యంగ్ & డైనమిక్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా “నరకాసుర”. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న తెలుగు, తమిళ్ లో రీలిజ్ చేస్తుండగా హిందీ, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు గురించి హీరో రక్షిత్ అట్లూరి విలేకరులతో ముచ్చటించారు.
“నరకాసుర” మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం లో సాగే కథ. ఈ సినిమాలో హీరో లారీ డ్రైవర్ ‘శివ’ అనే క్యారెక్టర్ లో నటించాడు. ‘నాజర్’ కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తుండగా, ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ గా హీరో రక్షిత్ కనిపించనున్నాడు. గత మూవీ లో హీరో పలాసలో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే “నరకాసుర” సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ చూపించబోతున్నారట. కథలో ఇదొక అంశం మాత్రమే, అయ్యిన సినిమా మేకింగ్ ఒక కమర్షియల్ యాంగిల్లో ఉంటుందని చెప్పారు.
పలాస సినిమా తరువాత, “నరకాసుర” మూవీ స్టార్ట్ అవ్వడం, అనుకోకుండా పెద్ద స్కేల్ సినిమా అయ్యిందట. పైగా, మధ్యలో కోవిడ్ రావటం, ఇంకోసారి ఆర్టిస్టుల కాంబినేషన్స్ కు డేట్స్ కుదరకపోవడం. ఇలా, అనుకున్న టైమ్ కన్నా రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుందట. హీరో రక్షిత్ కి, ఈ క్యారెక్టర్ కోసం పెంచిన హెయిర్ వల్ల మరో ప్రాజెక్ట్ చేయలేకపోయాడట. అయితే “నరకాసుర” కంప్లీట్ చేసే దశలో ఆపరేషన్ రావణ్, శశివదనే అనే రెండు సినిమాల్లో నటించి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఇకపోతే, ఈ మూవీలో నరకాసుడికి సంబంధించిన అంశాలేవీ ఉండవని. టీజర్ లో చూపించినట్లు రాక్షసుల్ని చంపాలంటే మనం అంతకంటే చెడ్డగా ఉండాలి అనే పోలికను తీసుకుని టైటిల్ పెట్టారట డైరెక్టర్. “నరకాసుర”లో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటదట. అక్కడ చలి ఎక్కువ పైగా రాత్రి పూట వర్షంలో ఆ ఫైట్ సీన్ చేయాల్సివచ్చిన ఔట్ పుట్ చూశాక హ్యాపీగా ఫీలయ్యాడట హీరో రక్షిత్.
సినిమాలో ఒక హీరోయిన్ మరదలుగా, మరో హీరోయిన్ కాఫీ ఎస్టేట్ మేనేజర్ క్యారెక్టర్ చేసారు. ఇద్దరు హీరోయిన్స్ కేరళ నుంచే వచ్చారు. సినిమాలో వీళ్ళిద్దరితో సాగే సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో అనుభవమున్న నటీనటులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. చరణ్ రాజ్ ఊరి పెద్ద క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయనది కీ రోల్. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. నాకు ఆయనకు మధ్య కాన్ ఫ్లిక్ట్ ఉంటుంది. ఫీచర్ లో మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది.
పలాసలో నక్కిలీసు గొలుసు పాట హిట్ అయ్యిందని నరకాసురలో అలాంటివి పెట్టలేదు. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ కథలో భాగంగా వస్తుంటాయి. నరకాసుర సినిమా చేస్తున్నప్పుడు, పొలిమేర 1 కూడా చేయాల్సింది. కాకపోతే, గెటప్ ఉండటం వల్ల చేయలేకపోయాను. అయితే ఆ ప్రాజెక్ట్స్ చేయలేకపోయినందుకు బాధ లేదు. మా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం.