చిత్రం: మంగళవారం
రేటింగ్: 4.25/5
బాటమ్ లైన్: ప్యూర్ రా & రస్టిక్ ఫిల్మ్ – టాప్ నాచ్ పెర్ఫామెన్స్ పాయల్ రాజపుత్.
తారాగణం: పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్, దివ్య పిళ్లై, శ్రవణ్ రెడ్డి, దయానంద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
మ్యూజిక్: ‘కాంతార’ ఫేమ్ బి.అజనీష్ లోక్‌నాథ్ ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: అజయ్ భూపతి
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో హీరోయిన్ గా ప్రధాన పాత్ర లో ‘పాయల్ రాజ్‌పుత్’ నటించింది. ఈ చిత్రానికి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ‘స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ’ కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే, రీలిజ్ అయ్యిన సాంగ్స్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ ముఖ్య అతిథిగా రావటంతో సినిమా స్థాయి, ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగింది. ఈ చిత్రం నవంబర్ 17న రీలిజ్ కాబోతున్న సంద్రభంగా, చిత్ర యూనిట్ ప్రెస్ కి ‘ప్రిమియర్ షో’ నిర్వహించారు.
కథ: సూరమ్మ మనవరాలు ‘శైలు'(పాయల్ రాజపుత్) & రవి(?????) చిన్న వయసులో ఇద్దరు మంచి స్నేహితులు. అనుకోకుండా ఒకరోజు రవి మరియు తన తండ్రి(దయానంద్) ఇద్దరు మంటల్లో చనిపోతారు. పది సంవత్సరాలు తరువాత, శైలు(పాయల్ రాజపుత్) తన కాలేజ్ లో ఇంగ్లీష్ టీచర్ ‘మధన్'(అజ్మల్ అమీర్) ప్రేమలో పడుతుంది. కొన్ని రోజులు ఊరంత చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఇంటిమేట్ అవ్వుతారు. సడన్ గా ఒకరోజు టీచర్ మధన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ‘సిటీ’ కి వెళ్ళిపోతాడు. తన కంటే ప్రాణంగా ప్రేమించిన టీచర్ మధన్ మోసం చేసి వెళ్ళిపోతే ఆ బాధని ఎలా తట్టుకుంది? బాధలో ఉన్నప్పుడు తనకి ఎవ్వరు సహాయం చేసారు? శైలు ఎందుకు ‘వ్యభిచారి’ లా మారింది? ఊరిలో జరుగుతున్న ‘హత్యలకి, అక్రమ సంబంధాలకి’, శైలు పాత్ర ఏమైనా ఉందా? అనేది తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా సినిమా చుడాలిసిందే?
కధనం, విశ్లేషణ: ప్రతి ఒక్కరు ‘మంగళవారం’ సినిమా ట్రైలర్ చూసాక కాంతారా తో పోల్చారు. కానీ, సినిమా చూసాక అసలు కాంతారా కి, మంగళవారం సినిమాకి పొంతనే ఉండదు. రెండు సినిమాల కథలు, మలుపులు వేరు.
ఫస్ట్ హాఫ్ లో శైలు & రవి కి చిన్న వయసులో ఉన్న బాండింగ్ తెర పై చూపించిన విధానం బాగుంటుంది. శైలు ‘ఆస్తి’ కోసం వెంటాడే తండ్రి. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు తరువాత గోడలు మీద అక్రమ సంబంధాలు ఉన్నట్టు రాయటం, వాళ్ళు చనిపోవటం అలా జరిగిన ప్రతి సారి పబ్లిక్ గుమి గుడతారు. ఇలాంటి, రాతలు తెలుగు తెరపై కొత్త రకంగా అనిపిస్తాయి. అలా, చనిపోవటం తో యస్.ఐ.(నందిత శ్వేతా) ఇది హత్య, హంతుకులని పట్టుకొని తీరతాను అంటూ ప్రయత్నాలు చేస్తుంటుంది. సినిమాలో జాతర సాంగ్, డాగ్, జమిందారీ సిక్వెన్స్, ముఖ్యంగా భోజనాలు దగ్గర కొట్లాట మస్త్ హై ఉంటుంది. అసలు, ఫస్ట్ హాఫ్ లో ఒక హీరో & హీరోయిన్ లేకుండా సినిమా ని ఎంగేజ్ చేసిన విధానం ఇంటర్వెల్ బ్యాంగ్, డైరెక్టర్ సూపర్బ్ మైండ్ గేమ్ అని చెప్పచ్చు.
సెకండ్ హాఫ్ లో శైలు ఫ్లాష్ బ్యాక్ ‘రొమాంటిక్ రా & రస్టిక్’ గా చూపించే సీన్స్ డ్రగ్ లాగా సగటు ప్రేక్షకుడికి హై నిస్తుంది. హత్యలు చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించే ‘అన్వేషణ’ బాగుంటుంది. క్లైమాక్స్ 20 మినిట్స్ సినిమా స్థాయిని ఒక రేంజ్ లో నిలబెడుతుంది. ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు. కాకపోతే, క్లైమాక్స్ లో సడన్ ఎంట్రీ ఇచ్చే హీరో పెర్ఫామెన్స్ చేసినప్పటికీ, ఇంకా బాగా పెర్ఫామ్ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపించింది. సగటు ప్రేక్షకుడు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం!! ఏదైమైనప్పటికీ, అజయ్ భూపతి ఖాతాలో బ్లాక్ బస్టర్ పడినట్టే అనిపిస్తుంది. పక్కా, ఫ్యామిలి ఆడియన్స్ తో సినిమా చుడండి. బట్, ట్విస్ట్ లు దయచేసి రివీల్ చెయ్యద్దు. ఇది మా విన్నపం.
నటి నటులు పెర్ఫామెన్స్: తెలుగు నాట కని విని ఎరుగని రీతిలో పాయల్ రాజపుత్ చేసిన పెర్ఫామెన్స్, ఆవిడ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. బహుశా, ఇలాంటి క్యారెక్టర్ ఎవ్వరిని ఉహించుకోలేమో అండ్ ఎవ్వరు డేర్ చేయలేకపోవచ్చు. ‘అజయ్ ఘోష్’ ఉన్నంత సేపు నవ్వులే నవ్వులు. ‘అజ్మల్ అమీర్, దివ్య పిళ్లై, శ్రవణ్ రెడ్డి, దయానంద్’, కథకి ఎంతో కీలకం. చైతన్య కృష్ణ సెట్టిల్డ్ పెర్ఫామెన్స్ తో నటన సూపర్బ్. రవీంద్ర విజయ్ డాక్టర్ గా ‘కి’ రోల్ పోషించి ‘పార్ట్2’ కి కీలకంగా మారతారు. ఇకపోతే, బ్లైండ్ క్యారెక్టర్ లో నటించిన ‘లక్ష్మణ్’ కి థియేటర్ లో విజిల్ వెయ్యాలిసిందే!! మరి, ముఖ్యంగా, క్లైమాక్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
సాంకేతిక విభాగం: దర్శకుడు ‘అజయ్ భూపతి’ ఏ నక్షిత్రాన/రోజు పుట్టాడో తెలియదు కానీ, సాక్షాత్తు ఆ ‘ఆంజనేయ స్వామి’కి ఉన్నంత బలం అజయ్ భూపతి లో పూనుకొని ఈ మంగళవారం చిత్రంతో విజృంబించినట్టుంది. మేకింగ్, విజన్, ఆర్టిస్టులని ఎంచుకున్న విధానం, ట్విస్ట్ లు సూపర్బ్. ‘కాంతార’ ఫేమ్ బి.అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ తెర మీద వణుకు పుట్టిస్తుంది. ఎడిటర్ ‘మాధవ్ కుమార్ గుళ్ళపల్లి’ పని తీరు బాగుంది. కాకపోతే, ఇంకో 5మినిట్స్ పదును పెట్టి ఉంటే బాగుండు అనిపించింది. ‘దాశరథి శివేంద్ర’ సినిమాటోగ్రఫీ నెస్ట్ లేవెల్. ముఖ్యంగా, కొన్ని షాట్స్, సీన్స్ అదరకొట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా తీశారు నిర్మాతలు.