చిత్రం: సౌండ్ పార్టీ
రేటింగ్: 2.75/5
బాటమ్ లైన్: క్లీన్ కామిడి ఎంటర్టైనర్ ‘సౌండ్ పార్టీ’
తారాగణం: విజె సన్నీ, హ్రితిక శ్రీనివాస్, శివన్నారాయణ అలీ, సప్తగిరి, పృథ్వి రాజ్, చలాకి చంటి, శైలజ ప్రియా, ప్రేమ్ సాగర్, భువన్ సాలూరు తదితరులు…
ఎడిటర్: అవినాష్ జి
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: మోహిత్ రెహమానిక్
ప్రొడ్యూజర్స్: రవి పాలిశెట్టి, మహేంద్ర గజేంద్ర
కథ, దర్శకత్వం: సంజయ్ శేరి
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన చిత్రంసౌండ్ పార్టీ
. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచిన ఈ చిత్రం, ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలవుతోంది. ముందుగా మీడియా కోసం ప్రీమియర్ షోని నిర్వహించారు. ఈ చిత్రం, ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!!
కథ:
విజె సన్నీ(డాలర్ కుమార్) ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన వ్యక్తి. తన తండ్రి శివన్నారాయణ(కుబేర్ కుమార్)తో కలిసి తక్కువ టైమ్ లో డబ్బులు సంపాదించి హ్రితిక శ్రీనివాస్(సిరి) ని పెళ్లాడాలనుకుంటాడు. ఒక రోజు ‘భూషణ్’ అనే ఒక వ్యక్తి దగ్గర బల్క్ లో అప్పు గా అమౌంట్ తీసుకొని ‘గోరుముద్ద’ రెస్టారెంట్ పెట్టి ఫుడ్ బిజినెస్ రన్ చేస్తారు. ప్రాఫిట్స్ బాగానే వస్తున్న సమయంలో ఫుడ్ బిజినెస్ మూత బడుతుంది. ఇక తప్పక, తండ్రి & కొడుకు ఒక తప్పుడు కేస్ లో జైలు శిక్ష అనుభవించాలని పృథ్వి రాజ్(యమ్.యల్.ఎ వరప్రసాద్)తో డీల్ కుదుర్చుకుంటాడు. ఇంతకీ ఆ కేస్ ఏంటి? జైలు కి వెళ్ళాక తిరిగి వచ్చారా? బయటపడటానికి ఎవ్వరు హెల్ప్ చేసారు? ఇంతకీ, ఆ కేస్ గురించి అంతా తెలిసే ఓప్పుకున్నారా? అనేది తెరపైన సినిమా చుడాలిసిందే?
కథనం, విశ్లేషణ:
ఇన్నోసెంట్ గా ఉండే ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ పై జరిగే కథ ఇది. రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ నుంచి తీసుకున్న ఈ కథ తెరపై ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకుందో తెలుసుకుందాం!
విజె సన్నీ(డాలర్ కుమార్) & హ్రితిక శ్రీనివాస్(సిరి) మధ్య జరిగి రొమాంటిక్ సన్నివేశాలు, కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. అలాగే, చలాకి చంటి(పత్తి సతీష్) తో సాగే కామిడి సిక్వెన్స్ సినిమాలో హైలైట్. ఎలాంటి బూతులు లేకుండా పంచ్ డైలాగులతో రెండు గంటలపాటు క్లీన్ కామెడీని తెరకెక్కించారు. క్లైమాక్స్ లో ఎమోషన్స్, సెంటిమెంట్స్ లేకపోయినప్పటికీ కథలో నుంచి ఫన్ రావటంతో ఆడియన్స్ ని అలరిస్తుంది. లేనిది ఊహించుకుంటే ఎలా ఉంటుంది. అందులో భాగంగా ‘బిట్ కాయిన్’ మీద జరిగే కామిడి సన్నివేశాలు అలరిస్తాయి. డబ్బులు కోసం ఫాదర్ అండ్ సన్ ఎంత దూరం వెళ్లారు? ఆ ప్రయాణంలో జరిగే కామిడి సన్నివేశాలను చక్కగా చిత్రీకరిస్తూనే, ఆటు పోట్లు ఎలా ఎదురుకున్నారు? వెన్నెల కిషోర్ అందించిన వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ఎస్సెట్. చివ్వరికి తన ప్రియురాలని ఎలా దక్కించుకున్నాడు అనేది సినిమా? మీరు కూడా మీ ఫ్యామిలీ తో తప్పకుండా థియేటర్ లో చూడలిసిన సినిమా.
నటి నటులు పెర్ఫామెన్స్: ‘విజె సన్నీ’ గత సినిమాలతో పోలిస్తే, ఈ సినిమాలో నటన కాస్త మెరుగ్గా ఉందనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో చేసిన కామిడి, టైమింగ్ బాగుంది. ‘హ్రితిక శ్రీనివాస్’ బలమైన క్యారెక్టర్ కాకపోయినప్పటికీ, స్క్రీన్ స్పెస్ ఉన్నంత వరుకు నటనతో ఆకట్టుకుంది. ‘శివన్నారాయణ’ తండ్రి క్యారెక్టర్ లో ఓదిగిపొయ్యి కడుపుబ్బా నవ్వించాడు. సప్తగిరి, చలాకి చంటి ‘కి’ రోల్ పోషించి ఆకట్టుకున్నారు. పృథ్వి రాజ్, అలీ, శైలజ ప్రియా, ప్రేమ్ సాగర్, భువన్ సలూరు తమ యాక్టింగ్ పరిధి మేరకు నటనతో మెప్పించారు.
సాంకేతిక విభాగం: దర్శకుడు ‘సంజయ్ శేరి’ ప్రతి ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కాస్త తడబడినప్పటికీ, సెకండ్ ఆఫ్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ‘అవినాష్ జి’ ఎడిటింగ్ తీరు పేలవంగా అనిపించింది. ‘శ్రీనివాస్ జె రెడ్డి’ అందించిన సినిమాటోగ్రఫీ ఓ మేరకు మెప్పించాడు. ‘మోహిత్ రెహమానిక్’ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలం. ‘రవి పాలిశెట్టి, మహేంద్ర గజేంద్ర’, నిర్మాతలు ఎక్కడ రాజి పడకుండా ఖర్చు పెట్టారు.
రివ్యూ బై: తిరుమలశెట్టి వెంకటేష్
గమనిక: మేము రాసే రివ్యూలు ఒక వ్యక్తి లేదా సంస్థ కి అనుకూలంగా కానీ, ఒకరిని ఉద్దేశించి రాసింది కాదు. కేవలం, మా రివ్యూర్ అభిప్రాయం మాత్రమే. మీరు పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసనీయం. మీరు అందించిన ఈ చిత్రం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.