పల్లెటూరి క్రైమ్ కథగా 2021 లో OTT లో వచ్చిన హార్రర్ చిత్రం “మా ఊరి పొలిమేర”. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి ప్రశంసల్ని అందుకుంది. ముఖ్యంగా ప్రధాన తారాగణం సత్యం రాజేష్, బాలాదిత్య, శ్రీను, కామాక్షి భాస్కర్ల, సాహితి, రవి వర్మ నటనకి అందరూ ప్రశంశల వర్షం కురిపించారు. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపు విడుదల అవ్వబోతోంది. అదే “మా ఊరి పొలిమేర 2 “. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటి కామాక్షి భాస్కర్ల పాత్రికేయులతో ముచ్చటించారు.
మొదటి భాగం కన్నా, నిర్మాణ విలువలు ఈ భాగానికి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మొదటి భాగం చూడని వాళ్ళని ఒక్కసారి అది చుస్తే, తేడా తెలుస్తుంది అని చెప్పారు. మొదటి భాగం కన్నా ఈ భాగం నిడివి ఎక్కువ. కానీ అదే తరహాలో ఎలాంటి థ్రిల్లింగ్ మిస్ అవ్వకుండా తెరకెక్కించాము అని చెప్పారు. కథ కి తగ్గట్టుగా కొన్ని కొత్త పాత్రలు జత చెయ్యబడ్డాయి అన్నారు.
మొదటి భాగంలో చివరి 20 నిముషాలు అందరికి నచ్చింది, కానీ ఈసారి ప్రతీ సన్నివేశం అంతకుమించి నచ్చుతుంది అని అన్నారు. మొదటి భాగానికి తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చెయ్యటం వలన, మొదటి భాగం కూడా థియేటర్ కి వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అని తన భావం వ్యక్త పరిచారు. మొదటి భాగం చూడకోతే ఈ భాగం అర్థం కాదు అని ఏమి లేదు, చూడకుండా వచ్చే వాళ్ళకి కూడా కథ అర్థం అయ్యేలా చిత్రీకరించాము అని చెప్పారు.
తన పాత్రకి మొదటి భాగం కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఈ భాగంలో ఉంది అని చెప్పారు. తాను ఇండస్ట్రీ కి వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది అని, ఇంతక ముందు కూడా కొన్ని మంచి చిత్రాలు, పాత్రలు చేశాను, కానీ గుర్తింపు రావటానికి ఇంత సమయం పట్టింది అన్నారు. పొలిమేర చిత్రం ఆ గుర్తింపు ఇచ్చింది అన్నారు. ఈ సంవత్సరం ఎక్కువగా కనిపించాను, సినిమా ఒక్కటే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చాను అని తన ఆనందాన్ని పంచుకున్నారు.
డాక్టర్ గానే కాకుండా మామూలు మనిషిగా కూడా ఇలాంటి క్షుద్ర పూజలని నమ్మను అన్నారు. కథ పరంగా మాత్రమే నటించాను అని చెప్పారు. దర్శకత్వం మీద మక్కువతో ఏమీ చిత్రాలలోకి రాలేదని, కానీ చేసే ఉద్దేశం ఉందని చెప్పుకొచ్చారు. తనకి డాక్టర్ వృత్తి పట్ల, అలానే కళల పట్ల సమాన ఇష్టం ఉండటం వలన, నటనలోకి వచ్చాను అన్నారు. చిన్నపటినుంచి నృత్యం, సంగీతం నేర్చుకున్నాను అన్నారు. చిన్నప్పటినుంచీ కొన్ని నాటకాలలో నటించాను, ఆ ఇష్టంతోనే నటనలోకి వచ్చాను అన్నారు. చలం గారి రచనల ప్రభావం తన మీద ఉంది అన్నారు.
ఈ చిత్రంలో కొన్ని మాటలు, సన్నివేశాలు రాసాను అని చెప్పారు. ఏ పాత్ర చేసిన, ఎలాంటి కళ అయినా కూడా చాలా నమ్మకంతో , కచ్చితంగా నేర్చుకుని తనని తాను నిరూపించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాను అన్నారు. నటిగా మాత్రమే కాకుండా, ఇంకా సినిమా కి తగ్గట్టుగా ఇంకా ఏమేమి చేయగలనో అన్నీ నేర్చుకుని చేసే మనస్తత్వం తనది అని చెప్పారు. OTT భాగంలో ఉన్నన్ని పరుష వాక్యాలు ఈ భాగంలో ఉండకుండా చూసుకున్నాము అని చెప్పారు.
కుటుంబం మొత్తం చూసే విధంగా చిత్రికరించాం అని చెప్పారు. చిన్నప్పటినుంచీ పుస్తకాలూ చదవటం వలన, రచన పట్ల ఇష్టత పెరిగింది అని, విశ్వనాధ్ గారు తనకి చిత్రసీమలో ఇష్టమైన వ్యక్తి అని చెప్పారు. తన తల్లిగారు తనకి మంచి సపోర్ట్ అని చెప్పారు.
మొదటి భాగాన్ని చుడనివాళ్ళని, కుదిరితే ఒకసారి అది చూడమని చెప్పారు, రెండొవ భాగాన్ని కూడా, మొదటి దాని వలె ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను అన్నారు. రెండొవ భాగం నవంబర్ 3 వ తేదీన విడుదల అవుతుంది అని , తప్పకుండా అందరు థియేటర్ కి వచ్చి చూసి ఆదరించాలని ఆశిస్తున్నాను అన్నారు.