్తున్నా 38 వ చిత్రం అవ్వటం విశేషం. ఒకసారి చెన్నై ఒక పనిమీద వెళ్లిన అయన, తన స్నేహితుడి ద్వారా, ఈ కథని విన్నారు. ఒకసారి దర్శకుడిని తన స్టోరీ మొత్తాన్ని వివరంగా పంపమన్నారు. అది చూసాక ఆయనకి విపరీతంగా నచ్చి, కొత్త దర్శకుడు అయినా ఆర్ ఎ వెంకట్ కి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో దాదాపుగా అందరూ కొత్తవాళ్లే పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటులు నటించారు. రాము, కాళీ వెంకట్ నటించారు.
ఈ చిత్రం ఆరు నెలల క్రితమే అంతర్జాతీయ సినిమా ఫెస్టివల్ కి పంపించారు. అక్కడ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఆ తరువాత, ఈ చిత్రానికి వచ్చిన అవార్డులు చాలానే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. 20 వ చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం గా అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడి అవార్డు కూడా ఈ చిత్రానికే దక్కింది. ఇండియన్ పనోరమా , ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్ బోర్న్ కి కూడా సెలెక్ట్ అయ్యింది ఈ చిత్రం.
జాగ్రాన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ఈ చిత్రానికి కితాబు ఇవ్వని వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లోకి అనువదించబడుతోంది. ఇప్పటిదాకా తమిళంలో కూడా థియేటర్ లో చూడలేదు ఈ చిత్రాన్ని. రెండు భాషలు వచ్చే నవంబర్ 11 వ తేదీన ‘స్రవంతి’ రవి కిషోర్ విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ, కొత్తగా వస్తున్నా కూడా, కథ ని నమ్మి, తనకి మొత్తం స్వేచ్చని ఇచ్చి , సినిమాకి ఇంత పేరు తీసుకొచ్చిన రవి కిషోర్ కి ధన్యవాదాలు. ఈ చిత్రంలో దీపన్, పాండియమ్మ , విజయ, కమ్లి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రంలో పనిచేసేవాళ్ళు చాలామటుకు కొత్తవాళ్లే.
ఆడియోగ్రాఫేర్: తపస్ నాయక్
ఆర్ట్ డైరెక్టర్: కె.బి.నందు
సాహిత్యం: రాంబాబు గోశాల
కూర్పు: ఆనంద్ గేర్లడిన్
సంగీతం: తీసోన్
ఛాయాగ్రాహకుడు: ఎం.జయప్రకాశ్
సమర్పణ: కృష్ణ చైతన్య
నిర్మాత: ‘స్రవంతి’ రవి కిషోర్
దర్శకుడు: కె ఎ వెంకట్
ఇది ఒక తాతయ్య, మనవడు, ఒక చిన్న పిల్లోడు మధ్య జరిగే పల్లెటూరి కథ. కథ ప్రకారం, నెల్లూరు లో, ఆంధ్ర మరియు తమిళనాడు సరిహద్దు ఊరిలో జరుగుతుంది. వాళ్ళ ముగ్గురిమధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు అందరిని కట్టిపడేశాయి అని వినికిడి. రవి కిషోర్, వేరే భాష అయినా కూడా, కథని నమ్మి చేస్తున్న ప్రయత్నం. ఫిలిం ఫెస్టివల్ మాదిరిగానే , ప్రజల ప్రశంసలు కూడా ఈ ‘దీపావళి’/’కిడా’ చిత్రం పొందాలని కోరుకుందాం.