చిత్రం: భగవంత్ కేసరి
రేటింగ్: 3.25/5
తారాగణం: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్, రఘు బాబు తదితరులు….
కెమెరామ్యాన్: రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
సంగీతం: థమన్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
డైరెక్టర్: అనిల్ రావిపూడి
విడుదల: అక్టోబర్ 19, 2023
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్ గా ‘శ్రీలీల’ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే, విడుదలైన ట్రైలర్ బాలయ్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లభించింది. ఈ గురువారం రీలిజ్ అయ్యిన ‘భగవంత్ కేసరి’ చిత్రంతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లభించిందా? లేదో తెలుసుకుందాం?
కథ: శ్రీకాంత్(శరత్ కుమార్) ఒక జైలు కి ‘యస్ ఐ’ గా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. అతనికి ‘విజయ కృష్ణ'(శ్రీలీల) అనే కుమార్తె ఉంది. అనుకోకుండా, ఒక రోజు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ‘విజయ కృష్ణ'(శ్రీలీల)ని భగవంత్ కేసరి(బాలకృష్ణ) కన్నా కూతురిలా పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రి మరణించిన వార్త విన్న షాక్ లో చిన్ననాటి నుంచి ‘శ్రీలీల’ ఫోబియా కి గురవ్వుతుంది. ఆ ఫోబియా ని నుంచి బయటపడటానికి సైకాలిజిస్ట్ అయ్యిన కాంచాయని(కాజల్ అగర్వల్) హెల్ప్ తీసుకుంటాడు భగవంత్ కేసరి. శ్రీకాంత్ కన్న కళని భగవంత్ కేసరి తీర్చాడా? అసలు భగవంత్ కేసరి ఎవ్వరు? ఎందుకు, శ్రీలీల ని పెంచి పెద్ద చేసాడు? భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేది తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా థియేటర్ లో సినిమా చుడాలిసిందే?
అందరికి తెలిసిన విషయమే ‘అనిల్ రావిపూడి’ అన్ని వర్గాల ప్రేక్షకులని తన గత సినిమాలతో అలరించారు. మరి, ఈ సినిమాతో అన్ని రకాల ప్రేక్షకులని అలరించాడా లేదో తెలుసుకుందాం?
సినిమా ఓపినింగ్ లో బాలకృష్ణ తో సాగే జైల్’ ఫైట్ ఆకట్టుకోవడంతో పాటు, తన తల్లి మరణించిన సంఘటన ప్రతి ప్రేక్షకుడిని బాధ కలిగిస్తుంది. అయ్యితే, సినిమాలో వినాయకుడి సాంగ్ తప్ప పెద్దగా సాంగ్స్ లేకపోవటం కాస్త మైనస్ అనే చెప్పాలి. అప్పటికే లెంత్ పెరగడంతో ఒక సాంగ్ కట్ చేసారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాగే, శ్రీలీల కి డ్యాన్స్ చేయటానికి పెద్దగా స్కోప్ లేకపోవటం, హీరోయిన్ కాజల్ & బాలయ్య తో సాగే సీన్స్ బలంగా రాసుకోకపోవటం ఇవ్వన్నీ సగటు ప్రేక్షకుడిని నిరాశ పరిచే అంశాలు. అక్కడక్కడా సినిమా లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకోవడం కోసం మెరుపు. ముఖ్యంగా, దగడ్ పోలీస్ ఆఫీసర్ తో జరిగే సిక్వెన్స్ & ఇంటర్వెల్ హైలైట్ అని చెప్పాలి.
పోస్ట్ ఇంటర్వెల్ బాలయ్య పోలీస్ ఆఫీసర్ అవతారంలో వచ్చి అటు కామిడి & డైలాగ్స్ తో ఆకట్టుకుంటారు. ఎప్పటి లాగే, బాలయ్య ఈ సినిమాలో కూడా తన చరిష్మా తో యాక్టింగ్ చితకొట్టేశారు. అలాగే, శ్రీలీల కి (విజయ కృష్ణ) లాంటి క్యారెక్టర్ రావడం ఒక అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే, తన క్యారెక్టర్ కి చాలా డెప్త్ ఉంటుంది. తన యాక్టింగ్ స్కిల్స్ తో సగటు ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేసి సూపర్బ్ అనిపించుకుంది. సినిమాలో విలనిజం పాత్ర పోషించిన ‘అర్జున్ రాంపాల్’ పాత్ర బాగున్నప్పటికీ క్యారెక్టర్ వీక్ అవ్వడంతో తేలిపోతాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్ని క్లోజ్ ఫ్రెమ్స్ లో ఏజ్డ్ గా ఆనిపిస్తున్నప్పటికీ, యాక్టింగ్ తో రాణించింది. సెకండ్ ఆఫ్ లో బాలకృష్ణ స్కూల్ లో పిల్లలని ఎడ్యుకేట్ చేసే సీక్వెన్స్ ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది. ఎప్పటి లాగే, బాలకృష్ణ మూవీ లో క్లైమాక్స్ చాలా రసవత్తంగా ఉండటంతో పాటు, సినిమాకే గూస్ బంప్స్ తెప్పించే సీక్వెన్స్ అని చెప్పచ్చు.
దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ ఎప్పటి లాగే తన సక్సెస్ ఫార్ములా ముద్ర కనబర్చడానికి ట్రై చేసాడు కానీ, అన్ని వర్గాల వారిని ఎంటర్టైన్ చేయడంలో కాస్త మిస్ అయ్యాడని చెప్పచ్చు. కాకపోతే, ఓవర్ ఆల్ గా సినిమా ని ‘ప్యాక్డ్’ గా తీర్చిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఏ మాత్రం తీసిపోకుండా బాగానే ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ పని తీరు బాగుంది. థమన్ అందించిన బిజియమ్ బాగానే ఉన్నప్పటికీ, ఇంకాస్త ‘హై’ ఇచ్చి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది.
బాటమ్ లైన్: ధైర్యాన్ని నింపే “భగవంత్ కేసరి”.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: ఈ చిత్రం రివ్యూ ఏ వ్యక్తికి గాని, సిస్టమ్ కి గాని వ్యతిరేకంగా రాసింది కాదు అని మనవి. ఎందుకంటే, మేము రాసే ప్రతి అక్షరం మా గుండెల్లో నుంచి వచ్చిన రాతలే కానీ, ఏ ఒక్కరిని ఉద్దేశ పూర్వకంగా రాసింది కాదు అని మా ఫిల్మ్ కాంబాట్ తరుపున సినిమా లో పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాము..!! మరెన్నో, సూపర్ హిట్ చిత్రాలని అందించాలని కోరుకునే వ్యక్తుల్లో మా టీమ్ ఎప్పుడు ఉంటుంది!! ఈ రివ్యూ కేవలం మా అభిప్రాయం మాత్రమే!!