‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ:
చిత్రం: ‘మై నేమ్ ఈజ్ శృతి’
రేటింగ్: 3.25/5
తారాగణం: హన్సిక మోత్వాని, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, ప్రేమ, పూజా రామచంద్రన్ తదితరులు….
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: చోటా.కె.ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: కిశోర్ బోయిడపు
కో ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్
దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. దేశముదురు, పవర్, దేనికైనా రెడీ, బిల్లా, సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు. మొట్టమొదటి సారి లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా, చిత్ర యూనిట్ ఈ గురువారం ప్రెస్ షో నిర్వహించారు.
కథ: శృతి(హన్సిక)కి ఉద్యోగం రావటంతో తన గ్రామం వదిలి సిటీ కి వచ్చి తన బావ బాబీ(ప్రవీణ్) ఇంట్లో ఉంటుంది. అక్కడ చరణ్(సాయి తేజ్) తో శృతి(హన్సిక) లవ్ లో ఉంటుంది. అయ్యితే, తన బావ ఇంటి నుంచి, హాస్టల్ కి, ఆ తరువాత తన ఫ్రెండ్ తో ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వుతుంది. ఒకరోజు ఇంటి నుంచి కబురు రావటంతో శృతి పేరెంట్స్ ని కలవటానికి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంది. శృతి ఫ్లాట్ లో అను(పూజా రామచంద్రన్) అనే ఒక డ్రగ్ డీలర్ చనిపోయ్యి ఉంటుంది. అసలు కథ ఇక్కడ మొదలవ్వుతుంది? అసలు అను(పూజా రామచంద్రన్) ఎవ్వరు? యమ్.యల్.ఏ గురుమూర్తి(ఆడుకాళ్ళమ్ నరేన్) కి అను కి సంబంధం ఏంటి? అసలు డాక్టర్ కిరణ్మయి(ప్రేమ) ఎవ్వరు? ఆమె పాత్ర ఏంటి? శృతి కి అను కి సంబంధం ఏమైనా ఉందా అనేది తెలియాలి అంటే మీరు సినిమా చుడాలిసిందే?
కథనం, విశ్లేషణ: స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం హన్సిక కి ఇదే తొలి చిత్రం. ఈ సినిమాలో హన్సిక ఓ ట్రాప్‌లో పడుతుంది. ఆ ట్రాప్ లో నుంచి బయటపడిందా లేదా! అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఫస్ట్ హాఫ్ లో శృతి ఓ యువకుడి ట్రాప్ లో ఇర్రుకుంటుంది. ఆ ట్రాప్ సన్నివేశాలు తెర మీద చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించని విధంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మర్డర్ మిస్టరీ ని కనిపెట్టడానికి వచ్చిన మురళి శర్మ ఎంట్రీ తో సినిమాకి మరింత ఊపు అందుకుంటుంది. కేస్ ని సాల్వ్ చేసే ప్రోసెస్ లో నిజా నిజాలు బయటపడతాయి. తెరపై డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. స్కిన్ మాఫియా మీద ఇప్పటి వరుకు ఎలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం, అలాంటి సబ్జెక్టు ను తెర మీద కి తీసుకు వచ్చిన డైరెక్టర్ కి హ్యాట్సాఫ్. సినిమాలో కొన్ని సీన్స్ మిస్ లీడ్ చేసినప్పటికీ, అది డైరెక్టర్ లిబర్టీ తీసుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్క ఫ్యామిలి ఆడియన్ చూడాలిసిన సినిమా. సో, థియేటర్ లో తప్పకుండ చుడండి..!!
నటి నటులు పెర్ఫామెన్స్: సినిమాకి ప్రధాన బలం ‘హన్సిక’. హన్సిక సినిమాలో ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ ఇస్తూనే సినిమాని తన భుజాలపై నడిపింది. కొన్ని సన్నివేశాలలో ఎంతో ఇంటెన్స్డ్ గా యాక్ట్ చేసి సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. సాయి తేజ్ కొత్త వాడే అయ్యిన తన పాత్ర మేరకు ఆకట్టుకున్నాడు. మురళీ శర్మ ఎప్పటి లాగే తన మార్క్ ని కనబర్చారు. ప్రేమ, పూజా రామచంద్రన్ సినిమాకి ఎంతో కీలకం. ఆడుకాళ్ళమ్ నరేన్, రాజా రవీంద్ర తమ పాత్ర మేరకు బాగా రాణించారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు స్కిన్ మాఫియా గురించి తెరపై చూపించిన తీరు అమోఘం. ఫస్ట్ హాఫ్ కాస్త తడబడిన, సెకండ్ హాఫ్ లో రెచ్చిపోయాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి పే ఆఫ్ చేసిన విధానం బాగుంది. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం సినిమాకి అస్సెట్. చోటా.కె.ప్రసాద్ ఎడిటింగ్ తీరు పర్వాలేదు. కిశోర్ బోయిడపు సినిమాటోగ్రాఫి ఓ మేరకు ఆకట్టుకుంది.
బాటమ్ లైన్: ప్రతి కుటుంబంలో వెలుగుని నింపే కెరటం “శృతి”. / “The Shruthi spreads light in every family.”